
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment