Maha Sabha
-
ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం
కీసర: స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే విజయవంతమవుతాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాంపల్లిదాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కమిటీల మహాసభకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జన నిర్మాణంతోనే సమాజం నిర్మితమవుతుందని, ఇందుకు బాలవికాస సంస్థ చేపడుతున్న పనులే నిదర్శనమన్నారు. బాలవికాస నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటుచేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఆ స్ఫూర్తితో మిషన్ భగీరథను తెచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ సంస్థ గ్రామాల్లో సేవాగుణం గలవారిని కమిటీలుగా నియమించి వారికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాలను నడిపించడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, బాలవికాస వ్యవస్థాపకుడు ఆండ్రూ జింగ్రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరీరెడ్డి పాల్గొన్నారు. బాల వికాస సంస్థ 23 బ్రాంచీలు ఏర్పాటుచేసి 8 వేల గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేరళ సీఎం విజయన్ హైదరాబాద్ రాక
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఖమ్మంలో గురువారం జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో సీపీఎం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో గురువారం మొదలుకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళా శాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రసంగిస్తారు. సభకు లక్ష మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. -
సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు. -
ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలు మంగళవారం నుంచి హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉస్మానియా వర్సిటీ (ఓయూ)లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 16 వరకు మహాసభలను నిర్వహిస్తున్నారు. మల్లు స్వరాజ్యం నగ ర్, అభిమన్యు, ధీరజ్, అనీషాన్ ప్రాంగణంలో సభలు జరుగుతాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థి కవాతు, ప్రదర్శన ఉంటుంది. అనంతరం... ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను అధ్యక్షతన పీపుల్స్ ప్లాజాలో జరిగే బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, బాలికల జాతీయ కన్వీనర్ థీఫ్సీతాధర్ తదితరులు పాల్గొంటారు. సాయంత్రం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రతినిధుల సమావేశాలు ప్రారంభమవుతాయి. 29 రాష్ట్రాల నుంచి 750 మంది ప్రతినిధులతో పాటు క్యూబా, శ్రీలంక తదితర దేశాల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం, బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం, మతోన్మాదం, విద్య ప్రైవేటీకరణ, విద్యార్థి ఎన్నికలపై నిషేధం తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన నాయకులను ఆహ్వానించడంతో సీతారాం ఏచూరి, నీలోత్పల్ బసు వంటి నేతలు కూడా మహాసభలకు రానున్నారు. సభల ఏర్పాట్లను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం పరిశీలించారు. -
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
డిసెంబర్ 7 న జయహో బీసీ సభ
-
జర్నలిస్టుల త్యాగాలు గొప్పవి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న త్యాగాలు గొప్పవి అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీ సీ కల్యాణ మండపంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ద్వితీయ మహాసభలు ఘనంగా జరిగాయి. అంతకుముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.60 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీల పాత్రను పోషించారని గుర్తు చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వీహెచ్, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఏపీ డబ్ల్యూజేఎఫ్ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూజే నేత శాంతకుమారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సంపదను కాపాడేందుకు ఉద్యమం
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న పరిస్థితుల్లో దేశ సంపదను కాపా డుకునేందుకు ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ పక్రటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కార్మికులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నరేంద్రమోదీ కార్మిక సంఘాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కార్మికులు, ప్రజలు నష్టపోతుంటే అదానీ, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఆ నల్లధనం కలిగిన వారిని విదేశాలకు పంపించారని ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ గొడుగు కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గతంలో బ్రిటిష్ వారికి సేవ చేసిందని, నేడు పెట్టుబడి దా రులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. కేంద్రం ట్రేడ్ యూనియన్లను పట్టించుకోవడం లేదని, అపాయింట్మెంట్ కోరితే సమయం కూడా ఇవ్వడం లేదని అమర్జిత్కౌర్ నిందించారు. కార్మికుల సమ స్యలపై చర్చిద్దామని పిలిచి కేవలం 3 నిమిషాలు మా త్రమే సమయమిచ్చి అవమానపరుస్తున్నారని విమ ర్శించారు. దేశ సంపదను అమ్మినా, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో వ్యవసాయరంగం
నల్లగొండ టౌన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్)జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ మొల్ల ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం 2వ మహాసభల సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హన్నన్‌మొల్ల మాట్లాడుతూ.. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో 4లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములను కారుచౌకగా ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి వీలుగా చట్టాలు రూపొందిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధర, ప్రభుత్వ రాయితీలు, రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ కిసాన్‌సభ సహాయకార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించిన నల్లగొండ గడ్డపై ప్రసంగించడానికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆ స్ఫూర్తితో రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, నాయకులు పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ ఆశాకిరణం ఎర్రజెండాయే
సాక్షి, అమరావతి: దేశ భవిష్యత్‌కు ఆశాకి రణం ఎర్రజెండాయే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. రానున్న కాలంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై బీజేపీని నిలువరిస్తాయని చెప్పారు. సీపీఐ 24వ జాతీయ మహా సభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమ య్యాయి. తొలుత కేదారేశ్వర పేటలోని మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి నుంచి అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కదం తొక్కారు. అనంతరం బహిరంగ సభలో రాజా మాట్లా డుతూ.. మోదీ పాలన కంటే వాజ్‌పేయి పాలన ఎంతో బాగుందన్నారు. ఆనాటి బీజేపీ వేరని, ఇప్పటి మోదీ ఉన్న బీజేపీ వేరని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో అదానీ వంటి పెద్ద స్మగ్లర్లు అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కె.నారాయణ, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో సభ అర్ధతరంగా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు కాలిపోయి మైకులు పనిచేయలేదు. వర్షం పెరగడంతో వేదికపై ఉన్న నాయకులు, దిగువన ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు. దీంతో రాజా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభను రద్దు చేశారు. -
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభ: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. -
బీజేపీ, టీఆర్ఎస్లతో అమీతుమీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడి.. పార్టీపరంగా ప్రజల్లో బలపడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ తీర్మానించింది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలని, బీజేపీని నిలువరించాలని పిలుపునిచ్చింది. కమ్యూనిస్టుల మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వామపక్షాలు చేపట్టే పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో 54 అంశాలపై సోమవారం తీర్మానాలు చేసింది. పోటీ, పొత్తు అంశాన్ని పక్కన పెట్టి.. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ, పొత్తులు అనే అంశాన్ని పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపైనే మహాసభల్లో ఎక్కువ చర్చ జరిగినట్లు స్పష్టం చేసింది. యువతను, మహిళలను, అణగారిన వర్గాలను పెద్దఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ప్రజా పోరాటంలో కలిసి వచ్చే వామపక్ష, లౌకిక శక్తులను కలుపుకొనిపోవాలని నిర్ణయించింది. మహాసభల ప్రాంగణంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, నాగయ్య, సుదర్శన్ సహా జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్లు ఈమేరకు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ డాంబికాలు ‘తెలంగాణ ధనిక రాష్ట్రమని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డాంబికాలు పలికినా ఎప్పుడూ లేనంత వేగంగా గత ఏడేళ్లలో అప్పులు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం అవి రూ.2,86,000 కోట్లకు చేరాయి. అదీగాక, 20 శాతానికి మించి పంట రుణాలు అందటం లేదు. అసైన్డ్ భూములు, పోడు భూములు గుంజుకుంటున్నారు. కోవిడ్ కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకిస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడంలేదు’అని సీపీఎం పేర్కొంది. బలపడాలని చూస్తున్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రజల అసంతృప్తిని ఆసరా చేసుకొని బీజేపీ బలపడాలని చూస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. ‘ప్రజల అసంతృప్తిని భావోద్వేగాలవైపు మరల్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేశారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు’అని మండిపడింది. బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించటంలోనూ, లౌకిక విధానాల కోసం నిలబడటంలోనూ టీఆర్ఎస్ అవకాశవాదం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టింది. కాంగ్రెస్ వైఖరి కూడా బీజేపీ బలపడటానికే ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆరోపించింది. -
జీవో 317ను సవరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలన్నారు. 22న ఆన్లైన్ బహిరంగ సభ.. ఈ నెల 22 నుంచి 25 వరకు పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నాయకులు ప్రసంగిస్తారన్నారు. -
దేశ సంపద కార్పొరేట్‌కు ధారాదత్తం
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజాజీవితం అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వంట గ్యాస్‌ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాక అనేక రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగి పోయాయని, వాటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఏడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల భూములను ధరణి పేరుతో భూస్వాములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి తదితరులు సభలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఆర్యవైశ్య మహాసభ మద్దతు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్య మహాసభ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మల్లికార్జున్, రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, ప్రతినిధులు నిరంజన్, పిల్లలమర్రి కిషోర్, ప్రతాప్ తదితరులు మాట్లాడారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటి చైర్మన్ దామోదర రాజనర్సింహను ఆర్యవైశ్యులు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆవశ్యకతను వివరించగా సానుకూలంగా స్పందించారని, స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఆర్య వైశ్యుల సమస్యలు వినేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ హామీని కాపీకొట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మోసపూరిత వాగ్దానం చేయడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల కొడంగల్ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆర్యవైశ్యులను కుక్కలుగా వ్యాఖ్యానించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజీవ్‌గాంధీ సద్భావనయాత్ర సందర్భంగా ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి చెందిన రోశయ్యకు అవార్డు ఇవ్వడం పట్ల ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. రోశయ్యను అవమానపర్చడం వైశ్య సామాజిక వర్గానికి జరిగిన అవమానమే అని పేర్కన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సినీనటి శైలజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ కండువా వేసి శైలజను పార్టీలోకి ఆహ్వానించారు. -
7న ఓబీసీ జాతీయ మహాసభలు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 7న ముంబైలో ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బుధవారం తెలిపారు. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగే ఈ సభలకు 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శరద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, వివిధ రాష్ట్రాల మంత్రులు, 8 మంది తెలంగాణ మంత్రులు సభలకు హాజరవుతారని చెప్పారు. బీసీల న్యాయమైన హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
ఆర్యవైశ్యులు అన్ని విధాలా ఎదగాలి: రోశయ్య
హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఆదివారం నాగోలులో నిర్వహించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర శాఖ, మహిళా విభాగం, యూత్ విభాగాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఏపీలో ఉన్న సంఘం తెలంగాణలో కూడా శాఖను ఏర్పాటు చేసి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గం ఇదే..: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పాండుగుప్త, ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరయ్యగుప్త, కోశాధికారిగా నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి, కోశాధికారిగా శాంతి, హైదరాబాద్ అధ్యక్షురాలిగా యాద మంజుల, యూత్ వింగ్ అధ్యక్షుడిగా సంపత్, సెక్రెటరీగా సందీప్, కోశాధికారిగా ఆకాశ్ తదితరులను ఎన్నుకున్నారు. -
సీపీఎం మహాసభలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో నేటి (ఆదివారం) నుంచి 7 వరకు జరగనున్న సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభల షెడ్యూల్‌ను ఆ పార్టీ నాయకత్వం శనివారం వెల్లడించింది. మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సభలను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రారంభిస్తారని తెలిపింది. అంతకు ముందు ఉదయం 11.30కు మేకల అభివన్ స్టేడియం నుంచి ఎర్రసేన కవాతు ప్రారంభమై, సభ జరిగే లక్ష్మీగార్డెన్స్ గ్రౌండులో మధ్యాహ్నం 1.30కు ముగుస్తుంది. తొలిరోజు సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొంటారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీపీఐ(యు), ఎస్‌యూసీఐ(సి), సీపీఐ–ఎంఎల్ పార్టీలకు చెందిన ఒక్కో నేత సౌహార్ధ సందేశాలు ఇస్తారు. 5, 6, 7 తేదీల్లో ప్రతినిధుల సమావేశాలు, ఆఖరి రోజు నూతన నాయకత్వాన్ని పరిచయం చేయడంతో మహాసభలు ముగుస్తాయని తెలిపింది. -
18న నిజాం గ్రౌండ్స్‌లో ముదిరాజ్‌ల సభ
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ ‘డి’ గ్రూపు నుంచి ‘ఏ’ గ్రూపులోకి వెంటనే మార్చి ముదిరాజ్‌లను ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న ముదిరాజ్ కులస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 18న నిజాం కళాశాల గ్రౌండ్సలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం నారాయణగూడలోని ముదిరాజ్ మహాసభ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మహాసభ ప్రధాన కార్యదర్శి పసుల విజయ్‌కుమార్, పి.వెంకటేశ్, కృష్ణంరాజు, నర్సింహులుతో కలసి ఆయన ఆవిష్కరించారు. -
ఉండవల్లి సభలో సమైక్యవాదుల ఆందోళన