
పరకాల: సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
పరకాల : అగ్రకుల ఆధిపత్యంతో అణచివేయబడుతున్న బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు కోట్ల జనం ఒక్క గొంతుకగా ఉద్యమించడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో చేపటుతున్న బీసీల రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం పరకాలకు చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న యాత్రకు అంబేడ్కర్ సెంటర్ నుంచి పరకాల పట్టణంలోని బీసీలు బ్రహ్మరథం పలికారు. వేలాదిగా తరలివచ్చి డప్పుల చప్పుల్లతో యాత్రలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఎఫ్‌జే గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య సభకు జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి సారంగపాణి , రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, మల్లికార్జున్, నియోజకవర్గ ఇన్‌చార్జి దేవునూరి మేఘనాథ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పంచగిరి జయమ్మ హాజరయ్యారు. ఓటు ‘మనదే..సీటు మనదే’ నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ బీసీలను రాజకీయంగా చెతన్యపర్చడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సదస్సులో 2వేల మంది బీసీలు పాల్గొన్నారు.
బీసీలందరూ.. ఏకం కావాలి
నర్సంపేట : రానున్న ఎన్నికల్లో రాజ్యాధిరాన్ని దక్కించుకోవాలంటే బీసీలు ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం నర్సంపేటకు చేరుకుంది. ఈ సందర్బంగా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేశారు.
అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓటు మనదే... సీటు కూడా మనదే అనే నినాదంతో చట్టసభల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ నుండి 21 శాతానికి తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను ఎదురించాలన్నారు. 2019 ఎన్నికల్లో నర్సంపేటలో బీసీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
అగ్రకులాలకు బీసీలు వ్యతిరేకం కాదని న్యాయపరంగా మాకు దక్కాల్సిన ఫలాలను దక్కించుకోవడం కోసమే ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు బాల్నె సర్వేశం, బూర బీసీ నాయకులు రాజు, సత్యనారాయణ, సోల్తి సారయ్య, బొనగాని రవీందర్, ఏడాకుల మల్లారెడ్డి, జీజుల సాగర్, కొల్లూరి లక్ష్మి నారాయణ, పిట్టల సురేందర్, సాంబరాతి మల్లేషంలతో పాటు ఆయా విద్యాసంస్థల బాధ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment