
రౌండ్‌టేబుల్ సమావేశంలో అభివాదం చేస్తున్న జాజుల, తదితరులు
పంజగుట్ట: విశ్వకర్మలపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్యని, ఆయన విశ్వ కర్మలకు బహి రంగ క్షమాపణ చెప్పా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి త్యాగం, ప్రొఫెసర్ జయశంకర్ ఆలో చనా విధానం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని గుర్తుం చుకోవాలని హితవు పలికారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ కుల, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భాష, యాష పేరుతో అణగారిన వర్గాల వారిని కించపరచడం కేసీఆర్, కేటీఆర్‌లకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
సంఘం నేతలు పున్నమాచారి, రాజేశం మాట్లాడుతూ ఆందోళన చేసిన విశ్వకర్మలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, ఓయూ జేఏసీ దరువు అంజన్న, రంగాచారి, బైరాగి మోహన్, మన్నారం నాగరాజు, ఇందిర, రవీంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment