ఉమ్మడి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పదవికి బీసీలు అర్హులు కాదా అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు.
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పదవికి బీసీలు అర్హులు కాదా అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి బీసీలకు ఇప్పటికీ ఈ పదవి దక్కలేదన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఇప్పటికీ వివక్షకు గురవుతు న్నారని, పలు రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగలేకపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.