కేరళ సీఎం విజయన్‌ హైదరాబాద్‌ రాక | Sakshi
Sakshi News home page

కేరళ సీఎం విజయన్‌ హైదరాబాద్‌ రాక

Published Thu, Dec 29 2022 3:46 AM

Kerala CM Pinarayi Vijayan To Address Public Meeting In Khammam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం: ఖమ్మంలో గురువారం జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో సీపీఎం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో గురువారం మొదలుకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళా శాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్‌  ప్రసంగిస్తారు. సభకు లక్ష మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement