సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా. 12 వేల ఉద్యమాలు చేశాం. 2 వేల జీవోల సాధించామని ఆయన పేర్కొన్నారు.
సీఎం జగన్‌ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్‌కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి. సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి. ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు. నేను కర్నూలులో స్వయంగా
చూశా. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త.’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు.
‘‘ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఓటేసి గెలిపించాలి’’ అని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment