
కవాడిగూడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీలకు బీఫామ్‌లు ఇవ్వకపోతే బీసీ ఓటర్లు గుణపాఠం చెప్పక తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్‌లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో జూజుల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో జనాభాలో 10% ఉన్న అగ్రకులాలకు 50% జనరల్ స్థానాలను, జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 50 స్థానాలనే కేటాయించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు బీ–ఫామ్‌లు ఇచ్చారని, బీ–ఫామ్‌లు తీసుకున్న ఎమ్మెల్యేలు మాత్రం జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment