awareness program
-
బైపాస్ సర్జరీ తర్వాత నాణ్యమైన జీవితాన్ని గడపాలి: డాక్టర్ తిరుపతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారని అమీర్‌పేట్‌లోని వెల్నెస్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న రోగులకు వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్తో పాటు బైపాస్ సర్జరీ చేసుకున్న వారు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా శారీరక వ్యాయమంతో పాటు ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో తాము తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 516 మందికి విజయవంతంగా బైపాస్ సర్జరీలు నిర్వహించినట్లు వారు తెలిపారు.రోగులకు ఖచ్చితంగా తగు మందులు వాడతంతో పాటు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుండె సమస్య వచ్చిందనగానే కంగారు పడాల్సిన పని లేదని ఇప్పుడు అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెరిగాయని నేటి రోజుల్లో బైపాస్ సర్జరీ అంటే సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి సుమన్ గౌడ్, వివేక్‌రెడ్డి, సీటీవీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శతి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రంజిత, ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
Cancer : క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్"
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్నెస్ రన్ "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర టీ షర్ట్‌ను విడుదల చేశారు. ఫిజికల్, వర్చువల్ మోడ్ల ద్వారా 130 దేశాల నుండి లక్ష మంది పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 8న జరగనుంది. ఈ ప్రయత్నంలో సైబరాబాద్ పోలీసులు రన్ నిర్వాహకులకు అండగా ఉంటారు. ఎప్పుడు : సెప్టెంబర్ 12, 2023 ఎక్కడ : క్షేత్ర స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్, దీంతో పాటు వర్చువల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ "క్వాంబియంట్ డెవలపర్స్ - గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" అక్టోబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో, నగరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సంక్షిప్త ఆవిష్కరణ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం దీనికి సంబంధించిన టీ-షర్ట్‌ను విడుదల చేశారు. గ్లోబల్ రన్ - నోబుల్ కాజ్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, "ఇది ఒక వైవిధ్యంతో నడిచే గొప్ప పరుగు" అని అన్నారు. "సైబరాబాద్ పోలీసులు గత సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా దీంట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇది స్పోర్ట్స్ ఈవెంట్ కాదు, ఇది గ్లోబల్ ఈవెంట్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 130 దేశాల నుంచి రన్నర్లు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌కు సహకరిండాన్ని సైబరాబాద్ పోలీసులు బాధ్యతగా భావిస్తున్నారు. ఇది మాకు గర్వకారణం. సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులకు అన్ని విషయాల్లో సహకరిస్తారు" అని తెలిపారు. "'బీ లైట్' అనే థీమ్‌తో 6వ ఎడిషన్ రన్లో 130కి పైగా దేశాల నుండి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారు" అని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వెల్లడించారు. రన్ నిర్వహించబోయిన విధానం: రన్ మూడు వేర్వేరు విభాగాలలో జరుగుతుంది. 5K, 10K, 21.1K (హాఫ్ మారథాన్). గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ పద్దతిలో భౌతిక పద్దతిలో, వర్చువల్ పద్దతిలో జరగనుంది. భారతదేశంలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో జరిగే ఏకైక రన్ బహుశా ఇదే. ఎడ్యుకేషన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్, అత్యాధునిక పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించే సదుద్దేశంతో లాభాపేక్షలేని సంస్థగా "గ్రేస్" క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దూరాన్ని పరిగెత్తడమే కాకుండా, తమ రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత భాగాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కోసం విరాళంగా ఇవ్వడం ద్వారా మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టవుతారు” అని డాక్టర్ చినబాబు తెలిపారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడం, సమాజంలో క్యాన్సర్‌ను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి శారీరక శ్రమను ప్రోత్సహించడం, ప్రజలు చురుకైన జీవనశైలిని అనుసరించడంలో సహాయపడటం, నిరుపేదలను వారి ఇంటి వద్దే ఉచితంగా పరీక్షించడానికి నిధులను సేకరించడానికి ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ రన్ గురించి ప్రజలకు అవగాహన: "గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అట్టడుగు వర్గాలకు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. చాలా కణితులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే నయం చేయవచ్చు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మారుమూల, మురికివాడల్లో నివసించే చాలా మందికి ఈ వాస్తవం గురించి తెలియదు. దురదృష్టవశాత్తు, వారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి, ఈ రన్ ద్వారా వారిని చేరదీసి, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనేది మా ప్రగాఢ కోరిక" అని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా 9.5 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనేది విస్మయం కలిగిస్తోంది. కాబట్టి, ఎక్కువ మంది దీని బారిన పడకుండా నిరోధించడానికి, ఫౌండేషన్ ఇప్పటివరకు 4 ఖండాలను కవర్ చేస్తూ 10 దేశాలలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన చర్చలు ఇంకా క్యాన్సర్ రన్లను నిర్వహిస్తోంది. -
అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసంకోసం వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్ కాన్సులేట్ పలు సూచనలు చేసింది. అమెరికాలో చదువు, ఆపై ఉద్యోగం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వెళ్తున్న విషయం విదితమే. అమెరికా వెళ్లే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీల ఎంపిక ఎలా? వీసా దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వీసా ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్సెన్ మాట్లాడుతూ, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారని, అమెరికాలో చదువుకుని స్థిరపడే వారి సంఖ్య ప్రతీయేటా పెరుగుతోందని ఆమె వివరించారు. వీసాల మంజూరులో... యూఎస్ వెళ్లే వారికి వీసా మంజూరులో ఆలస్యమవుతోందన్న ప్రశ్నకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి సమాధానమిస్తూ వీసాల జారీని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారికి అనుకున్న సమయంలోనే వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్లాట్లు విడుదలకాగానే బుక్ చేసుకోవాలని, వీసాకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధ్రువపత్రాలు చెక్ చేసిన తర్వాత, ఫింగర్‌ప్రింట్స్‌ను నమోదు చేసి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెక్ చేసిన వెంటనే వీసాను మంజూరు చేస్తున్నామని వివరించారు. వీసా స్లాట్ల బుకింగ్ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నాలుగు యూఎస్ కాన్సులేట్స్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్.. అమెరికాలో చదవాలనే విద్యార్థులకు ఉచితంగా ‘స్టడీ ఇన్‌ద యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ సుజనా మైరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నొవాటెల్ కన్వెన్షన్‌లో ఆగస్ట్ 26 ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫెయిర్ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమానాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎస్ఐఈఎఫ్.ఓఆర్జీ.ఐ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. అమెరికాలో 4,700 యూనివర్సిటీలు ఉన్నాయని, ఈనెల 26న నిర్వహించే ఫెయిర్‌కు 40 ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు యూనివర్సిటీ ప్రతినిధులు సమాధానమిస్తారన్నారు. ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా కనుక్కోవాలి? ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు సుజనా సమాదానమిస్తూ... అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని యూనివర్సిటీల వివరాలను అధికారికంగా వెబ్సైట్లలో ఉంచుతుందని చెప్పారు. జాయిన్ కావాలనుకున్న యూనివర్సిటీ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయో లేదో విద్యార్థులు చెక్ చేసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి అమెరికాకు చెందిన 8 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని.. వీటిలో సంప్రదించినా గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
