
నిజామాబాద్ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆయన చేపట్టిన బీసీ రాజకీయ చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీలంతా ఐకమత్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని, అందులో 30 సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.