
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న త్యాగాలు గొప్పవి అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీ సీ కల్యాణ మండపంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ద్వితీయ మహాసభలు ఘనంగా జరిగాయి. అంతకుముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.60 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీల పాత్రను పోషించారని గుర్తు చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వీహెచ్, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఏపీ డబ్ల్యూజేఎఫ్ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూజే నేత శాంతకుమారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment