సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రుల శాఖల పునర్‌వ్యవస్థీకరణలో సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారని 12 బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. తలసాని వద్దనున్న వాణిజ్య పన్నుల శాఖను ఎందుకు తొలగించారని ప్రశ్నించా యి. బీసీలకు పశుసంవర్థక, చేపలు, వల లు నేసే శాఖలిచ్చి అవమానిస్తారా అని నిలదీశాయి.
ఈ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమించాల్సి వస్తుందని ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సం ఘం), గుజ్జకృష్ణ(బీసీ ప్రజా సమితి), ఎస్.దుర్గాగౌడ్ (బీసీ సమాఖ్య), నీల వెంకటేశ్ (బీసీ కులాల ఐక్యవేదిక), చంద్రమౌళి (బీసీ సంఘర్షణ సమితి), జి.మల్లేశ్ యాదవ్(బీసీ ఫ్రంట్), శారద బీసీ మహి ళా సంఘం), కె.నిరంజన్(బీసీ ఉద్యోగుల సంఘం), ఎ.పాండు (బీసీ సేన), సి.రాజేందర్ (బీసీ హక్కుల పోరాట సమితి), కె.నటరాజ్ (న్యాయవాదుల సంఘం) ఓ ప్రకటనలో హెచ్చరించారు.