BC Association
-
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
AP: లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బీసీ సంఘం మద్దతు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ బీసీ సంఘం మద్దతు తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రకటించింది. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు, మద్యం, తినడానికి రేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే వారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. ‘బీసీల పిల్లలు ఫీజులు కట్టడానికి రక్తం అమ్ముకున్నారు. సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి అనేక పధకాలు పెట్టి బీసీల బిడ్డలను చదివిస్తున్నారు. జగన్ పాలనలో మా బతుకులు మారాయి. ఖబడ్డార్ ప్రతిపక్ష పార్టీలు. మీ మోసాలు మాకు తెలిశాయి. ఇన్నేళ్లు మమ్మల్ని మోసం చేశారు. డబ్బు, నోరు, శక్తి, పేరు లేనినవాళ్ళకి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాలేదు. ఇంకా అక్కడ హాస్టళ్లు, గురుకులాలు, తిండి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడి బీసీలు విమానాలు ఎక్కుతున్నారు.. కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటలు నమ్మవద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపు.. బీసీల గెలుపు’ అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి -
ఢిల్లీ కేంద్రంగా బీసీలు ఉద్యమించాలి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యం సాధించాలని, బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, ఆగస్టు 7న ఢిల్లీలో తలపెట్టిన ‘ఓబీసీ జాతీయ మహాసభ’లో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి సారి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఆగస్టు 7న ఢిల్లీలో తలకోటోర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను శుక్రవారం మంత్రుల నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంపు డిమాండ్లపై బీసీలంతా ఐక్యంగా పోరాడాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. -
‘బీసీల మహాధర్నా’ ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జరిగిన బీసీల మహా ధర్నా ఉద్రిక్తంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో వందలాదిమంది జంతర్‌మంతర్ వేదికగా మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం పార్లమెంట్ ముట్టడిగా మారింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో బీసీ నేతలు వెనక్కి తగ్గారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వబోమని, ఆగస్టులో 5 లక్షల మంది బీసీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుతో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థ్ధిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోండి బీసీలకు హక్కులను కల్పించే విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టింది కేవలం వైఎస్సార్సీపీనే అని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% బీసీలకే పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. -
రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి
కోస్గి: రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలలో వెనుకబాటుతనానికి పాలకుల స్వార్థ రాజకీయాలే కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ గౌరవ సభకు ఆమె ముఖ్యఅథితిగా హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ జనాభాలో 56 శాతం, రాష్ట్ర జనాభాలో 52 శాతం బీసీలున్నప్పటికీ అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి చేసిన కృషి శూన్యమేనన్నారు. జనాభాలో 0.5 శాతం ఉన్న వెలమలు రాజ్యమేలితే సగానికి పైగా ఉన్న బీసీ కులాలు మాత్రం కులవృత్తుల అభివృద్ధి పేరుతో జరుగుతున్న కుట్రలో బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకొని తాతలనాటి తరానికి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. బీసీల కోసం 2018లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2019లో మరో వెయ్యి కోట్లు కేటాయించినా రూ.5 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. బీసీల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ.. చట్టాలు సవరించాలన్నారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తమ్మలి బాల్‌రాజ్, జెట్టి రాజశేఖర్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. -
బీసీబంధు ఇవ్వకుంటే మహాఉద్యమం
కవాడిగూడ (హైదరాబాద్): బీసీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాఉద్యమాన్ని చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దళితబంధు పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే బీసీబంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు. దీనికి 76 కులసంఘాలు మద్దతు తెలుపగా.. మాజీ ఎంపీలు హనుమంతరావు, అజీజ్‌పాషా, ఆనందభాస్కర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నిక ముందే బీసీబంధును ప్రకటించకపోతే బీసీలెవరూ టీఆర్ఎస్కు ఓటు వేయరని చెప్పారు. హనుమంతరావు మాట్లాడుతూ హుజూరాబాద్‌లో దళితులు 42 వేల మంది మాత్రమే ఉన్నారని, బీసీలు లక్షా 20 వేల మంది ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. -
బీసీలకు ఇవ్వకుంటే గుణపాఠం తప్పదు: జాజుల
కవాడిగూడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీలకు బీఫామ్‌లు ఇవ్వకపోతే బీసీ ఓటర్లు గుణపాఠం చెప్పక తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో జూజుల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో జనాభాలో 10% ఉన్న అగ్రకులాలకు 50% జనరల్ స్థానాలను, జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 50 స్థానాలనే కేటాయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు బీ–ఫామ్‌లు ఇచ్చారని, బీ–ఫామ్‌లు తీసుకున్న ఎమ్మెల్యేలు మాత్రం జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. -
