
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం లేదని, రెండు మూడు కులాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండా ప్రకాశ్ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్...డి.శ్రీనివాస్ స్థానంలో బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సగంమంది బీసీలకు అవకాశం కల్పించారని కొనియాడారు.