
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్
మునుగోడు నల్గోండ : చట్ట సభల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్ట్ 7నుంచి రాష్ట్రంలో బీసీల చైతన్య బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానికంగా బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థానాల్లో తగిన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పాలమూర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలవుతుందని తెలిపారు. 36 రోజుల పాటు కొనసాగే యాత్ర 80 నియోజకవర్గాలల్లో పర్యటించి బీసీలని చైతన్యం చేయడంతో పాటు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కేంత వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైతున్న బీసీలకు తగినా ప్రాధాన్యత దక్కేవరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాని కొనసాగిస్తామన్నారు.
బస్సు యాత్రకు బీసీలు పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గండిచెరువు వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లిఖార్జున్ యాదవ్, గుంటోజు వెంకటాచారి,మిర్యాల వెంకన్న, మందుల సైదులు, ఈదులకంటి కైలాస్‌గౌడ్, ఎస్‌కె షబ్బీర్, నవీన్, ఎల్లయ్య, వెంకన్న, లింగస్వామి, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment