బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్ధరిస్తామని బాబు ప్రగల్భాలు
రిజర్వేషన్లు తగ్గించాలని కేసులు వేయించింది చంద్రబాబే
హైకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్న టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తామని టీడీపీ బోగస్ నినాదం..
ఇప్పటికే 50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: బీసీలకు వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబునాయుడు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కుతంత్రాలు పన్నిందే చంద్రబాబు. ఈ అంశంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా ఆయన పురిగొల్పారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసినా, 2014– 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల సమయంలో ఏ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించలేకపోయారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95 శాతం రిజర్వేషన్లతో అన్ని రకాల స్థానిక సంస్థలకు ఎన్నిక లు నిర్వహిస్తే టీడీపీ కోర్టుకు వెళ్లి మరీ బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించింది. ఫలితంగా జిల్లా పరిషత్ చైర్మన్, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సహా ఏకంగా దాదాపు 15 వేలకు పైగా పదవులు కోల్పోవాల్సి వచ్చింది.
టీడీపీ నేత కోర్టు కేసుతో జీవోపై స్టే.. మొత్తం రిజర్వేషన్లను తగ్గిస్తూ తీర్పు!
♦ బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కోట్టివేసింది.
♦ ఆ తర్వాత సైతం సుప్రీంకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తే పత్రాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. పర్య వసానంగా...ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లను మా ర్పులు చేయకూడదు. దీంతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు నష్టపోవాల్సి వచ్చింది.
దగా చేసింది బాబు...ఆదుకుంది జగన్...
పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు అమలుకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో 2019 డిసెంబరులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పను ల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ చేసేలా ఏకంగా చట్టాన్ని తీసుకువచ్చారు.
మోసాలు బాబు నైజం...బీసీలకు పట్టమే జగనిజం...
చంద్రబాబు చేసిన మోసాలు, మాయలను పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్ మేలు చేశారు. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే, అందులో బీసీలకు 6 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవులు (46 శాతం) కేటా యించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు.
14 కార్పొరేషన్‌లను వైఎస్సార్‌సీపీ క్లీ న్ స్వీప్ చేస్తే.. అందులో తొమ్మిది చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే 44 స్థానాలు బీసీలకే ఇచ్చారు.రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు.
నాడు అవమానం.. నేడు సమున్నత గౌరవం
వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఇప్పుడు 25 మంది సభ్యులు ఉంటే అందులో ఏకంగా 11 మంది బీసీలకు ఆయన స్థానం కల్పించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలను ఆ వర్గాలకు అప్పగించారు. చంద్రబాబు 2014–19 మధ్య మంత్రివర్గంలో కేవ లం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు.
శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. టీడీపీ హ యాంలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు 29 పదవులు జగన్ ఇస్తే.. 2014–19 మధ్య చంద్రబాబు18 పదవులు మాత్రమే ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment