
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 7న ముంబైలో ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బుధవారం తెలిపారు. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగే ఈ సభలకు 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శరద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, వివిధ రాష్ట్రాల మంత్రులు, 8 మంది తెలంగాణ మంత్రులు సభలకు హాజరవుతారని చెప్పారు. బీసీల న్యాయమైన హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment