jajula srinivas goud
-
సమగ్ర కులగణనకు సై!
సాక్షి, హైదరాబాద్: సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయాల్లో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్ర కులగణనకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సమగ్ర కులగణనకు సంబంధించిన జీఓ ఎంఎస్ 26ను జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. నిర్వహణకు రూ.150 కోట్లు...: ఈ సర్వే చేపట్టేందుకు కనీసంగా రూ.150కోట్లు బడ్జెట్ అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సర్వే ఖర్చు కోసం నిధులను 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ఈమేరకు తాజా ఉత్తర్వుల్లో బడ్జెట్ అంశాన్ని పొందుపర్చింది. సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉత్తర్వుల్లో వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తారు. జీఓ విడుదల హర్షణీయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమగ్ర కులగణన జీఓ విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలను సేకరింంచేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం. రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా. దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్ పేరు పెడుతున్నాం. -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
బీసీల మహాధర్నాతో హోరెత్తిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు. -
ధరలు వంద శాతం పెరిగితే, మెస్ చార్జీలు 25% పెంపా?
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులపై సీఎం కేసీఆర్ కలగజేసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసరాల ధరలు 100 శాతం పెరిగితే, మెస్‌చార్జీలు 25 శాతం మాత్రమే పెంచుతామనడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల మెస్ చార్జీలను 25 శాతం మేర పెంచాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశం నిర్ణయించడం హర్షణీయమైనప్పటికీ, ఈ నిర్ణయం గుడ్డిలో మెల్ల లాగా మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. పెరిగిన -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: జాజుల
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బండి స్వామి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ గౌడ్లను నియమించారు. అనంతరం జాజుల మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించకుండా పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. ఆర్టీసీలో చాలాకాలంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం జరిగే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధాన మంత్రికి మెయిల్ ద్వారా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 2021–22 బడ్జెట్ మొత్తం రూ. 39 లక్షల కోట్లు ఉండగా బీసీలకు కేవలం రూ. 2015 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా బీసీ గురుకుల పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ తదితర కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ, రాష్ట్ర నాయకుడు రాపర్తి సంతోష్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. -
చైర్మన్ శ్రావణిని అవమానించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణిని రాజకీయంగా వేధించి, అవమానపరిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఒక మహిళ మీడియా సమక్షంలో తనను వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం బాధాకరమని, మహిళా చైర్మన్‌ను రాజకీయంగా అణచివేయడమంటే మొత్తం బీసీ సమాజాన్ని అణచివేయడమే అవుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ మహిళలు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల హైదరాబాద్‌లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి వేధింపులు తాళలేకి కన్నీరు పెట్టుకుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు బీసీలను కించపర్చడం కొత్తేం కాదన్నారు. గతంలో బీసీ లేదు గోసిలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారని, రిజర్వేషన్లు ఎత్తేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారని జాజుల తెలిపారు. మరో వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే దేనికీ పనికిరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిపై సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. -
విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్ 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి భవన్లు నిర్మించుకోవడానికి నిధులు ఉంటాయిగానీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి భవనాలు నిర్మించడానికి నిధుల కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. చదువుకోసం, సామాజిక న్యాయసాధన కోసం తలపెట్టిన బీసీ విద్యార్థుల పోరుయాత్ర ముగింపు సభ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో జరిగింది. డిసెంబర్ 2న పాలమూరులో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను జ్ఞాన తెలంగాణ చేయకుండా గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ విద్యను వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బడులు మూసి, బార్లు తెరుస్తున్న కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బకాయిపడ్డ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఓటు మనదే.. సీఎం సీటు మనదే.. అని నినాదమిచ్చారు. ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకోసం రాజకీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్ర’
ఖైరతాబాద్ (హైదరాబాద్): బీసీ జనగణనపై పార్లమెంట్లో తీర్మానించకపోతే అమరావతి నుంచి హైదరాబాద్ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని ఒక హోటల్లో తెలంగాణ, ఏపీకి చెందిన బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో అన్ని వర్గాలకు.. వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు. ఈ విషయాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్రతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు శంకర్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర
మన్సూరాబాద్: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. -
బీసీలకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ పెడతా: జాజుల
మునుగోడు: త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రానున్న 2023 ఎన్నికల ముందు బీసీల పార్టీ పెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బీసీల ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లు, మరో 30 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారని, అందువల్ల బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీలకు టికెట్ ఇస్తే గెలవరని చెబుతున్నారని, మంత్రి పదవులు చేసిన అభ్యర్థులను ఓడించిన చరిత్ర బీసీలకు ఉందని జాజుల గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రాకు చెందిన నెల్లూరు ఆడబిడ్డకు ఎలా ఇస్తారని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలా తయారైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీల పార్టీ పెట్టి తాను మునుగోడు నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీసీల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరం కోసం పోరాడుతానని జాజుల వెల్లడించారు. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలని ఆయన కోరారు. -
ఢిల్లీ కేంద్రంగా బీసీలు ఉద్యమించాలి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యం సాధించాలని, బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, ఆగస్టు 7న ఢిల్లీలో తలపెట్టిన ‘ఓబీసీ జాతీయ మహాసభ’లో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి సారి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఆగస్టు 7న ఢిల్లీలో తలకోటోర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను శుక్రవారం మంత్రుల నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంపు డిమాండ్లపై బీసీలంతా ఐక్యంగా పోరాడాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభ: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. -
భూ బకాసురులను వదిలి గుడిసెల మీదా దాడి చేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు. -
విశ్వకర్మలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి జాజుల శ్రీనివాస్‌గౌడ్
పంజగుట్ట: విశ్వకర్మలపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్యని, ఆయన విశ్వ కర్మలకు బహి రంగ క్షమాపణ చెప్పా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి త్యాగం, ప్రొఫెసర్ జయశంకర్ ఆలో చనా విధానం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని గుర్తుం చుకోవాలని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ కుల, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భాష, యాష పేరుతో అణగారిన వర్గాల వారిని కించపరచడం కేసీఆర్, కేటీఆర్‌లకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. సంఘం నేతలు పున్నమాచారి, రాజేశం మాట్లాడుతూ ఆందోళన చేసిన విశ్వకర్మలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, ఓయూ జేఏసీ దరువు అంజన్న, రంగాచారి, బైరాగి మోహన్, మన్నారం నాగరాజు, ఇందిర, రవీంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం లేదని, రెండు మూడు కులాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండా ప్రకాశ్ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్...డి.శ్రీనివాస్ స్థానంలో బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సగంమంది బీసీలకు అవకాశం కల్పించారని కొనియాడారు. -
బీసీ క్రీమీలేయర్ రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు క్రీమీలేయర్‌ను విధించి, రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలుకాకుండా అడ్డుకుంటున్నారని, తక్షణమే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని అఖిల భారత బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. అఖిల భారత బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, ఓబీసీ పార్లమెంటు సభ్యుల ఫోరం మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ తైవాడే, బీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కరుణానిధి, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ సహా పలువురు పాల్గొని ప్రసంగించారు. దేశంలో వెంటనే బీసీ జనగణన చేపట్టాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి బీసీల సంక్షేమానికి కనీసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని వక్తలు కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టులో కనీసం లక్షమందితో ఢిల్లీ్లలో బీసీల మహాప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. సమావేశానికి దానకర్ణచారి, పాండు మల్లేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
రాజ్యాంగ పరిరక్షణలోనే మహిళా సాధికారత
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్): రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలోనే మహిళాసాధికారత ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– మహిళాహక్కులు, సాధికారత’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీతక్క మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరి హక్కులు, దేశ అస్తిత్వం గురించి చెప్పిన మహానీయుడని, ఆయన రాసిన రాజ్యాంగం ఈ సమాజం ఉన్నంతవరకు ఉండాలని అన్నా రు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, ఆదేశిక సూత్రా లను పటిష్టంగా అమలు చేస్తామని చెప్పాల్సిందిపోయి ఏకంగా దానినే మార్చాలనడం బాధాకరమన్నారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలనే మాటల వెనుక కుట్ర దాగి ఉంద ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ప్రశ్నించేహక్కు లేకుండా చేయడానికే రాజ్యాంగమార్పు అనే వాదనకు తెరతీశారని విమర్శించారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధ పాల న చేయడానికి సిద్ధంగా లేరని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, కేసీఆర్‌ను’అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యురాలు ఇందిరాశోభన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మి, రచయిత్రి దాసోజు లలిత, మాలమహానాడు మహిళా అ«ధ్యక్షురాలు గీతాంజలి, మాదిగ మíహిళా సాధికారత నాయకురాలు జె.పి.లత, బీసీ మహిళానేత భాగ్యలక్ష్మి, డాక్టర్ జరీనా సుల్తానా, గడ్డి పద్మావతి, టీడీపీ నాయకురాలు జోత్సా్న, ఐద్వా నాయకురాలు అరుణజ్యోతి, డాక్టర్ రత్నమాల, ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ నాయకురాలు చంద్రముఖి, బహుజన సోషలిçస్టు పార్టీ నాయకులు టి.ప్రదీప్ పాల్గొన్నారు. -
సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జాజుల
కవాడిగూడ: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, అదే రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం అవివేకమ న్నారు. రాజ్యాం గాన్ని మార్చాలని సీఎం చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమాన పరిచారని, దీనికి నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పెంచాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమాన్ని తెచ్చే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, ఇప్పటికే అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని విమర్శించారు.గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
జీవో 317ను రద్దు చేయాలి
పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్‌ను కోరారు. జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన, బిహార్ వాసి అయిన సీఎస్ సోమేష్ కుమార్‌కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ
పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌తో డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేనెల 13న ఢిల్లీలో బీసీల జంగ్ సైరన్: జాజుల
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల జంగ్ సైరన్ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 14న కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
పూలే, అంబేడ్కర్ల ప్రతిరూపం ఈటల
హైదరాబాద్: హుజూరాబాద్ రెండు పార్టీలకు, ఇద్దరు వ్యక్తులకు మధ్య జరిగే ఎన్నిక కాదని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పూలే, అంబేడ్కర్లకు ప్రతిరూపం ఈటల రాజేందర్ అని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం సబ్బండ వర్గాలకు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో డబ్బులు వెదజల్లుతూ, మద్యం పారించి అధికారం సొంతం చేసుకోవాలని అధికార పార్టీ చూస్తున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తిరుపతి, బద్వేలు ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదని గుర్తుచేశారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తిరుపతిలో గెలిచారని.. అలాగే బద్వేలులోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్ కూడా అలా చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో 50 లక్షల సభ్యత్వాలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలే 40 శాతానికి పైగా ఉంటారని, వారిని ఓటు వేసేందుకు, జెండాలు మోసేందుకు మాత్రమే వీరిని ఉపయోగించుకుంటున్నారని జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీసీ కులగణన చేయాల్సిందే: జాజుల
అచ్చంపేట రూరల్: పదేళ్లకు ఓసారి నిర్వహించే జనగణనలో బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అతిథిగృహం ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో జంతువులు, పక్షులను లెక్కబెడుతున్నారే గానీ..బీసీలను మాత్రం లెక్కించడానికి కేంద్రానికి మనసు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సీఎం కేసీఆర్ కూడా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. బీసీల కులగణనపై నవంబర్‌లో అన్ని రాష్ట్రాలు పర్యటించి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్లో భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆత్మగౌరవ పోరాటానికి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీసీ సంఘం నాయకుడు కాశన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కులగణనపై కాంగ్రెస్ వైఖరేంటి?: జాజుల
సాక్షి, హైదరాబాద్: జనగణనలో బీసీ కులాలవారీగా జనాభాను లెక్కించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయడం కాలయాపనకు దారితీస్తుందని, ఈ అంశంపై యుద్ధప్రాతిపదికన స్పష్టతనిచ్చి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రత్యేకంగా లేఖ ద్వారా జాజుల కోరారు. -
క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల
యాదగిరిగుట్ట: బీసీలకు క్రీమీలేయర్‌ను పెట్టి వారికి రిజర్వేషన్లు అందకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వెంటనే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉపాధ్యాయులకు వెంటనే పదో న్నతులు వాటిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరా రు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శుక్రవారం జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 47 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన సురేశ్, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన నరేంద్రస్వామి ఎన్నికయ్యారు. -
బీసీ జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతు ల్లో కులాల వారీగా జనగణన ప్రక్రియ చేపట్టే లా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. దీని పై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, కేంద్రానికి సమర్పించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గురువారం శ్రీనివాస్‌గౌడ్ లేఖ రాశారు. బీసీలకు విద్య, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనగణన కీలకమని పేర్కొన్నారు. -
బీజేపీకి బీసీ ఓట్లు అవసరం లేదా?: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే బీజేపీని బీసీలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణనను నిర్వహించేది లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని దేశంలోని 60 కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శనివారం దోమలగూడలోని బీసీ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో జాజుల మాట్లాడుతూ బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం నేడు మాట మార్చడం అంటే బీసీలను దగా చేయడమేనని ఆరోపించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని జనాభా లెక్కలు సేకరించాలని బీజేపీ పార్లమెంట్లో డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జనాభా లెక్కలు తీస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి జాజుల లింగం, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, విద్యార్థి సంఘం నాయకులు మహేశ్, చంద్రశేఖర్‌గౌడ్, రాజేందర్, సాయితేజ్, అరవింద్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెంచిన ఫీజులను ప్రభుత్వమే భరించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: గుట్టుగా పెంచిన ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజుల వసూళ్లకు తెగబడటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
‘విశ్వకర్మబంధు’ను ప్రకటించి అమలు చేయాలి: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విశ్వకర్మ సామాజికవర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్న ప్రభు త్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. దళిత బంధులాగే విశ్వకర్మల అభివృద్ధికోసం ‘విశ్వకర్మబంధు’ను తక్షణమే ప్రకటించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విశ్వకర్మలు తమ ఓటుద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. విశ్వకర్మీయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద విశ్వకర్మనేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జాజుల, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషాచారి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైన విశ్వకర్మల బతుకులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రకటించిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీబంధు అమలు చేయండి ఆదిలాబాద్‌లో తుడుందెబ్బ ధర్నా.. కలెక్టరేట్ ముట్టడి సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన దళితబంధు పథకం తరహాలోనే అత్యం త వెనుకబడిన తమ వర్గానికి కూడా ఆదివాసీబంధు అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున ఆదివాసీలు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్ట డించారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ బయటకు రాకపోవడంతో దా దాపు రెండు గంటలు ధర్నా కొనసాగించా రు. అనంతరం సమీపంలోని కుమురం భీం చౌక్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆదివాసీల ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ఆదివాసీబంధు అమ లు చేసి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే లంబాడా సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీలు సా గు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రా లు ఇవ్వాలని కోరారు. సాయంత్రం అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్ ఆదివాసీల దగ్గరికి రావడంతో వారు శాంతించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాగా, ఆదివాసీల రాస్తారోకో కారణంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సమయంలోనే రిమ్స్‌కు వెళ్లే అంబులెన్స్‌లు రావడంతో ఆదివాసీలు వాటి కి దారి వదిలారు. తుడుందెబ్బ జిల్లా అధ్య క్షుడు గొడం గణేశ్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డిసెంబర్లో ఓబీసీ మహాగర్జన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ డిమాండ్ చేసింది. ఇందుకోసం డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలో ఓబీసీ మహాగర్జన నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం తెలంగాణ భవన్లో మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు బాబాన్‌రావు తేవాడే అధ్యక్షతన సమావేశం జరిగింది. జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయాలని, నీట్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కోరారు. అలాగే క్రీమిలేయర్ ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇలా మొత్తం 8 డిమాండ్లకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాల అధ్యక్షులు కేసన శంకరరావు, జాజుల శ్రీనివాస్‌గౌడ్, 24 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. క్రీమిలేయర్‌ను రద్దు చేయండి క్రీమిలేయర్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని బీసీ ప్రతినిధుల బృందం.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. అలాగే దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, పార్కులు, పర్యాటక స్థలాలకు మహాత్మ జ్యోతిబా పూలే పేరు పెట్టాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విన్నవించింది. కాగా.. యూజీ, పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఓబీసీ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి జె.లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో పలువురు ఎంపీలను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. -
బార్ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?
సాక్షి, పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్రంలో బార్లు ఆఫ్‌లైన్ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్లో నడుస్తున్నాయని, బార్లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆన్లైన్ విద్య వల్ల సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేక గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో ఆన్లైన్ విద్య–బడుగు విద్యార్థుల అవస్థలు భవిష్యత్ కార్యాచరణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్రకమిటీ సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వారికి ఏడాది కాలంగా మిడ్డే మీల్స్ ఇవ్వడంలేదని, ఆ డబ్బుతో విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇప్పించవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థలు తెరవని పక్షంలో 24 గంటల దీక్ష, చలో హైదరాబాద్ అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని జాజుల హెచ్చరించారు. -
ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. క్షమాపణ చెప్పండి
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పలు సంఘాలు ఫైర్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగ సంఘాల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌గౌడ్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘంతో పాటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ స్కాలర్ కేశబోయిన రవికుమార్ నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కొందరు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి: టీజీవో ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరును అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) సూచించింది. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భంగా సీఎంకు గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా స్వీట్ తినిపిస్తే తప్పేముందని, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి నోటికొచ్చినట్లు, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని టీజీవో ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి: జాజుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కించపరిచేలా మాట్లాడటాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు, సైద్ధాంతిక విభేదాలు సాధారణమని, ఈ క్రమంలో వ్యక్తిగత విమర్శలు, దూషణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని శనివారం ఒక ప్రకటనలో హితవు పలికారు. జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి అని, 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే బీసీలంతా ఒక్కటై ఆయన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని హెచ్చరించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకోం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తోన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హెచ్చరించారు. జగ్గారెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిచిన శ్రీనివాస్ గౌడ్‌ను విమర్శించే అర్హత జగ్గారెడ్డికి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే జగ్గారెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. -
బీసీలకు ఇవ్వకుంటే గుణపాఠం తప్పదు: జాజుల
కవాడిగూడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీలకు బీఫామ్‌లు ఇవ్వకపోతే బీసీ ఓటర్లు గుణపాఠం చెప్పక తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో జూజుల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో జనాభాలో 10% ఉన్న అగ్రకులాలకు 50% జనరల్ స్థానాలను, జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 50 స్థానాలనే కేటాయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు బీ–ఫామ్‌లు ఇచ్చారని, బీ–ఫామ్‌లు తీసుకున్న ఎమ్మెల్యేలు మాత్రం జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. -
అప్పులు బీసీలకు.. సంపద అగ్రవర్ణాలకా?
నాంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కోత విధించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో 48 శాతం కోత విధించడం బాధాకరమని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ.5,960 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,672 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. అప్పులు బీసీలకు, ఆర్థిక సంపద అగ్రవర్ణాలకా? అని నిలదీశారు. జోగు రామన్న ఏ పాపం చేశారని మంత్రివర్గంలోకి తీసుకోలేదు? సకల జనుల సమ్మెను నడిపిన స్వామిగౌడ్ ఎక్కడికి పోయారు? ఆత్మబలిదానం చేసుకున్న దాసోజు కుటుంబం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలను గవర్నర్లుగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని అన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లకు ఆత్మీయ సత్కార అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంబీసీ అధ్యక్షుడు బంగారు నర్సింహ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు పోల శ్రీనివాస్, వెంకటనారాయణ, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు బండి సాయన్న, వీర భద్రయ్య సంఘం అధ్యక్షులు వీరస్వామి, ప్రొఫెసర్ ఆలెదాసు జానయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగాచారి, దూదేకుల సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీహరి యాదవ్, కురుమ సంఘం నాయకులు సదానందం, కనకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఐకమత్యం పెరిగింది’ వెనుకబడిన తరగతుల్లో ఐకమత్యం వచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఐకమ త్యం పెరగడంతోనే మంత్రివర్గంలోని మం త్రులకు ఉద్వాసన పలకడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. బీసీలపై చర్య తీసుకుంటే పీఠాలకే ఎసరు పెట్టినట్లు అవుతుందనే భయం పాలకవర్గంలో ఉందన్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రానికి రావడం కొత్త రాజకీయ నాందికి ఆరంభమని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గవర్నర్‌గా తెలంగాణకు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు. -
రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. -
‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’
సాక్షి, హైదరాబాద్: కోట్లాడి తెచుకున్న హక్కులు, రిజర్వేషన్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మన దేశంలో ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే ఆ కులం సంఘటిత మవుతుందని తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4వ నేషనల్ కన్వెన్షన్ రాష్ట్రీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల సభ నివాళి అర్పించి, వచ్చిన అతిధులను సన్మానించారు. ఈ సందర్భగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 72 సంవత్సరాలుగా దేశంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తెలంగాణలో మొత్తం 85 శాతం అణగారిన వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ‘వీపీ సింగ్ హయాంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన ఆగస్టు 7నే మహా సభలను నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ మహా సభలోనే బీసీలకు సంబంధించిన వెబ్ సైట్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పొందుపర్చామని, ఈ వెబ్సైట్ ద్వారా సభ్యత్వం కూడా తీసుకోవచ్చని తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారంతో అన్ని సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లతో ఆడుకునే అలవాటు పరిపాటి అయిందని, బీసీల ఆర్థిక ఎదుగుదలతోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 52 శాతం వరకూ ఉన్న బీసీ జనాభాలో సమస్యలపై పోరాడే నాయకులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ సభ డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు చేస్తే బీసీల సమస్యలు తీరవని.. భారత రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్నారు. దేశంలో బీసీ కార్పొరేషన్లకు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు అమలు చేసే పథకాలు, అన్ని రాష్ట్రాల్లోని సీఎంలు అమలు చేస్తే బీసీలకు ఎటువంటి సమస్యలు ఉండబోవని అన్నారు. సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫోరమ్ అధ్యక్షుడు జైపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సినీ నటుడు సుమన్, ఆర్. నారాయణమూర్తి, తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులు, ఓబీసీ మహిళా నేత, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించేందుకు బీసీ నేతలు సిద్ధ్దమవుతున్నారు. అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. బీసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ ఉద్యమాలు రాష్ట్ర స్థాయికే పరిమితం కావటం వల్ల ఉపయోగం ఉండటం లేదని, వాటిని ఢిల్లీ స్థాయికి విస్తరిస్తేనే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నెల 7న ‘జాతీయ ఓబీసీ మహాసభ’నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 7న ఉదయం 11 నుంచి జరగనున్న ఈ సభకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. 29 రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ సమన్వయపరుస్తుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను జాజుల ఆదివారం ఆవిష్కరించారు. కాగా, జాతీయ ఓబీసీ మహాసభ అనంతరం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సభలో చేసిన తీర్మానాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నాయి. హైదరాబాద్‌లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ నాలుగోది. మొదటి సభను నాగ్‌పూర్‌లో నిర్వహించగా, రెండోది ఢిల్లీలో, మూడోది ముంబైలో నిర్వహించినట్లు జాజుల తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఆయన మాటల్లోనే.. - 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు మినహా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో బీసీలు మినహా మిగతా అన్ని కులాలకు చెందిన వారు చట్టసభల్లో కాలుపెట్టారు. బీసీల్లోని వందల కులాలు ఇప్పటికీ చట్టసభల ముఖం చూడలేదు. ఈ నేపథ్యంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్. - దేశ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి బీసీని మంత్రిగా నియమించాలి. - ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకు మాత్రం పరిమితులు, 50 శాతం సీలింగ్‌ను చూపి దాటవేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. దాన్ని చట్టసభల్లో, ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేయాలి. - బీసీ జనాభాను కులాల వారీగా వర్గీకరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు విభజించి ఆయా కేటగిరీల్లోకి కులాలను నిర్దేశించి సమప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలపై ఉన్న క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలి. -
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి అన్ని అవకాశాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని బీసీ ప్రతినిధుల బృందం పేర్కొంది. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్‌ను జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జాతీయ ఓబీసీ మహా సభ నిర్వహణ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీల క్రీమిలేయర్ రద్దు, బీసీ జనగణన నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతం అమలు చేయాలని, చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని, అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్లను ప్రారంభించాలని సీఎంను కోరినట్లు వారు తెలిపారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీసీ మేధావులు, బీసీ సంఘాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు. ఆగస్టు 7న హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్లు బీసీ నేతలు చెప్పారు. జాతీయ ఓబీసీ మహాసభ అధ్యక్షుడు కేసన శంకరరావు, కె.ఆల్మేన్ రాజులు, కన్నా మాష్టారు, వెంకటేశ్వర్లు, కిషోర్, రంగనాథ్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, పరమశివం, గుండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన మాజీ జడ్జి
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అఖిల భారత బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి అభినందించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పలువురు బీసీ నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా బలహీన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారు. (చదవండి: బీసీలకు ఏపీ సర్కార్ బంపర్ బొనాంజా) -
బీసీ జాబితా ధర్మసత్రం కాదు: జాజుల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను అడ్డు పెట్టుకుని రోజుకొక కులాన్ని బీసీల్లో కలుపుతూ బీసీ జాబితాను ధర్మసత్రంగా మారుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ప్రభుత్వం బీసీ జాబితాలో కొత్త కులాలను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దోమలగూడ బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండేళ్లు అవుతున్నా బీసీల ప్రయోజనాల కోసం పని చేయకపోగా తాజాగా 30 కులాలను బీసీ జాబితాలో కలుపుతామనడం బీసీల ప్రయోజనాలను దెబ్బ తీయడమేనని విమర్శించారు. బీసీ కమిషన్ ఇప్పటి వరకు బీసీ గణన నిర్వహించలేదని, బీసీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, సామాజిక బహిష్కరణల వంటి చర్యలపై ఏనాడు స్పందించలేదన్నారు. ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో కలపాలి బీసీ కమిషన్ బీసీ జాబితాలో కలపాలనుకుంటున్న 30 కులాలు అత్యంత పేదరికం, వివక్ష, అంటరానితనానికి గురైన మాట వాస్తవమని ఇలాంటి కులాలను ఎస్సీ, లేదా ఎస్టీ జాబితాలో కలిపితేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా రోజుకొక కులాల్ని కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాసు, నరాల సుధాకర్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంజనీరింగ్’ ఫీజులు పెంచకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులను పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు అన్యాయం జరగకుం డా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ స్వరూపరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం దేశంలో ఏక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫీజును ఒకేసారి 40 శాతానికి పెంచుతున్నారన్నారు. దీంతో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని ప్రైవేటు కళాశాలలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వార్షిక ఫీజు కాకుండా, స్పెషల్ ఫీజు, యూనివ ర్సిటీ, అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో వేల రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీ లు ఫీజులు పెంచినా ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు మాత్రమే ఇస్తుం దన్నారు. విద్య అనేది సామాజిక సేవ అనే భావనను తప్పించి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యజమాన్యాలు వ్యాపారం చేస్తు న్నాయన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపట్టకుండా, కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూడటం వల్ల విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. -
బీసీల మద్దతుతోనే మోదీ, జగన్ విజయం: జాజుల
సాక్షి, హైదరాబాద్: బీసీ ఓటర్ల మద్దతుతోనే ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అఖండ మెజార్టీతో గెలుపొంది కేంద్రంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు
హైదరాబాద్: సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గత స్థానిక సంస్థల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ రిట్ పిటిషన్ వేసి బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించామని గుర్తుచేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కులాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ఎంబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ జిల్లాల వారీగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రస్తుత పాలకుల అడ్డగోలు విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, సుప్రీం గైడ్‌లైన్స్‌ను బూచిగా చూపిస్తూ చాలా జిల్లాల్లో ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. బీసీలు తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ, మనకు సంబంధంలేని 50 శాతం రిజర్వేషన్లు చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సబబుకాదన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి జనరల్ కోటాలో ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో వారినే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో, విద్య, ఉద్యోగాల్లో, ఎంబీబీఎస్ సీట్లల్లో కూడా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఆదరబాదరాగా ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని రిజర్వేషన్ల అంశం తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ బీసీ ద్రోహిగా మిగిలిపోతారు: జాజుల జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 5,843 ఎంపీటీసీలు ఉన్నారని, గతంలో 34 శాతం బీసీలకు కేటాయించగా 1,987 ఎంపీటీసీలు ఉండేవని, ప్రస్తుతం 1,011 మాత్రమే కేటాయించారన్నారు. దీంతో 972 ఎంపీటీసీలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 534 ఎంపీపీలు ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు 182 ఉండగా, ప్రస్తుతం 94 మాత్రమే కేటాయించారని, ఇక జెడ్పీటీసీలు 535 ఉండగా గతంలో 182 స్థానాలు బీసీలకు ఉండేవని, ప్రస్తుతం దాన్ని 17 శాతానికి కుదించారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం 32 ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్‌తో 11 మంది ఉండేవారని, ప్రస్తుతం 19 శాతానికి కుదించి 6 జెడ్పీ చైర్మన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని, దీంతో 5 సీట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.ఎల్.మల్లయ్య, బహుజన్ ముక్తి పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అభ్యర్థి వి.దాస్‌రాం నాయక్, గోపాల్‌తోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీలను మోసం చేసిన కేసీఆర్
హైదరాబాద్: ఎంపీ టికెట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీసీలను మరోసారి మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్న బీసీలకు మొండి చేయి చూపి అగ్రకులాల వారికే పెద్ద పీట వేశారన్నారు. చిక్కడపల్లిలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐదు శాతం ఉన్న రెడ్లకు ఐదు టికెట్లు కేటాయించి 56% ఉన్న బీసీలకు మూడు టికెట్లే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యను వ్యాపారం చేసే వారికి, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లకు టికెట్లు కేటాయించి, సామాజికవేత్తలను విస్మరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ను తెలంగాణ రెడ్ల సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మలిఉద్యమకారులను విస్మరించటం సరికాదన్నారు. కేసీఆర్ సైతం పోటీ చేస్తే ఓడిపోయే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించి అవమానించారన్నారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దీనికి బీసీలంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కొట్టేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ చట్ట సవరణ వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్ తెలిపారు. దీని వల్ల ఓపెన్ కాంపిటీషన్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహించం
హైదరాబాద్: తెలంగాణలో బీసీల ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 22%కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరు తూ శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ, అఖిలపక్ష నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 54% ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల రాజ్యం తీసుకురావడానికి రాత్రికి రాత్రే దొంగచాటుగా బీసీలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం అయింద న్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను కొనసాగించాలని ఎంబీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన బీసీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు మల్లయ్య, జి.నరేశ్, కిల్లె గోపాల్, రాకేశ్ నాయి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల కోసం ప్రత్యేక పార్టీ: జాజుల
హైదరాబాద్: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీల కోసం 2023 నాటికి ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాజుల మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు మొండిచేయి చూపాయని విమర్శించారు. బడుగుల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పిడికెడు ఉన్న అగ్రకులాల వారే రాజ్యాన్ని ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప వారి బతుకుల్లో మార్పు రాదని అన్నారు. 9 నెలల ముందే ఎన్నికలు రావటం వల్ల పార్టీని పెట్టలేకపోయామని తెలిపారు. తాను ఏ అగ్రకుల పార్టీ బీఫాంతో పోటీ చేయనని, స్వతహాగా పార్టీ పెట్టి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయిస్తే.. బీఎల్ఎఫ్ మాత్రం బీసీలకు 59 సీట్లను కేటాయించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ వచ్చిందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోం.. ఈ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని జాజుల స్పష్టం చేశారు. జెండాలు, పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అయ్యే వరకు ఉద్యమిస్తానని చెప్పారు. బీఎల్ఎఫ్ వస్తే బీసీని సీఎం చేస్తామన్న తమ్మినేని వీరభద్రాన్ని ముందు నీ పదవిని బీసీకి ఇవ్వాలని మంద కృష్ణమాదిగ అనటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. బీసీలకు 59 సీట్లు ఇచ్చిన ఘనత వారిదే అని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే నాయకులు పాల్గొన్నారు. -
‘బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ అణచివేతకు నిరసనగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందిలో 21 మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై మండి పడ్డారు. బీజేపీ 66 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 14 మంది బీసీలకే అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు కలిపి 40 నుంచి 50 సీట్లే కేటాయించడాన్ని వ్యతిరేకించారు. 11న టీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్‌లు ఇస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ తో అదే రోజు నిరసనలకు పిలుపునిచ్చారు. -
4న విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ సభ
హైదరాబాద్: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సాధనకు వచ్చేనెల 4న నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో లక్షన్నర మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సభ పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే విశ్వబ్రాహ్మణుల సమస్యలు తీరుతాయనుకుని ఉద్యమంలో ముందుండి పోరాడామని, రాష్ట్రం వచ్చాక కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి పాలకమండలి నియమించాలని, యాభై ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు రూ. 5 వేల పింఛను ఇవ్వాలని, నిరుపేద విద్యార్థులకు విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటుగా ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ ‘బీ’నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని కోరారు. తమ డిమాండ్లు ఏ పార్టీ నెరవేరుస్తుందో వారికే తమ పూర్తి మద్దతిస్తామన్నారు. సభకు అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డె సుదర్శనాచారి, ప్రధానకార్యదర్శి బచ్చల పద్మాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుపూరి వీరాచారి, కోశాధికారి మోత్కూరి వీరభద్రాచారి, గోపాలచారి, శ్రీనివాస్, బాలాచారి, బ్రహ్మంతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి: జాజుల
హైదరాబాద్: రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీ కులాలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి ఈ నెల 28న హైదరాబాద్‌లో 112 బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, సామాజిక ఉద్యమ నేతలు, అన్ని పార్టీల బీసీ రాజకీయ నేతలతో కలసి ‘బీసీల అలయ్–బలయ్’నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ కుందారం గణేశ్‌చారి, కోఆర్డినేటర్ కొండ దేవన్న, కుల్కచర్ల శ్రీనివాస్, ఈడిగ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మేనిఫెస్టోలో బీసీల ఊసేది: జాజుల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల ఊసేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ బీసీల కనీస డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీసీల ఓట్లు అవసరం లేదేమోననిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీలకు కేవలం 20 టికెట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన బీసీ ఉప ప్రణాళిక ఇంతవరకు అమలుకే నోచుకోలేదని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో బీసీలంతా కలసి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను సైతం ఓడించిన సంగతిని కేసీఆర్ మరిచిపోవద్దని సూచించారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. -
బీసీ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును ఆయన కలిశారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన ‘బీసీ పాలసీ’ పుస్తకాన్ని కేశవరావుకు అందజేశారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచటంతోపాటు గత డిసెంబర్లో రూపొందించిన ‘బీసీ నివేదిక’అమలు అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరచాలని కేకేను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన.. ‘బీసీ పాలసీ’ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, మేనిఫెస్టోలో పొందుపరిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శక్తిగా ఎదగాలి ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయ శక్తిగా ఎదగాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమ్మేళన సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీసీలను వివక్ష, అణచివేతకు గురిచేస్తున్న పార్టీలకు జెండాలను మోసేవారు వాస్తవాలను గ్రహించాలని కోరారు. కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మారోజు వీరన్నను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 57 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్నో వేలాది మంది అమర విద్యార్థుల త్యాగాల పోరాట పునాదులపై ఏర్పడిన తెలంగాణ నేడు దొరల పాలైందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, కళాకారుడు సోమన్న, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పాపారావు పాల్గొన్నారు. -
రాజ్యాధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన బీసీ సంఘం ఇకపై రాజ్యాధికారమే ఏకైక ఎజెండాగా పని చేయనున్నట్లు బీసీ రాజకీయ సమితి (బీఆర్ఎస్) ప్రకటించింది. రాయితీల నుంచి రాజ్యాధికారం వైపు బీసీలు దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ రాజకీయ యుద్ధభేరి జరిగింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ భేరీకి ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ భబన్‌రావు థైవాడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్రాజు, బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సినీ నటి రమ్యశ్రీ, సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బి.యాదగిరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, రచయితల సంఘం అధ్యక్షుడు శేఖర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుల్కచర్ల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు కె.శ్యాం కురుమ, పూలే కమిటీ చైర్మన్ గణేషాచారి తదితరులతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి ఐదు వేల మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బీసీ రాజకీయ సమితికి ఏ పార్టీలతో కూడా సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ అయితే బీసీకి టికెట్ ఇస్తుందో.. ఆయా అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీసీ అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 30 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. యుద్ధభేరి వేదికగా 9 మంది అభ్యర్థుల పేర్లను కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీ ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న బీసీ సంక్షేమ సంఘం... రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ రాజకీయ వేదికను ఏర్పాటు చేçసినట్లు ప్రకటించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించనుందని తెలిపింది. విజన్ 2024 నాటికి పూర్తి రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఖర్చుపై కమిటీ వేయాలి: జస్టిస్ ఈశ్వరయ్య ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు విలువలు, సేవ చేసే తత్వం ఉన్న అభ్యర్థుల కంటే బాగా ఖర్చు చేసే వారికే టికెట్లు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయా అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. సేవకులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు టికెట్లు ఇస్తే.. చట్టసభలకు ఎన్నికైన తర్వాత వారు ప్రజలకేం సేవ చేస్తారు. తెలంగాణలో ఒకటి, అర శాతం ఉన్న కులాలు 56 శాతం జనాభా ఉన్న కులాలను పాలిస్తున్నాయి. రాజ్యాధికారంలో వాటా దక్కాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి. రాష్ట్ర ఏర్పాటు తర్వాతే అన్యాయం: జాజుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. పార్టీ పగ్గాలు, బీఫాంలను వారు తమ చేతిలో పెట్టుకుని గెలుపు గుర్రాలు, సిట్టింగ్‌ల పేరుతో టికెట్లు అమ్ముకుంటున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అలాంటి పార్టీకు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతాం. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అదే ప్రతిపాదికన సీట్ల కేటాయింపు జరగాలి. లేదంటే ఆయా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే... కొల్లాపూర్: మాచర్ల రామకృష్ణగౌడ్ నర్సాపూర్: సోమన్నగారి లక్ష్మక్క సూర్యాపేట: రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ నర్సంపేట్: మధన్‌కుమార్ దేవరకద్ర: రాచాల యుగేందర్ గౌడ్ సిరిసిల్ల: పరిశ హనుమాండ్లు ఆలేరు: కాదూరి అచ్చయ్య భువనగిరి: సోము రమేష్‌కురుమ వరంగల్ తూర్పు: రవిశంకర్‌గౌడ్ -
మునుగోడు బీసీ నేతల ‘తిరుగుబాటు’
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బీసీ నేతలంతా రాజకీయ పార్టీలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వడం లేదంటూ నిరసన గళం విప్పారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది బీసీ నేతలు జూబ్లీహిల్స్‌లో బుధవారం రహస్యంగా సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా రెండు సామాజిక వర్గాలకే టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల పక్షాన ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లేదంటే బీసీలందరి తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 25న 5 వేల బైక్‌లతో ర్యాలీ మునుగోడు నియోజకవర్గంలోని పలు పార్టీల నేతలతో 21న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 25న అందోల్ మైసమ్మ దేవాలయం నుంచి 5 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టాలని, ఈ నెల 30 లేదా అక్టోబర్ 1న చండూరు లేదా మునుగోడులో ‘బీసీల ఆత్మగౌరవ సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. భేటీలో తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు?: జాజుల
గజ్వేల్ రూరల్: జనాభాలో 54.5 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను ఎందుకు కల్పించరని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య యాత్ర (బస్సుయాత్ర) బుధవారం సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకుంది. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వరకు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బీసీల బతుకులు మారుతాయనుకుంటే ఎక్కడ వేసి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు మొదటగా అమరుడైంది బీసీ బిడ్డనేనని గుర్తు చేశారు. బీసీల వాటా బీసీలకే దక్కాలని.. రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి కులానికి రూ. కోటి ఇవ్వడంతో పాటు భవనాలను నిర్మించి ఇవ్వాలని, కులానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అన్నారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
పోరాడితేనే రాజ్యాధికారం
నిజామాబాద్ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆయన చేపట్టిన బీసీ రాజకీయ చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీలంతా ఐకమత్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని, అందులో 30 సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ఇప్పుడు కూడా అడుక్కోవాలా..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పి మరోసారి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం విచారకరం అన్నారు. బీసీ రాజకీయ చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్ చేరుకున్న శ్రీనివాస్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలోని 112 బీసీ కులాలు జేఏసీగా ఏకమై ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రాజకీయ వాటా కోసం యాచించాల్సిన పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. శాసించే స్థాయి కోసమే బీసీ రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు టులెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. -
రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం
పరకాల : అగ్రకుల ఆధిపత్యంతో అణచివేయబడుతున్న బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు కోట్ల జనం ఒక్క గొంతుకగా ఉద్యమించడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో చేపటుతున్న బీసీల రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం పరకాలకు చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న యాత్రకు అంబేడ్కర్ సెంటర్ నుంచి పరకాల పట్టణంలోని బీసీలు బ్రహ్మరథం పలికారు. వేలాదిగా తరలివచ్చి డప్పుల చప్పుల్లతో యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎఫ్‌జే గార్డెన్లో ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య సభకు జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి సారంగపాణి , రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, మల్లికార్జున్, నియోజకవర్గ ఇన్చార్జి దేవునూరి మేఘనాథ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పంచగిరి జయమ్మ హాజరయ్యారు. ఓటు ‘మనదే..సీటు మనదే’ నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ బీసీలను రాజకీయంగా చెతన్యపర్చడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సదస్సులో 2వేల మంది బీసీలు పాల్గొన్నారు. బీసీలందరూ.. ఏకం కావాలి నర్సంపేట : రానున్న ఎన్నికల్లో రాజ్యాధిరాన్ని దక్కించుకోవాలంటే బీసీలు ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ రాజకీయ చైతన్య యాత్ర ఆదివారం నర్సంపేటకు చేరుకుంది. ఈ సందర్బంగా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓటు మనదే... సీటు కూడా మనదే అనే నినాదంతో చట్టసభల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ నుండి 21 శాతానికి తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను ఎదురించాలన్నారు. 2019 ఎన్నికల్లో నర్సంపేటలో బీసీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రకులాలకు బీసీలు వ్యతిరేకం కాదని న్యాయపరంగా మాకు దక్కాల్సిన ఫలాలను దక్కించుకోవడం కోసమే ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు బాల్నె సర్వేశం, బూర బీసీ నాయకులు రాజు, సత్యనారాయణ, సోల్తి సారయ్య, బొనగాని రవీందర్, ఏడాకుల మల్లారెడ్డి, జీజుల సాగర్, కొల్లూరి లక్ష్మి నారాయణ, పిట్టల సురేందర్, సాంబరాతి మల్లేషంలతో పాటు ఆయా విద్యాసంస్థల బాధ్యులు పాల్గొన్నారు. -
ఓటుతో బుద్ధి చెబుతాం
కల్వకుర్తి మహబూబ్‌నగర్ : ఓటు అనే వజ్రాయుధంతో బీసీలు రానున్న 2019ఎన్నికలలో అగ్రవర్ణ కులాలకు తగిన బుద్ధి చెబుతామని, రాజకీయ గులాంగిరీ కోసం బీసీలను వాడుకుంటున్నారని.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా శ్రీనివాస్‌గౌడ్ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కల్వకుర్తి రఘుపతిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏ ఉద్యమం చేసినా బీసీలే ప్రాణత్యాగాలు చేశారని, అన్ని ఉద్యమాలు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. గంపెడు శాతం ఉన్న బీసీలకు రాజకీయంలో పిడికెడు ఫలాలు మాత్రమే అందుతున్నాయని, అదే పిడికెడు శాతం ఉన్న అగ్రవర్ణ కులాల వారికి గంపెడు ఫలాలు దక్కుతున్నాయని అన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించి, బస్సుయాత్రకు స్వాగతం పలికిన ఉమ్మడి పామూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు నేను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని, అందుకొరకు నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఎన్ని ప్రయత్నాలు చేసి, వారి కింద పనిచేసే వారిగానే బీసీలను గుర్తించారని వారందరికీ తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని, అప్పటి ముఖ్యమంత్రిని కాదని బీసీ నాయకుడైన చిత్తరంజన్ దాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన ఘనత కల్వకుర్తి ప్రజలకు దక్కుతుందని అన్నారు. ఇలాంటి చైతన్యవంతమైన కల్వకుర్తి ప్రాంతంలో 2019 ఎన్నికలలో బీసీ నాయకుడిని చట్ట సభలకు పంపించాల్సిన అవసరం నా కుల బాంధవులైన బీసీలపై ఉందని పిలుపునిచ్చారు.అనంతరం బీసీల ఐక్యతను చాటాలని బీసీ నాయకులందరితో కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఆచారి, బాలాజీ సింగ్, పురపాలిక చైర్మన్ రాచోటి శ్రీశైలం, బాలస్వామి గౌడ్, సదానందం, కానుగుల జంగయ్య, రాజేందర్, నాగేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, కాశన్న యాదవ్, శ్రీను, బుగ్గయ్య గౌడ్, పెద్దయ్య యాదవ్, యుగంధర్, శేఖర్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు వెళ్లాలి తెలకపల్లి : బీసీలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో అడుగు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీల చైతన్య యాత్ర శుక్రవారం తెలకపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బీసీలు వారికి స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో మాట్లాడుతూ పిడికెడు జనాభా ఉన్న వారు రాజ్యమేలుతుంటే గుప్పెడు జనాభా ఉన్న వారు పాలితులుగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను ఆయా స్థానాలలో నిలబెట్టి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో దొరలు, పటేళ్లకు బుద్ధి చెప్పాలని సూచించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, బీసీలంతా కలిసికట్టుగా రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశన్న యాదవ్, రాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు ప్రాధాన్యమివ్వాలి
మునుగోడు నల్గోండ : చట్ట సభల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్ట్ 7నుంచి రాష్ట్రంలో బీసీల చైతన్య బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానికంగా బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థానాల్లో తగిన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాలమూర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలవుతుందని తెలిపారు. 36 రోజుల పాటు కొనసాగే యాత్ర 80 నియోజకవర్గాలల్లో పర్యటించి బీసీలని చైతన్యం చేయడంతో పాటు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కేంత వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైతున్న బీసీలకు తగినా ప్రాధాన్యత దక్కేవరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాని కొనసాగిస్తామన్నారు. బస్సు యాత్రకు బీసీలు పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గండిచెరువు వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లిఖార్జున్ యాదవ్, గుంటోజు వెంకటాచారి,మిర్యాల వెంకన్న, మందుల సైదులు, ఈదులకంటి కైలాస్‌గౌడ్, ఎస్కె షబ్బీర్, నవీన్, ఎల్లయ్య, వెంకన్న, లింగస్వామి, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర
హైదరాబాద్: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలన్న నినాదంతో బీసీల రాజకీయ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ‘పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు’అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7నుంచి సెప్టెంబర్ 7వరకు చేపట్టనున్న ఈ యాత్ర 80 నియోజకవర్గాల గుండా సాగుతుందన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు జరిగిన రోజు నుంచే యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీలకు అతీతంగా బీసీలందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కార్యకర్తలుగానే చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీల వాటా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రకుల నాయకులు హైకోర్టులో కేసు లు వేసి బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు శ్రీనివాసరావు, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు. -
‘పంచాయతీల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 31 జిల్లాల్లో బీసీ గణన నిర్వహించిందని, వారి లెక్కల ప్రకారం బీసీ జనాభా 54% ఉందని గుర్తుచేశారు. ఈ ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోకుండా బీసీలకు ఇష్టానుసారం రిజర్వేషన్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లను నీరుగార్చే వారి ఆటలు సాగనివ్వమని, బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. దామాషా పద్ధతిన పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. 2014 సమగ్ర సర్వే లెక్కలను అధికారికంగా వెల్లడించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్‌లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగలేఖ రాశారు. బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉంటే రిజర్వేషన్ల ఫలాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్లో నిధులు మాత్రం దామాషా పద్ధతిలో అందడం లేదని దీంతో బీసీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి అభ్యున్నతికి అవరోధంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సకలజనుల సర్వే ద్వారా జనాభా లెక్కలు సేకరించినప్పటికీ వాటిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదన్నారు. 1932లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కలు కులాల వారీగా సేకరించిందని, ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. -
బీసీ డిక్లరేషన్ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘215 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఒక్కటీ పట్టించుకోలేదు. ఎంబీసీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్లలో రూపాయి ఖర్చు పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు, బీసీ డిక్లరేషన్ చేసి రూ.20 వేల కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు. బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు: జాజుల సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు అంతంతే అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ‘బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తూతూమంత్రంగా కేటాయింపులు చేశారు. సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కానీ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు. ఇప్పటికైనా సీఎం స్పందించి బీసీలకు నిధులు రూ.5,920 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచాలి’ అని అన్నారు. -
ఫిబ్రవరి 3న అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే అంశంపై ఫిబ్రవరి 3న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేం దుకు పార్టీలు సహకరించాలన్నారు. సమావేశానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
త్వరలో బీసీ కమిషన్‌కు హోదా
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా బిల్లు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం దత్తాత్రేయను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓబీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుతగలకపోతే ఎప్పుడో ఆమోదం పొందేదన్నారు. సవరణల పేరుతో లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందుతుందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ తనకు స్పష్టం చేశారని దత్తాత్రేయ తెలిపారు. బీసీల అభ్యున్నతికి దత్తాత్రేయ తీసుకుంటున్న చొరవకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఏజీ పదవికి బీసీలు అనర్హులా?: జాజుల
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పదవికి బీసీలు అర్హులు కాదా అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి బీసీలకు ఇప్పటికీ ఈ పదవి దక్కలేదన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఇప్పటికీ వివక్షకు గురవుతు న్నారని, పలు రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగలేకపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. -
‘పునర్వ్యవస్థీకరణలో అవమానించారు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణలో సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారని 12 బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. తలసాని వద్దనున్న వాణిజ్య పన్నుల శాఖను ఎందుకు తొలగించారని ప్రశ్నించా యి. బీసీలకు పశుసంవర్థక, చేపలు, వల లు నేసే శాఖలిచ్చి అవమానిస్తారా అని నిలదీశాయి. ఈ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమించాల్సి వస్తుందని ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సం ఘం), గుజ్జకృష్ణ(బీసీ ప్రజా సమితి), ఎస్.దుర్గాగౌడ్ (బీసీ సమాఖ్య), నీల వెంకటేశ్ (బీసీ కులాల ఐక్యవేదిక), చంద్రమౌళి (బీసీ సంఘర్షణ సమితి), జి.మల్లేశ్ యాదవ్(బీసీ ఫ్రంట్), శారద బీసీ మహి ళా సంఘం), కె.నిరంజన్(బీసీ ఉద్యోగుల సంఘం), ఎ.పాండు (బీసీ సేన), సి.రాజేందర్ (బీసీ హక్కుల పోరాట సమితి), కె.నటరాజ్ (న్యాయవాదుల సంఘం) ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
ఖేడ్ లో స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతాం
బీసీ సంక్షేమ సంఘం వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయానికి రాజకీయ పార్టీలు పాతర వేస్తున్నాయని, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ఒక్క పార్టీ కూడా బీసీలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. రెండురోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని నారాయణ్‌ఖేడ్‌లో స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలుపుతామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు జరిగిన అన్యాయంపై ఈ ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్విహ ంచి, అగ్రకుల పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చిన్నరాష్ట్రం ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందన్న పార్టీల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ర్టంలోని పార్టీలు మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కకుండా పోటీపడుతున్నాయని, అందులో భాగంగానే ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదన్నారు. -
ఎర్రకోటను ముట్టడిస్తాం
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్ సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించకపోతే ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సంఘం పదాధికారుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడచినా బీసీల సమస్యల పరిష్కారంలో ఉలుకుపలుకు లేకపోవడం బాధిస్తోందన్నారు. పార్లమెంట్లో అన్ని బిల్లులను ఆమోదిస్తూ బీసీ బిల్లు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ముఖం చాటేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే తప్ప ఈ దేశంలో సామాజిక న్యాయం జరగదని, అందుకోసం బీసీలు కేంద్రంపై సమరభేరీ మోగించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శారద, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, బర్క కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు ఏకం కావాలి
వినాయక్‌నగర్: రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలంతా ఒక్కటై ముందుకెళితే మనకు రాజకీయాల్లో ఎవరు టికెట్టు ఇవ్వనవసరం లేదని, మనమే టికెట్లు ఇద్దామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘మన రాష్ట్రంలో- మన రాజ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు ఇతరులు టికెట్లు ఇవ్వడమేంటి అని, మనమే ఇతరులకు టి కెట్లు ఇస్తామన్నారు. బీసీలు ఇంటికొకరు రాజ్యాధికారం కోసం ఏకమైతే, 2019లో తెలంగాణలో బీసీలదే పాలన అన్నారు. సంక్షేమశాఖలన్నీ ముఖ్య మంత్రి కేసీఆర్ తన వద్ద పెట్టుకుని ఎస్సీ,బీసీ,ఎస్ట్టీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న చరిత్రతో పాటు , సీమాంధ్ర పెత్తనాన్ని అణగదొక్కి తెలంగాణ సాధించుకున్న ఘనచరిత్ర మనకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు తన దొరతనాన్ని చూపిస్తున్నారని విమర్శిం చారు. ఇప్పటి వరకు సంక్షేమ శాఖలకు మంత్రులకు కేటాయించకపోగా ఏ ఒక్కశాఖకు ఐఏఎస్ అధికారులను నియమించకపోవడం శోచనీయమన్నారు. అధికారికంగా ఢిల్లీటూర్ వెళ్లిన సీఎం ప్రధాని మోడీతో గానీ, కేంద్ర మంత్రులతో గానీ తెలంగాణరాష్ట్ర అభివృద్ధి పట్ల, నిధుల సేకరణపై ఒక్కమాట మాట్లాడకుండానే బంగారు తెలంగాణ నిర్మించుకుంటామని అనడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల పై నిర్లక్ష్యం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో కుంటిసాకులు చెబుతూ, ఫాస్ట్ పథకం ద్వారా వెనుకబడిన వారి పిల్లలు చదువుకు దూరమవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శిల్పి శిల్పాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో, బీసీలు కూడా 2019లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతే కష్టపడాలని కోరారు. సదస్సులో మేదరులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను ఆయన తిలకించి ప్రశంసించారు. రోజు రోజుకు మేదరులు తయారు చేసిన వస్తువులకు ఆదరణ కరువవడం బాధాకరమన్నారు. మేదరుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ‘వెనకబడిన తరగతుల వెనక ఉన్న కథ ఇది..’ అంటూ ఇందూర్ సిస్టర్స ప్రేరణి, ప్రణతి ఇంటర్ విద్యార్థులు పాడిన పాట సభికులను కట్టి పడేసింది. వెనకబడిన తరగతుల వారి స్థితిని తెలిపింది. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, రజక సంఘం ప్రతినిధి జెండా బాలాజీ చైర్మన్ నారాయణరావు(నాని), నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాచమల్లు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.