మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు | Minister Etela Rajender attends in Grama jyothi awareness program | Sakshi
Sakshi News home page

మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు

Published Thu, Aug 13 2015 5:04 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు

మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు

కరీంనగర్ టౌన్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కరీంనగర్ జిల్లాకు చెందిన జెడ్‌పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. గురువారం కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రిని 'గ్రామజ్యోతిలో మా హక్కులు ఏమిటి?' అని జిల్లాకు చెందిన పలువురు జెడ్‌పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు నిలదీశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మా విధులు, నిధులు, హక్కులు ఏమిటో మంత్రి చెప్పాలని వారు కోరారు. సర్పంచ్‌లతో సమానంగా గ్రామజ్యోతి కార్యక్రమంలో హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement