
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులపై సీఎం కేసీఆర్ కలగజేసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిత్యావసరాల ధరలు 100 శాతం పెరిగితే, మెస్‌చార్జీలు 25 శాతం మాత్రమే పెంచుతామనడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల మెస్ చార్జీలను 25 శాతం మేర పెంచాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశం నిర్ణయించడం హర్షణీయమైనప్పటికీ, ఈ నిర్ణయం గుడ్డిలో మెల్ల లాగా మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. పెరిగిన