మేనరికంతో ముప్పు.. రొమ్ము క్యాన్సర్‌ను ఇలా గుర్తించవచ్చు
ఈమధ్యకాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండెజబ్బులది కాగా, రెండోది క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకసారి వ్యాధి సోకిందంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత కోలుకొని తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. మరి ఈ మహమ్మారిని గుర్తించడం ఎలా? క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. డీఎన్ఏలో మార్పులే కారణం మనిషి శరీరం మొత్తం కణజాలాలతో నిండి ఉంటుంది. అయితే కణజాలం అనవసరంగా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. శరీరంలో సాధారణంగా కణాల విభజన నిత్యం జరుగుతూనే ఉంటుంది. కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. డీఎన్ఏ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగానే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే క్యాన్సర్ కూడా వారసత్వంగా వచ్చే అవకాశముంది. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర ఆహారపు అలవాటుల, రేడియేషన్ తదితర కారణాలతో డీఎన్ఏలో మార్పులు వస్తుంటాయి. దీంతో కొన్ని కణాలు చనిపోకుండా శరీరంలో అలాగే ఉండిపోతాయి. శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇలా పెరిగిన కణాలు ట్యూమర్ (కణితి)గా ఏర్పడడానే క్యాన్సర్‌గా పేర్కొంటారు. వ్యాధి కట్టడికి చర్యలు క్యాన్సర్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. క్యాన్సర్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వేను ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సర్వే శరవేగంగా జరుగుతోంది. ఎన్సీడీ సర్వే ద్వారా మూడు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో బాధితులను గుర్తించారు. సర్వే పూర్తయితే మరిన్ని కేసులు బయటపడవచ్చని వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.చాలా మంది వ్యాధి ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు గుర్తించకపోవడంతోనే పరిస్థితి ప్రాణాల మీదకు వస్తోంది. ఈ క్రమంలో క్యాన్సర్‌పై గ్రామీణ స్థాయి నుంచే ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా వారంలో ఐదు రోజులపాటు ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వేకి శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో స్క్రీనింగ్ పూర్తయ్యాక విండ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ద్వారా నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించి పీహెచ్‌సీల స్థాయిలోనే నిర్ధారిస్తున్నారు. అనంతరం ఆరోగ్య శ్రీలో భాగంగా ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం పూర్తిస్థాయి చికిత్సకు ఆస్పత్రులకు పంపుతున్నారు. క్యాన్సర్ రకాలు ఇవీ.. మూత్రాశయ క్యాన్సర్ : దీన్ని ప్రోస్టేట్ అంటే వీర్య గ్రంధి క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది పురుషులకు తక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ బాధితుల్లో మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రం, వీర్యంలో రక్తం పడుతుంది. బ్లడ్ క్యాన్సర్: రక్త కణాలు నియంత్రణ తప్పడం ద్వారా ఏర్పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, తరచూ జ్వరం, నోరు, చర్మం, ఊపిరితిత్తులు, గొంతు ఇన్ఫెక్షన్ తదితర లక్షణాలు ఉంటాయి. ముక్కు, చిగుళ్లు నుంచి రక్తస్రావమవుతుంది. రొమ్ము కాన్సర్ : రొమ్ములో వాపు, నొప్పి, రొమ్ముపై గడ్డలు, చనుమొనల నుంచి అసాధారణ స్రవాలు, చంకలో గడ్డలు ఆధారంగా ఈ వ్యాధిని గుర్తిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడే నిర్ధారించగలరు. అయితే మాటలో అసాధారణ మార్పులు.. ఛాతీ నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, గురక, విపరీతమైన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. పెద్ద పేగు క్యాన్సర్ : కొలోన్, రెక్టమ్ క్యాన్సర్లను కలిపి కాలో రెక్టల్ క్యాన్సర్ అని పిలుస్తారు. మద్యం సేవించడం, పాగతాగడం, ఆహారపు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ సోకుతుంది. పురుషుల్లోనే ఈ క్యాన్సర్ అధికం. ముందస్తు జాగ్రత్తలు.. పరీక్షలు ►పుట్టిన వెంటనే శిశువుకు హెపటైటిస్– బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. ► గర్భాశయ ముఖద్వారం (సర్వైకల్ క్యాన్సర్) రాకుండా అమ్మాయిలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ► 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మహిళల్లో క్యాన్సర్ అరికట్టేందుకు ఇది చాలా అవసరం. ► కొలోరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు) పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ► రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ప్రస్తుతం 3డీ మామోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత ద్వారా అత్యంత సూక్ష్మస్థాయిలో క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. ► మేనరికాలు, జన్యుపరమైన కారణాలతో వచ్చే సమస్యలకు అత్యాధునిక బీఆర్ఏసీ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ► గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు లిక్విడ్ బేస్డ్ పాప్‌స్మియర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ► ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు సీఎస్ వంటి అత్యాధునిక టెకాల్నజీ వినియోగిస్తున్నారు. ► క్యాన్సర్ దశాబ్దాలుగా మానవాళిని వణికిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ► జీవనశైలిలో మార్పుల కారణంగా బాధితుల సంఖ్య గణనీయంగాపెరుగుతోంది. పకడ్బందీగా సర్వే క్యాన్సర్ నివారణే ధ్యేయంగా ప్రస్తుతం జిల్లాలో ఇంటింటా సర్వే చేపట్టాం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఎన్సీడీ సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం సులభతరమని వివరిస్తున్నాం. – ప్రభావతీదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు -
ప్రతిరోజూ సవాలే.. అయితేనేం సమస్యలు అధిగమిస్తూ!
