
సీపీఐ ర్యాలీ
సాక్షి, అమరావతి: దేశ భవిష్యత్‌కు ఆశాకి రణం ఎర్రజెండాయే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. రానున్న కాలంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై బీజేపీని నిలువరిస్తాయని చెప్పారు. సీపీఐ 24వ జాతీయ మహా సభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమ య్యాయి. తొలుత కేదారేశ్వర పేటలోని మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి నుంచి అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కదం తొక్కారు.
అనంతరం బహిరంగ సభలో రాజా మాట్లా డుతూ.. మోదీ పాలన కంటే వాజ్‌పేయి పాలన ఎంతో బాగుందన్నారు. ఆనాటి బీజేపీ వేరని, ఇప్పటి మోదీ ఉన్న బీజేపీ వేరని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో అదానీ వంటి పెద్ద స్మగ్లర్లు అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కె.నారాయణ, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో సభ అర్ధతరంగా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు కాలిపోయి మైకులు పనిచేయలేదు. వర్షం పెరగడంతో వేదికపై ఉన్న నాయకులు, దిగువన ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు. దీంతో రాజా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభను రద్దు చేశారు.