కుటుంబంలో ఒక సమస్య వస్తే దానిని అధిగమించడానికి చేసే ప్రయత్నంతో పాటు, మరికొందరిని అదే సమస్య నుంచి గట్టెక్కించేందుకు పడే తపనకు చిరునామా ‘స్వీట్ సోల్స్.’ చిన్నారుల జీవితాల్లో చేదును నింపుతున్న తీపిని దూరం చేయడానికి వేసిన మొదటి అడుగు ఇప్పుడు మరికొందరిలో అవగాహన పెంచుతోంది. సికింద్రాబాద్ యాప్రాల్‌లో ఉంటున్న నళిని సిరాంబి కన్సల్టింగ్ గ్రూప్‌లో ఉద్యోగినిగా రాణిస్తూనే టైప్ 1 డయాబెటిస్ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె స్వచ్ఛందంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా అమ్మాయి దిశన కు 12 ఏళ్ల కిందట టైప్1 డయాబెటిస్ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. అప్పుడు తన వయసు 12. నాకు అదో ఛాలెంజింగ్ కండిషన్ . ప్రతిరోజూ ఓ సవాల్‌లా ఉండేది. సాధారణంగా అన్నం, రోటీ అంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఆహారంలో మార్పులు చేయాలి. ప్రతిది మానిటరింగ్ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రాత్రిలోనే లైఫ్ మారిపోవచ్చు. ఆ సమయంలో ఎవరైనా ఊరట కలిగించే నాలుగు మాటలు చెప్పి, కాస్తంత ఓదార్పునిస్తే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించాను. ‘మా పాపకే ఈ సమస్య వచ్చిందా, ఇలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా..’ అని వెతికాను. ఎవరూ తెలియలేదు. ‘స్వీట్ సోల్స్’ అని ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేశాను. ముందు ఓ ఐదుగురు జాయిన్ అయ్యారు. తర్వాత తర్వాత పదుల నుంచి వందలు.. వెయ్యికి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2012 లో మొదలుపెట్టిన ఓ చిన్న ప్రయత్నం చాలామంది తల్లితండ్రులను కలుసుకునేలా చేసింది. మా పాపకు ఉన్న సమస్య చాలా మంది పిల్లలకు ఉందని అర్థమైంది. రాను రాను ఇదో మంచి అవగాహన కార్యక్రమంగా మారిపోయింది. అంకెలతో జీవనం.. టైప్ 1 డయాబెటిస్ పిల్లలను ఎలా చూసుకోవాలన్న విషయం మీద అవగాహన రావడానికే ఆరునెలల సమయం పడుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచే కాదు 24 గంటల వారి జీవనం అంతా అంకెలతో కూడుకున్నదే. ఏ సమయానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, మానసిక ఆరోగ్యం ఏంటి.. ప్రతీది చాలా జాగ్రత్తగా చూడాలి. మా పాప ఎనిమిదేళ్ల వయసు నుంచి కథక్ నేర్చుకుంటోంది. మందులు, మానిటరింగ్‌తో పాటు తన చదువు, ఇతర హాబీస్‌ను కూడా కంటిన్యూ చేయించాలి. ఇవన్నీ జీవనంలో ఓ భాగమై పోయాయి. నెలరోజులకోసారి ఇలాంటి పిల్లలున్న వారిని కలవడానికి పార్క్‌లలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకునేవాళ్లం. నేనొక్కదాన్నే కాదు మిగతావాళ్లకు కూడా ఉంది అని తెలిస్తే పిల్లలు కూడా చెప్పినట్టు వింటారని, వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని అర్థమైంది. సమస్యలను అధిగమిస్తూ.. స్వచ్ఛందంగా చేసే ఈ కార్యక్రమానికి డాక్టర్లు కూడా జత కలిశారు. దీంతో డాక్టర్లతో సెషన్స్ నిర్వహిస్తూ వచ్చాం. పిల్లలకు, పెద్దలకు విడి విడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలకు ఇన్సులిన్, ఇతర గ్యాడ్జెట్స్ కోసం నెలవారీ మందుల ఖర్చు ఆరు వేల రూపాయలకు పైనే పడుతుంది. సంపన్నులకు మాత్రమే ఈ ‘తీపి’ సమస్య వస్తుందనేమీ లేదు. కూలి చేసుకునేవారి పిల్లలకూ రావచ్చు. ఈ ఖర్చు వారి జీవనాన్ని మరింత కుంగదీస్తుంది. అందుకని, పేదలకు సాయం చేసేలా, ప్రభుత్వం ఇన్సులినన్ను సబ్సిడీ మీద ఇచ్చేలా వర్క్ చేస్తున్నాం. ఇన్సులిన్‌ను నిల్వ చేయాలంటే ఫ్రిజ్ ఉండాలి. ఎవరికైనా ఆ సదుపాయం లేదంటే, ఆ విషయాన్ని గ్రూప్‌లో షేర్ చేస్తాం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాటిని అరేంజ్ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో పాటు గ్రామీణులకూ చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. కార్యక్రమాల్లో పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా విడివిడిగా ప్రోగ్రామ్స్ ఆరేంజ్ చేస్తున్నాం. పిల్లలకు అర్థమయ్యేలా బొమ్మలను చూపిస్తూ వివరిస్తున్నాం. స్వీట్ సోల్స్ అనేది మా ఒక్క కుటుంబం కాదు, దేశమంతా టైప్1 డయాబెటిస్ ఉన్న వారందరిదీ. జీవనం సాఫీగా.. ఇప్పుడు మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసి, జాబ్ చేస్తోంది. త్వరలో విదేశాలకు వెళ్లబోతోంది. కథక్ నృత్యకారిణి. తన జీవనాన్ని తను చూసుకోగల సమర్థత పెంచుకుంది. ఈ స్ఫూర్తి టైప్1 డయాబెటిస్ ఉన్న పిల్లందరిలోనూ కలగాలి. ఈ సమస్య ఉన్నప్పటికీ బాగా చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. తమ జీవితాలను అర్థవంతంగా మార్చుకుంటూ, మరికొందరికి ఆద ర్శంగా నిలుస్తున్నారు’’ అని వివరించారు నళిని. ఇటీవల స్వచ్ఛందంగా నిర్వహించిన ‘స్వీట్ సోల్స్ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు నిత్యం తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. కోర్స్ చేశాను.. మా అమ్మాయికి 11 ఏళ్లు. ఆరేళ్ల క్రితం టైప్ 1 డయాబెటిస్ వచ్చింది. దీంతో డయాబెటిస్ పైన సర్టిఫైడ్ కోర్స్ చేశాను. స్వీట్ సోల్స్ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవడమే కాదు, నేను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా వివరిస్తుంటాను. అందరం కలుస్తాం అనే చోట ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, నిర్వహణకు సంబంధించిన పనులు ఏంటి.. అని స్వచ్ఛందంగా చూస్తుంటాను. – శిరీష అవగాహన అవసరం ఇరవై ఏళ్ల క్రితం నాకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నాను. పిల్లలకు వారి తల్లిదండ్రులకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా వస్తుంటాను. కోవిడ్ టైమ్‌లో జూమ్ ద్వారా ప్రోగ్రామ్స్ చేశాం. ఒక్కో నెల ఒక్కో పార్క్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల లోపు కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. – ఆకుల శ్రీదివ్య – నిర్మలారెడ్డి -
AP: ‘సంపూర్ణ గృహ హక్కు’పై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై ప్రజల్లో (లబ్ధిదారుల్లో) విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అంతా చొరవ చూపాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ పథకానికి సంబంధించి ఏకకాల పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్)పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈలోగా నియోజకవర్గాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రాష్ట్రంలో 51,08,000 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 39.7 లక్షల మంది రుణగ్రహీతలు, 12.1 లక్షల మంది ఇతరులు (రుణాలు తీసుకోని వారు) ఉన్నారు. డబ్బుల కోసం కాదు: మంత్రి బొత్స దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి బొత్స చెప్పారు. గతంలో ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్లు నిర్మించిన వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. డబ్బుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పొదుపు సంఘాల మహిళలకు దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. మండల, మునిసిపల్ సమావేశాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. 50 లక్షల మందికి ప్రయోజనం: సజ్జల రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ వసతి కల్పిస్తోందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా కృషి చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు: అజయ్‌జైన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు యూజర్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు కల్పించినట్లు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా బ్యాంకు రుణాలను కూడా పొందే వెసులుబాటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్ బాషా, మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేశ్, కురసాల కన్నబాబు, సీహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు దొరబాబు, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
YSR Asara: ‘వైఎస్సార్ ఆసరా’పై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు అక్టోబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు మందుకొస్తే అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని వివరించారు. పాదయాత్ర హామీ మేరకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకం అమలుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,470 కోట్లు మేర ప్రయోజనం చేకూరనుంది. వలంటీర్లు, వీవోఏ, ఆర్పీలు ఇప్పటికే తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సమాచారం అందిస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 24వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సెర్ప్, మెప్మా కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు నాలుగు రోజులు పాటు సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. అక్టోబరు 3, 4, 5, 6వ తేదీలలో సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాలు, వార్డులవారీగా సమావేశాలు నిర్వహించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సంఘాలకు ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు చెల్లిస్తుందన్న వివరాలను తెలియజేస్తారు. అక్టోబరు 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి నిర్వహిస్తారు. -
కరోనాపై పోలీసు శాఖ వినూత్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య, పారిశుద్ధ్య రంగ సిబ్బంది ఎంత కీలకపాత్ర పోషించారో పోలీసులూ అంతే స్థాయిలో సేవలందించారు. మరీ ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో రక్షక భటులు అందించిన సేవలు ప్రశంసనీయం. వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంలో సమర్థంగా వ్యవహరించి, ఆదర్శంగా నిలిచారు. అయితే, లాక్డౌన్ క్రమక్రమంగా సడలిస్తుండడంతో సాధారణ జీవితం మళ్లీ యథాస్థితికి చేరుతోంది. ఇదే క్రమంలో వైరస్ వ్యాప్తీ పెరుగుతోంది. గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో వరుసగా పండుగలు రానునుండడం, సెకండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రతిజ్ఞ–ప్రచారం కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతీ పౌరుడు మరింత బాధ్యతగా వ్యవహరించేందుకు కేంద్రం ఆదేశాల మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో వీటిని అమలు చేయాలని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: రెండోసారి కరోనా.. మరింత తీవ్రం) ఏం చేస్తారంటే.. ‘‘ప్రతీ మనిషికి ఆరడుగుల దూరం పాటిస్తాను. బహిరంగ ప్రదేశాల్లో తప్ప కుండా మాస్కు ధరిస్తాను. తరచూ చేతులను సబ్బు, శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటాను’’అంటూ సాగే.. ఈ ప్రతిజ్ఞను అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోనూ ప్రారంభించారు. బస్టాండులు, కూడళ్లు, ఇన్నిస్టిట్యూషన్, మహిళా సంఘాలు, ప్రైవేటు–ప్రభుత్వ ఆఫీసులు, తదితరాలను ఎంపిక చేసుకుని పోలీసులే స్వయంగా వెళ్లి వారితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ముఖ్యకూడళ్లు, ప్రజలకు బాగా కనిపించే ప్రాంతాల్లో భౌతికదూరం, మాస్కు వినియోగం, చేతుల పరిశుభ్రతపై చక్కటి హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు, సామాజిక దూరం ఉల్లంఘనలపై ఎపిడమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడంలేదు. అందుకే, ఈ వినూత్న ఆలోచన అమలుపరుస్తున్నారు. సెకండ్ వేవ్ చాలా డేంజర్.. దేశంలో కరోనా మొదటి దశ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్ని దారుణంగా దెబ్బతీసింది. త్వరలో సెకండ్ వేవ్ మొదలవనుంది. వరుసగా కురుస్తోన్న వర్షాలు, శీతాకాలం రానుండడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముంది. ఇటీవల కేరళలో ఓనమ్ పండుగ వల్ల లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం సెకండ్ వేవ్ తీవ్రత, దాని నివారణపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ప్రజలు ఎంతమేరకు భౌతిక దూరం పాటిస్తారన్నది అనుమానమే. అందుకే, రానున్న ఉపద్రవంపై ప్రజలను చైతన్యం చేయడానికి తెలంగాణ డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ జిల్లాలో ఎంతమందితో ప్రతిజ్ఞ చేయించారు? ఎందరికి అవగాహన కల్పించారు? తదితర విషయాలను ఏరోజుకారోజు డీజీపీ కార్యాలయానికి చేరేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి, రంజాన్ లాంటి పర్వదినాల సమయంలో ఆంక్షలతో వ్యవహరించడం మంచి ఫలితాలనిచ్చింది. అందుకే, రాబోయే పండుగల్లోనూ కేసులు అదుపులో ఉండేలా ఈ విధానం ఎంచుకున్నారు. భారీ వర్షాలు.. పోలీసుల సెలవులు రద్దు.. రాష్ట్రంలో వరుసగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంటులో సెలవులు రద్దు చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. పోలీసులంతా 24 గంటలు డ్యూటీలోనే ఉండాలని డీజీపీ ఆదేశించారు. గ్రామాల్లో విపత్తు నిర్వహణ దళం(డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్) అందుబాటులో లేని కారణంగా.. వాగులు, వంకలు, రిజర్వాయర్లు, వంతెనలు, కాలువలు, చెరువు గట్ల పరిస్థితిపై నీటిపారుదల, పంచాయతీశాఖ ఉద్యోగులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో ప్రతీ ఠాణా పరిధిలో గ్రామస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం సమాచారమార్పిడి చేస్తున్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. వరద, రోడ్డు, కరెంటు, ఇళ్లు, పాతగోడలు కూలడం, తదితర ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వెంటనే పోలీసులు స్పందించేలా ఎస్‌హెచ్‌వోలు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆ సినిమా కోసం బరువు తగ్గుతున్నాను
‘‘కథలో కొత్తదనం ఉండి నటిగా నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలు చేయాలన్నది ప్రస్తుతం నా ఆలోచన. నటిగా ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేసి విభిన్నత చాటుకోవాలనుంది’’ అన్నారు నటి నక్షత్ర. ‘రాజ్‌దూత్, పలాస’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన అచ్చ తెలుగు హీరోయిన్ నక్షత్ర. ఆమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ – ‘‘నన్ను హీరోయిన్గా చూడాలన్నది మా నాన్న కల. కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. గతంలో ‘లిటిల్ బుద్ధ’ అనే చిల్డ్రన్ ఫిల్మ్‌లో నటించాను. హీరోయిన్గా ‘పలాస 1978’ సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో పాత్ర కోసం సుమారు పది కిలోల బరువు పెరిగాను. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీ నన్ను బాగా రిసీవ్ చేసుకుంది. చాలా సపో ర్టివ్గా ఉంది. లాక్డౌన్లో ‘ఆహా’ ప్లాట్ఫామ్లో ‘గీతా సుబ్రహ్మణ్యం, మెట్రో కథలు’ ప్రాజెక్ట్‌లు చేశాను. అలానే కొన్ని కొత్త కథలు విన్నాను. అల్లు అరవింద్‌గారి గీతా ఆర్ట్స్‌లో ఓ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎంపికయ్యాను. అలాగే డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా కూడా అంగీకరించాను. ఆ సినిమా కోసం బరువు తగ్గుతున్నాను. లాక్డౌన్ ముందే ఓ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అందులో నెగటివ్ రోల్లో కనిపిస్తాను. ఈ బర్త్‌డేకి ఓ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎటు చూసినా ఆడవాళ్లపై అత్యాచారం అనే వార్తలే ఎక్కువగా వింటున్నాం. దానికి సంబంధించిన అవగాహన తీసుకురావాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. నటి కావాలని ఎంత కష్టపడ్డానో, ఈ ప్రోగ్రామ్‌కి కూడా అంతే కష్టపడతాను. ఓ బ్లాగ్ ఏర్పాటు చేసి ఓ కవిత ద్వారా దీనిని ప్రారంభిస్తాం’’ అన్నారు. -
‘నియంత్రిత సాగు కాదు.. ప్రాధాన్యత సాగు’
సాక్షి, సిద్ధిపేట: వ్యవసాయం దండగ కాదని.. పండగగా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలో నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 29న సీఎం కేసీఆర్ చేతుల మీదగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభమవుతుందని చెప్పారు. నియంత్రిత పంటల సాగు కాదు.. ప్రాధాన్యత సాగు అని రైతులకు వివరించాలని అధికారులకు ఆయన సూచించారు. (వివాహిత కారు చోరీ.. విచారణకు సీఐ డుమ్మా) దాతర్ పల్లి అంటేనే ఆదర్శ గ్రామమని, ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందన్నారు. గతంలో పంటలు పండించడం కోసం అప్పులు కోసం షావుకారు దగ్గరకి వెళ్లేవారని.. నేడు ఆ పరిస్థితి లేదని.. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం రైతు బంధు కింద రూ.5 వేలను అందిస్తుందని తెలిపారు. పండించిన ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తున్నామని పేర్కొన్నారు. నెలలోగా లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. వర్షాకాలం మక్కలు పండిస్తే నష్టం వస్తుందని.. కందిపంటను సాగు చేసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లలో ఫేస్‌బుక్‌లు,పబ్జీ గేమ్‌లు పక్కనపెట్టి.. పంటల పండించేందుకు తల్లిదండ్రులకు సహకరించాలని యువతకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. (సరిహద్దుల్లో అప్రమత్తం) -
‘వారి ధైర్యానికి ధన్యవాదాలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య కార్మికుల చేత అధికారులు పత్రిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, కమిషనర్ లోకేష్‌కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి పాల్గొన్నారు. (లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం) ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నగరాన్ని 20 వేలకు పైగా శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి.. నగరాన్ని మేమే శుభ్రం చేస్తామంటూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారని.. పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ధైర్యంగా పనిచేస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ సేవలు గుర్తించి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని వెల్లడించారు. జీహెచ్ఎంసీలో మరిన్ని మెరుగైన ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోల్చిస్తే హైదరాబాద్ మున్సిపాలిటీ మెరుగైన స్థానంలో ఉందన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. (తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్ లింక్‌లే..) -
తిరుపతిలో కరోనాపై అవగాహన కార్యక్రమం
-
ప్లాస్టిక్‌పై యుద్ధం
సాక్షి, ములుగు: ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే రాజ్యమేలు తోంది. పల్లె లేదు.. పట్నం లేదు.. ఇల్లు లేదు.. వాకిలి లేదు.. ఎక్కడ చూసినా ఈ మహమ్మారే కనిపిస్తోంది. చివరకు పచ్చని అడవులు, ఆహ్లాదపరిచే పర్యాటక ప్రాంతాలు, భక్తి తన్మయత్వాన్ని పంచే ఆలయాలకు నెలవైన ములుగు ఏజెన్సీ జిల్లాలో సైతం ప్లాస్టిక్ భూతం బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ మహమ్మారిని అరికట్టాలని నిర్ణయించారు. అయితే, ప్లాస్టిక్ వస్తువు లను ఇవ్వాలని అడిగితే ప్రజలు ముందుకురారని భావించిన ఆయన.. ఇందుకు ఓ ఉపాయం కని పెట్టారు. కేజీ ప్లాస్టిక్ అందించేవారికి కేజీ ఫైన్ రైస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో గతనెల 16 నుంచి 26 వరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా తొమ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 48,849 కేజీల ప్లాస్టిక్ సేకరణ జరగడం విశేషం. పైగా వరుస వర్షాలతో పనిలేక ఇబ్బందులు పడిన వారికి దీనివల్ల ఉపాధి కూడా కలిగినట్లయింది. ఇప్పటి వరకు సేకరించిన ఈ ప్లాస్టిక్‌ను డిస్పోజ్ చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను సిమెంట్ ఫ్టాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మేడారం జాతర వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. జాకారం నుంచి మొదలు... 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ ములుగు మండలంలోని జాకారం గ్రామాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు అక్కడ తిరుగుతూ కనిపించారు. దీంతో ఎస్పీ సంగ్రాంసింగ్ వారికి సరదాగా ప్లాస్టిక్ సేకరణ టాస్క్ ఇచ్చారు. దీంతో వారు మూడు బృందాలుగా విడిపోయి గంట సమయంలోనే ఏకంగా 996 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. వాటిని చూసిన నారాయణరెడ్డి.. ఒక్క గ్రామంలోనే ఇన్ని బాటిళ్లు ఉంటే జిల్లాలో ఎన్ని ఉంటాయో అని భావించి ప్లాస్టిక్‌పై సమరభేరి పూరించాలని నిర్ణయం తీసుకుని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బియ్యం కొనుగోలుకు విరాళాలు... ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది తరపున ప్రతీ గ్రామం నుంచి పాత, కొత్త బట్ట సంచులను సేకరించారు. స్థానిక టైలర్ల సహాయంతో సుమారు 40వేల బట్ట సంచులను సేకరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఇక ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా వెదురు బొంగులతో తయారు చేయించిన కప్పుల వాడకంపై జిల్లా సంక్షేమ శాఖ అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌కి అడ్డుకట్టగా మంగపేట మండల కేంద్రానికి చెందిన చికెన్ వ్యాపారి ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకొస్తే కేజీకి రూ.10 తక్కువ తీసుకుంటానని ప్రకటించాడు. ఇక ఫైన్ రైస్ కొనుగోలుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ వంతుగా విరాళాలు అందించారు. ఇలా అన్ని రంగాల ప్రజల చేయూతతో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ములుగులో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలవుతోంది. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వాడితే రూ.5వేల జరిమానా... జిల్లా యంత్రాంగం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలకు వచ్చే వారు బయటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, గ్లాసులు, ప్లేట్లు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు మండలం గట్టమ్మ ఆలయంతో పాటు జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసి వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ని తీసుకొని ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, ప్లాస్టిక్ రహిత గ్లాసులు, పేపర్ ప్లేట్లు అందిస్తారు. ఇందుకయ్యే ఖర్చును భక్తులు, పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు. మేడారంపై ప్రత్యేక దృష్టి కోటిమందికి పైగా హాజరయ్యే మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో ప్లాస్టిక్‌ని పకడ్బందీగా నిషేధించేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తమవుతోంది. జాతర జరిగే సమయంలో వెయ్యి మంది వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు. వీరంతా భక్తులను పరిశీలించి ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ నియంత్రణ కొనసాగుతుంది జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించారు. ప్లాస్టిక్ నియంత్రణ నిత్యం కొనసాగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరణ దాదాపుగా పూర్తిచేశాం. అలాగే ప్లాస్టిక్ వస్తువులు విక్రయించకుండా నోటీసులిచ్చాం. జిల్లాలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకు రాకుండా ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్దే కాకుండా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా మేడారం మహా జారతను ప్లాస్టిక్ ప్రీ జాతరగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. – చింతకుంట నారాయణరెడ్డి, కలెక్టర్, ములుగు జిల్లా -
గిల్లినా నవ్వుతున్నారు
ఏం చేస్తాం.. సమాజం ఇలా ఉంది! మార్చాలంటే మీ చేతుల్లో... మా చేతుల్లో ఉందా? అందరూ కలిసి కూర్చోని ఏడిస్తే మారుతుందా? నవ్వితే మాత్రం మారుతుందంటున్నారు షెఫాలీ పాండే, ప్రీతి దాస్ మారుస్తాం మారుస్తాం అని గ్యాస్ కొట్టకుండా లాఫింగ్ గ్యాస్‌తో మార్పు మొదలెట్టారు! గిల్లితే ఎవరైనా ఏడుస్తారు. కానీ సమాజంలో జరుగుతున్న తప్పులకు మనమే కారణమని వీళ్లు తొడపాశం పెట్టినా నవ్వుతున్నారు!! వ్యంగ్యం మంచి అస్త్రం! బాధ, ఆగ్రహం, ఆవేశాలను అదే రూపంలో తెలియపరచడం కంటే వ్యంగ్యానికి తర్జుమా చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తే చేరుకునే రీచ్ ఎక్కువ. అనుకున్న ఫలితం వచ్చే చాన్సూ ఎక్కువే! ఇప్పటికీ కంప్లీట్ హ్యూమర్ కన్నా కూడా వ్యంగ్యం కలిసిన హాస్యానికే మంచి ఆదరణ. అందుకే స్టాండప్ కామెడీకి.. కమెడియన్స్‌కి క్రేజ్ పెరిగిందిప్పుడు. ఎంత సీరియస్ ఇష్యూనైనా సరే వ్యంగ్యాన్ని జోడించి కామెడీ చేస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడే గాంభీర్యులు కూడా మనసారా నవ్వుకుంటూ ఆ సెటైర్లో దాగిన సమస్యను మెదడుకు ఎక్కించుకుంటున్నారు. అలాంటి స్టాండప్ కామెడీతో కాంట్రాసెప్టివ్ పిల్స్ నుంచి కథువా రేప్, బాలీవుడ్, డేటింగ్, చైల్డ్‌బర్త్, అచ్ఛేదిన్, మేకిన్ ఇండియా, బేటీ బచావో– బేటీ పఢావో వంటి సీరియస్, పొలిటికల్ ఇష్యూస్ దాకా.. అన్నిటి మీద వ్యంగ్యాన్ని జొప్పిస్తూ జోకులు పండిస్తున్నారు, నవ్వుతో జనాలను ఆలోచింపచేస్తున్నారు, అవగాహన కలిగిస్తున్నారా ఇద్దరు మహిళా స్టాండప్ కమేడియన్స్. ఎవరు? షెఫాలీ పాండే, ప్రీతి దాస్. ఎక్కడ? అహ్మదాబాద్‌లో... తొమ్మిదేళ్లు న్యూయార్క్‌లో, రెండేళ్లు ముంబైలో ఉండి అహ్మదాబాద్‌కు చేరుకుంది షెఫాలి. ప్రస్తుతం ఒక డిజిటల్ ఏజెన్సీని నిర్వహిస్తోంది. ప్రీతి దాస్.. వృత్తిరీత్యా జర్నలిస్ట్. పీహెచ్డీ స్టూడెంట్ కూడా. హాస్యం అంటే ఆసక్తి ఉన్న ఈ ఇద్దరూ 2017లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పుడే ‘‘మహిళా మంచ్’’ అనే ఆలోచనను పంచుకున్నారు. ఏమిటీ మహిళా మంచ్? ఇదో మహిళా స్టాండప్ కామెడీ గ్రూప్. రాజకీయాలు, సామాజిక సమస్యల మీద వ్యంగ్యంతో కామెడీని పంచుతున్నారు. మొదట్లో ఒక ట్రయల్‌గా ఓ స్నేహితురాలి ఇంట్లోనే స్టాండప్ కామెడీ ప్రయోగం చేశారు. డెబ్బై మంది హాజరయ్యారు. ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయిన షెఫాలి, ప్రీతి ఇక మహిళామంచ్ను ఆపేదిలేదని నిర్ణయించుకున్నారు. ‘‘బేటీ బచావో.. బేటీ పఢావో’’ అన్న నినాదాన్ని.. దేశంలో మహిళల మీద జరుగుతున్న లైంగికదాడుల నేపథ్యంలో ఇలా ‘‘మా.. బెహన్.. దాదీ.. బేటీ బచావో.. మా .. బెహన్, దాదీ, బేటీ ఛుపావో’’ అంటూ వ్యంగ్యంగా మార్చి రాసిన పోస్టర్స్‌ను పెట్టారు ఒక షోలో. టీ.. కాఫీ.. కామెడీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ‘‘మంత్లీ పీరియడ్ షో’’ పేరుతో నెలకొకసారి స్టాండప్ కామెడీ షోను నిర్వహిస్తునే ఉన్నారు. కేఫ్‌లు, రెస్టారెంట్స్, స్నేహితుల ఇళ్లే వాళ్ల వేదికలు. టీ, కాఫీతో పాటు కామెడీనీ సర్వ్ చేస్తారు. ఒక్కోసారి ఒక్కో గెస్ట్ స్పీకర్లను ఆహ్వానిస్తారు. ఆ స్పీకర్స్ వాళ్ల జీవితానుభవాలను హాస్యంతో పంచుకుంటారు. ‘‘దీనివల్ల ఈ షో చూడ్డానికి వచ్చిన వాళ్లు తాము పడ్తున్న కష్టాలను తేలిగ్గా తీసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అందువల్లే గెస్ట్ స్పీకర్స్నూ పిలుస్తున్నాం’’ అంటారు షెఫాలి అండ్ ప్రీతి. వ్యవస్థ మీదే తప్ప వ్యక్తుల మీద కాదు వ్యక్తుల బలహీనతలు, లోపాల మీద వీళ్లు కామెడీ చేయరు. మొదట్లో చెప్పుకున్నట్టు వ్యవస్థలోని లోపాలు, పాలసీల మీదే వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు విసురుతారు. ప్రీతిదాస్కు రాజకీయాల మీద కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆమె చేసే కామెడీ రాజకీయాల మీదే ఉంటుంది. షెఫాలీ మహిళా సమస్యల మీద బాగా స్పందిస్తుంది. అవే ఆమె హాస్యానికి అంశాలవుతాయి. రుతుక్రమం మీది అపోహల మీద ప్రీతి జోక్స్ వేస్తే వెంటనే డేటింగ్ మీద, దేశీ పోర్న్ మీద షెఫాలీ కామెడీ పుట్టిస్తుంది. అలా ఇద్దరు అప్పటికప్పుడు ఆశువుగా హాస్యాన్ని పండిస్తూ మహిళా స్టాండప్ కమెడియన్స్కున్న హద్దులు చెరిపేస్తున్నారు. కడుపుబ్బా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. ‘‘సహజంగానే బ్రెయిన్ అండ్ పవర్ తమ సొత్తు అనుకుంటారు మగవాళ్లు. మాలాంటి వాళ్లను వేదిక మీద చూసేసరికి కంగుతింటున్నారు. సమకాలీన రాజకీయాలు, టెక్నాలజీ మీద మేం జోక్స్ వేస్తుంటే చాలామంది నోళ్లు వెళ్లబెడ్తుంటారు. అన్నం, పప్పు, చారు, చట్నీ కాకుండా వీళ్లకు ఇవి కూడా తెలుసా? అన్నట్టు ఉంటాయి వారి ఎక్స్ప్రెషన్స్’’ అంటుంది షెఫాలీ. మా .. బెహన్ షో సాధారణంగా మన సమాజంలో మగవాళ్లను తిట్టే.. మగవాళ్లు తిట్టుకునే తిట్లు కూడా అమ్మ, అక్క ఆలీ మీదే ఉంటాయి. అలాంటి తిట్లకు చెక్ పెట్టడానికి వీళ్లు ‘మా.. బెహన్ షో’ చేశారు. విశేష ఆదరణ లభించింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్లోని పాటలకు పేరడీ పాటలు రాసి ఒక షో నిర్వహించారు. గుజరాత్‌లోని చట్టవ్యతిరేకమైన సారా వ్యాపారం మీద ‘‘అవర్ బేవ్డా గుజరాత్’’ పేరుతో కామెడీ షో చేశారు. దానికి ఆరువందల మంది హాజరయ్యారట. వీళ్ల షోలన్నీ ఉచితంగానే ఉంటాయి. కనీసం రికార్డ్ చేసుకొని యూట్యూబ్ చానెల్లో పెట్టుకోవడం, ఆ వీక్షణల ద్వారా డబ్బు సంపాదించుకోవడమూ ఉండదు. కారణం హాస్యాన్ని వాళ్లంత పవిత్రంగా చూస్తారట. షో అయిపోగానే ఓ హ్యాట్ పట్టుకొని ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్తారు తోచింది అందులో వేయమని అంతే. అలా వచ్చిన డబ్బు మైక్ ఖర్చులకు సరిపోతే చాలనుకుంటారు. జాగ్రత్త... జనాలు గమనిస్తున్నారు.. ‘‘ఎంత మా షోలను ఆదరిస్తున్నా ఛాందస, సంప్రదాయ అహ్మదాబాద్ ఏదో రకంగా మమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మా పేరెంట్స్ మా షోస్‌కి రారు. రాకపోగా... ‘జాగ్రత్త.. జనాలు గమనిస్తున్నారు’ అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంటారు. మావారు, మా అబ్బాయి మాత్రం ప్రతీ షో అటెండ్ అవుతారు. అరేంజ్మెంట్స్లోనూ హెల్ప్ కూడా చేస్తారు. మా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మా షోస్ చూసి ‘‘ మీ మీద ఫెమినిస్ట్లనే ముద్రేస్తారేమో జనాలు అంటూ భయపడ్తుంటారు’’ అని చెప్తుంది ప్రీతీ దాస్. ‘‘మా జీవితానుభవాలతోనే కామెడీ చేస్తాం కాబట్టి మా కామెడీలో నిజాలే ఉంటాయి’’ అంటుంది షెఫాలీ పాండే. ‘‘మంత్లీ పీరియడ్ షోస్‌ను ఇంకా విస్తరించాలనుకుంటున్నాం. మరింత మంది మహిళలు వచ్చేలా... మరిన్ని సిటీస్‌కి చేరేలా’’ అంటూ తమ లక్ష్యాన్ని చెప్పారు ఇద్దరూ. -
రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం
పరకాల : అగ్రకుల ఆధిపత్యంతో అణచివేయబడుతున్న బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు కోట్ల జనం ఒక్క గొంతుకగా ఉద్యమించడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో చేపటుతున్న బీసీల రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం పరకాలకు చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న యాత్రకు అంబేడ్కర్ సెంటర్ నుంచి పరకాల పట్టణంలోని బీసీలు బ్రహ్మరథం పలికారు. వేలాదిగా తరలివచ్చి డప్పుల చప్పుల్లతో యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎఫ్‌జే గార్డెన్లో ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య సభకు జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి సారంగపాణి , రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, మల్లికార్జున్, నియోజకవర్గ ఇన్చార్జి దేవునూరి మేఘనాథ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పంచగిరి జయమ్మ హాజరయ్యారు. ఓటు ‘మనదే..సీటు మనదే’ నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ బీసీలను రాజకీయంగా చెతన్యపర్చడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సదస్సులో 2వేల మంది బీసీలు పాల్గొన్నారు. బీసీలందరూ.. ఏకం కావాలి నర్సంపేట : రానున్న ఎన్నికల్లో రాజ్యాధిరాన్ని దక్కించుకోవాలంటే బీసీలు ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం నర్సంపేటకు చేరుకుంది. ఈ సందర్బంగా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓటు మనదే... సీటు కూడా మనదే అనే నినాదంతో చట్టసభల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ నుండి 21 శాతానికి తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను ఎదురించాలన్నారు. 2019 ఎన్నికల్లో నర్సంపేటలో బీసీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రకులాలకు బీసీలు వ్యతిరేకం కాదని న్యాయపరంగా మాకు దక్కాల్సిన ఫలాలను దక్కించుకోవడం కోసమే ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు బాల్నె సర్వేశం, బూర బీసీ నాయకులు రాజు, సత్యనారాయణ, సోల్తి సారయ్య, బొనగాని రవీందర్, ఏడాకుల మల్లారెడ్డి, జీజుల సాగర్, కొల్లూరి లక్ష్మి నారాయణ, పిట్టల సురేందర్, సాంబరాతి మల్లేషంలతో పాటు ఆయా విద్యాసంస్థల బాధ్యులు పాల్గొన్నారు. -
ఆమ్నెస్టీపై కార్మికులకు అవగాహన
మోర్తాడ్: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)పై కార్మికులకు ప్రధానంగా తెలంగాణ జిల్లాల వారికి అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లోని కార్మికుల క్యాంపుల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకుని స్వదేశానికి రావడం లేదా వీసా, వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకుని ఉపాధి పొందాలనే సూచనలతో ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధుల అవగాహన శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కార్మికుల కోసం నిర్వహిస్తున్న అవగాహన శిబిరాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ‘సాక్షి’తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ సలహా మేరకు తాను దుబాయ్‌లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. షార్జాలోని సోనాపూర్ శిబిరానికి దుబాయ్‌లోని తమ ప్రతినిధి ముత్యాల మారుతి ఆధ్వర్యంలో ఈరోజు వెళ్లి కార్మికులకు ఆమ్నెస్టీ విధి విధానాలపై అవగాహన కల్పించామన్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా తదితర పట్టణాల్లో ఉంటున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కల్లిబిల్లి కార్మికులు యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు మేనిఫెస్టోలో పేర్కొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై కార్మికులకు వివరిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో ఐదేళ్ల విరామం తరువాత అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ఆగష్టు ఒకటో తేదీ నుంచి మూడు నెలల పాటు అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆమ్నెస్టీపై ఇటీవలే యూఏఈ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ప్రొటెæక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం ద్వారా యూఏఈ ప్రభుత్వం చట్ట విరుద్దంగా ఉన్న విదేశీ కార్మికుల కోసం ఆమ్నెస్టీని ప్రకటించింది. ఈ ఆమ్నెస్టీతో ఎక్కువగా ప్రయోజనం పొందే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఉండటం విశేషం. -
పులివెందులలో సాక్షి కన్య కార్యక్రమం
-
హాజరు కాకుంటే సస్పెన్షనే: కలెక్టర్ రొనాల్డ్ రాస్
సంగారెడ్డి రూరల్ (మెదక్) : ఈ నెల 13న నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ విధులకు ఉద్యోగులు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తగిన కారణాలు లేకుండా సబ్‌స్టిట్యూట్‌ను ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు రెండో విడత అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండేందుకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులు ఎన్నికల నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లకు కూడా పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. -
ప్రత్యేకహోదా.. ఆంధ్రుల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అని కమలాపురం శాసనసభ్యుడు పీ. రవీంద్రనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు ఎస్బీ. అంజద్‌బాషా ఉద్ఘాటించారు. యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద బుధవారం వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడారు. ఉ స్మానియా విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యమైందని, అదే స్ఫూర్తి తో విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమబాట పట్టాలన్నారు. ఆర్థికంగా చితికిపోయి న రా ష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే మేలు జరుగుతుందని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుం దని ప్రచారం చేసి పదవీలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రస్తుత చంద్రబాబు సర్కారు కుట్రలు పన్నుతోందన్నారు. నిరుద్యోగభృతి చెల్లిస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన వారు నేడు వారి భృతికే పరిమితమయ్యారని విమర్శించా రు.జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన ఉక్కుపరిశ్రమ విషయంలో సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్షనేత వైఎస్జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉద్య మం చేస్తుంటే,సహకరించాల్సిన ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నా రు. ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న చంద్రబాబు కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేక రాష్ట్రప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శిం చారు. జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు సాగించాలని కోరారు. సమైక్యాంధ్ర స్ఫూర్తితో ఉద్యమం: అంజద్‌బాషా సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు చూపిన తెగువ, పోరాటం నేడు ప్రత్యేకహోదా విషయంలోనూ అవసరమని కడ ప శాసనసభ్యుడు ఎస్బీ. అంజద్‌బాషా అన్నారు. ప్రత్యేక హో దాపై టీడీపీ నేత లు, మంత్రలు భయపడుతున్నారన్నా రు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి దీక్షకు అడుగడుగునా, అడ్డం కులు సృష్టించడం ద్వారా చంద్రబాబు సర్కా రు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమని స్పష్టమైందన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎ స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు విద్యార్థులకు అభివాదం చేసి ఉద్యమానికి మద్దతు పలకాలని ఉత్తేజపరిచారు. వైఎస్ఆర్ సీపీ కడప నగర అ ధ్యక్షుడు నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, మైనారిటీ సెల్ నగర కార్యదర్శి ఎస్ఎండీ షఫీ, రైతు విభాగం అధ్యక్షుడు సంబ టూరు ప్రసాద్‌రెడ్డి, కార్పొరేటర్లు బండిబాబు, రామలక్ష్మణ్‌రెడ్డి, అధికార ప్రతి నిధి రాజేంద్ర, వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహమతుల్లా, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుడుంబాపై అవగాహన
గుడుంబా తాగడం వల్ల వచ్చే అనర్థాల గురించి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునగల్ గ్రామంలో సోమవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలు అధికంగా ఉండటంతో వాటిని ధ్వంసం చేయకుండా.. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. -
'నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు'
కొల్చారం (మెదక్ జిల్లా) : గ్రామాల్లో నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు ప్రబలి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. కొల్చారం మండలం వరిగుంతంలో గత ఆదివారం గ్రామస్థులు బాణామతి నెపంతో గ్రామానికి చెందిన దంపతులను పంచాయతీ పెట్టి బెదిరించి జరిమానా విధించారు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. పంచాయతీ నిర్వహించిన గ్రామపెద్దలపై సోమవారం కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో నెల క్రితం పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై కళాజాత నిర్వహించారు. అయినా గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతుండడంతో మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంగళవారం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుకు మెదక్ డీఎస్పీ రాజారత్నం హాజరయ్యారు. డీఎస్పీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు. సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ నిర్మల మాట్లాడుతూ.. మూడనమ్మకాలను దరిచేరనివ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, ఎస్సై రమేష్‌నాయక్, గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడివప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు. -
సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆముదాలవలస మండలం నిమ్మతుర్లివాడ గ్రామంలో వ్యవసాయ జీడీ అప్పల స్వామి ఆధ్వర్యంలో జరిగిన సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయన్నారు. వీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా ప్రజలు రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. పాడి పరిశ్రమలను రైతులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. -
మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు
కరీంనగర్ టౌన్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. గురువారం కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని 'గ్రామజ్యోతిలో మా హక్కులు ఏమిటి?' అని జిల్లాకు చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు నిలదీశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మా విధులు, నిధులు, హక్కులు ఏమిటో మంత్రి చెప్పాలని వారు కోరారు. సర్పంచ్‌లతో సమానంగా గ్రామజ్యోతి కార్యక్రమంలో హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
‘స్వచ్ఛ భారత్’లో డబ్బావాలాలు
ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, ముంబై: ఇకపై స్వచ్ఛ భారత్‌లో డబ్బావాలాలు భాగస్వాములు కానున్నారు. తమ మూడు లక్షల పైచిలుకు వినియోగదారులకు స్వచ్ఛ భారత్ మెసేజ్‌ను అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవగాహన కార్యక్రమంలో ‘ముంబై జేవిన్‌డబ్బే వాహతుక్ మహామండల్’కు చెందిన దాదాపు 3,500 నుంచి 4,000 మంది డబ్బావాలాలు పాల్గొననున్నారు. తమ వినియోగదారులకు పరిశుభ్రత కోసం పాటించాల్సిన నియమాలను చిట్టీల రూపంలో టిఫిన్ బాక్సుల్లో ఉంచుతామని డబ్బావాలా సంఘం అధికార ప్రతినిధి సుభాశ్ తాలేకర్ అన్నారు. టిఫిన్ బాక్స్‌లను సేకరించేటప్పుడు ఒక వాక్యం శ్లోకం, కీర్తనల ద్వారా కూడా వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ ప్లాన్ చేసినట్లు తెలిపారు. వీలైనన్ని మార్గాలను అనుసరించి అవగాహన కల్పించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచే ఈ ‘స్వచ్ఛ’ కార్యక్రమాన్ని డబ్బావాలాల సంఘం సతారాలోని ప్రతాప్ ఘడ్ కోట వద్ద స్వీకరించినట్లు తెలిపారు. -
2050 నాటికి ఉత్పాదకత రెట్టింపు కావాలి : పాలేకర్
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం) : దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 2050 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. సోమవారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) స్నాతకోత్సవ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని, వీరికి 50 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు అవసరమవుతాయని ప్రణాళికా సంఘం సూచించినట్టుగా తెలిపారు. అభివృద్ధి పేరుతో వ్యవసాయయోగ్యమైన భూమి క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూములను పరిశ్రమల్లో సృష్ట్టించలేమనే విషయాన్ని గుర్తించాలన్నారు. దేశం ఆహార నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడం సరికాదన్నారు. చిరు, పప్పు ధాన్యాలు, నూనెలు, పండ్లు వివిధ దేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని ప్రశ్నించారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ.. నేడు ప్రతీ ఆహార పదార్థం రసాయన పూరితంగా కనిపిస్తోందని, సహజ వ్యవసాయం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఏ.ఎస్ శర్మ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలేకర్‌ను రైతులు గజమాలతో సత్కరించారు. -
పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ
చౌడేపల్లి (చిత్తూరు జిల్లా) : ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్లతోటల పెంపకంపై చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో శనివారం రైతుల అవగాహన శిబిరం జరిగింది. చౌడేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు 250 మంది చిన్న, సన్నకారు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 రకాల పండ్లతోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, రైతులకు ఒక ఎకరానికి 76వేల రూపాయల లబ్ధి చేకూరుతుందని జిల్లా చిన్ననీటి యాజమాన్య సంస్థ అదనపు సంచాలకులు నందకుమార్‌రెడ్డి చెప్పారు. పండ్లతోటలు పెంచే రైతులకు ప్రభుత్వం మూడేళ్లపాటు సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరికరాలు ఉచితంగా అందజేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను ఉచితంగానూ, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీతోనూ అందజేయనున్నట్లు ఎపీఎంఐసీ అధికారి స్వర్ణలత వివరించారు. ఈ సదస్సులో హార్టికల్చర్ అధికారి లక్ష్మీప్రసన్న, ఏసీవో శివకుమార్, మేట్స్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. -
పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలి
ఒంగోలు సబర్బన్: నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలని కాకినాడ జేఎన్టీయూ వైస్ చాన్సలర్ (వీసీ) తులసీ రాందాస్ పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఒంగోలులోని ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాలులో కాకినాడ జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో యువ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహ న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండో రోజు మంగళవారం సదస్సుకు వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని అభివర్ణించారు. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం కాకినాడ జేఎన్టీయూలో ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ సెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తామన్నారు. మొత్తం ఈ సెల్ పరిధిలో 8 జిల్లాలున్నాయని, ఇప్పటికే మూడు జిల్లాల్లో అవగాహనా సదస్సులు పూర్తి చేశామన్నారు. కొత్త రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా స్థానిక అవసరాలతోపాటు ఎగుమతులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు నెరుపుకోవచ్చన్నారు. సహజ వనరులను వినియోగించుకోవడం, భూగర్భం నుంచి ఖనిజాలను వెలికితీసి వాటి ద్వారా ఉత్పత్తులను పెంపొందించుకోవడం చేయాలన్నారు. ఐటీ పార్కులు, మందుల తయారీ కంపెనీలు, ఓడరేవులు, వంతెనలు, విమానాశ్రయాలుతోపాటు అనేక రకాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున వాటికి సంబంధించిన నిపుణులుగా యువ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఎదగాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని ప్రతి ఒక్కరూ స్వంత ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి కొత్త పథకాల ద్వారా నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్విస్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కల్యాణ్ చక్రవర్తి, పేస్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ శ్రీధర్, ఏబీఆర్ చైర్మన్ బసివిరెడ్డి, కృష్ణచైతన్య కళాశాల చైర్మన్ చైతన్యలతోపాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాకినాడలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వీసీ చెప్పారు. -
ముగిసిన డెడ్‌లైన్..!
- నేటినుంచి సిద్దిపేటలో పాలిథిన్ కవర్ల నిషేధం - ఆకస్మిక దాడులకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు సిద్ధం సిద్దిపేటజోన్: ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు అధికారులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా నెల రోజులు పాటు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. మంగళవారం నాటినుంచి పట్టణంలో పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి పట్టణంలో పాలిథిన్ కవర్ల నిషేధం అమలులోకి రానుంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులకు బృందాలను ఏర్పాటు చేశారు. 40 మైక్రాన్ల మందం ఉన్న పాలిథిన్ కవర్లనే వాడాలనే నిబంధనను ఆమలు చేస్తూ నిర్ణీత మందం కన్నా తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్ల వినియోగంపై మున్సిపల్ అధికారులు నిషేధం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూ సమతుల్యత దెబ్బతినకుండా మున్సిపల్ అధికారులు నెల క్రితమే పట్టణంలో పాలిథిన్ కవర్ల నిషేధంపై విస్తృత ప్రచారం చేపట్టారు. అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ రమణచారి నేతృత్వంలో 30 రోజులుగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో రోజు వారీ సమీక్ష నిర్వహించారు. పాలిథిన్ కవర్ల వాడకం వల్ల కలిగే దుష్పలితాలను, ఇబ్బందులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గత నెలలో పట్టణంలోని పలు వ్యాపార వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులను నిర్వహించి కేసులు కూడా నమోదు చేశారు. జూలై మాసం నుంచి పూర్తిస్థాయిలో పాలిథిన్ కవర్లను నిషేధించనున్న క్రమంలో వ్యాపారులకు ఆవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. పాలిథిన్ కవర్లను విక్రయించే వ్యాపార సంస్థలకు ముందుస్తుగా నోటీసులు అందజేశారు. అదే విధంగా వ్యాపార వాణిజ్య సంస్థలకు సైతం ఆవగాహన కల్పించారు. మొదటి విడతలో జరిమానాలు విధించి మరోమారు అటువంటి పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సిద్దిపేటను పాలిథిన్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే అధికారుల అశయం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.