చంద్రబాబు మాయల ఫకీరు
-
బీసీని సీఎంగా ప్రకటించే పార్టీకే మద్దతు
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు అన్యాయం చేశాయని భావించిన బీసీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమ ఓటు తామే వేసుకోవాలన్న పిలుపుతో ప్రజా జేఏసీగా ఏర్పడ్డారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రజా జేఏసీ ఏర్పడింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించే పార్టీకే మద్దతివ్వాలని బీసీ నాయకులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడినందుకే చట్టసభల్లో సముచిత స్థానం పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలకు విలువలు లేకపోవడం దీనికి నిదర్శనమన్నారు. ఒకరిని మరొకరు దూషించుకోవడం వల్ల పారదర్శకత లోపిం చిందన్నారు. దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం కొరతతో అభివృద్ధి కుంటుపడిందని, కాబట్టి విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 36 స్థానాల్లోనే బీసీ అభ్యర్థులు పోటీపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మన ఓటు మన బీసీలకు వేసి గెలిపించుకుని చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించుకోవడం వల్ల మన సంక్షేమానికి పునాదులు వేసుకున్న వారమవుతామని ఈశ్వరయ్య అన్నారు. గతం ప్రభుత్వాలు కులవృత్తులు, చేతివృత్తుల వారి అభివృద్ధిని నీరుగార్చాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు అగ్రకులాల నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడికి గురవుతున్న ఏౖకైక వర్గం బీసీలేనన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా విలువలతో కూడిన నాయకులను గెలిపించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కస్తూరి జయప్రసాద్, ప్రొఫెసర్ మురళీమనోహర్, జేబీ రాజు, పీఎస్‌ఎన్‌వీ మూర్తి, టీవీ రామ నర్సయ్య, నర్సింహ పాల్గొన్నారు. -
చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 75 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎవరికి వారే పోరాడుతుండటం వల్ల అభివృద్ధి ఫలాలు దక్కడం లేదు. బీసీలంతా సంఘటితమైతేనే ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం’ అని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా వెనుబడిన వర్గాలు నేటికీ అభివృద్ధి చెందలేదన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే విలువలతో కూడిన సమసమాజ స్థాపన కోసం.. దేశంలోని అన్ని రంగాల్లోనూ బీసీలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమాఖ్య రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించాలన్న లక్ష్యంతో ‘పీపుల్స్ అజెండా–2019’కు రూపకల్పన చేశామని, ఓటుతోనే ఈ అజెండా అమలు సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నీరు, భూమి, అటవీ వనరులపై వారికే పూర్తి హక్కులు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పెట్టుబడులు ప్రభుత్వమే భరించాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అనంతరం బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ ముద్రించిన కరపత్రాలను జస్టిస్ ఈశ్వరయ్య విడుదల చేశారు. సమావేశంలో నాయకులు దువ్వారపు రామారావు, ఎంవీవీఎస్ మూర్తి, వై.కోటేశ్వరరావు, గూడూరి వెంకటేశ్వరరావు, కె.ఆల్మన్ రాజు, నమి అప్పారవు, వి.వి.గిరి, ఎన్.వి.రావు, బుద్దా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి’
తాండూరు టౌన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ అధ్యక్షతన గురువారం తాండూరులో బీసీ యువగర్జన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలుగా బతుకుతున్న బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. చట్టసభల్లో బీసీల ఆధిక్యం పెరగాలంటే 50శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్లను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. 52 శాతం ఉన్న బలహీనవర్గాలు రాజ్యాధికారంలో మాత్రం వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణాల కబంధ హస్తాల నుంచి బయటపడి, ఐకమత్యంతో ఎన్నికల్లో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుని బీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కనిపించని వివక్ష కింద బీసీలు బతుకుతున్నారన్నారు. కుల సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలు వణుకుతున్నాయని, ఐక్యంగా ఉంటే బలోపేతమవుతామని స్పష్టంచేశారు. వేషం, భాష, నడక, నడత అన్నీ మార్చినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని సూచించారు. గతంలో అగ్రవర్ణాల వారు బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసి ఇంకా అణగదొక్కాలని చూశారని మండిపడ్డారు. సీ విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు చూపించి విద్యార్థులకు కేటాయించాల్సిన స్కాలర్షిప్లు, బాల, బాలికలకు వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు మెరుగుపరిచేలా పోరాటం చేశామని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్ మాట్లాడుతూ.. అన్ని బీసీ కులాలు ఏకమై అగ్రవర్ణాల ఎత్తుగడలను తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో బీసీలు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల, కుల సంఘాల నాయకులు రవిగౌడ్, వడ్డే శ్రీనివాస్, పట్లోళ్ల నర్సింలు, పటేల్ రవిశంకర్, రమేష్‌కుమార్, ఇందూరు రాములు, నరేష్ మహరాజ్, మురళీకృష్ణ గౌడ్, పూజారి పాండు, ప్రభాకర్‌గౌడ్, బసయ్య, కమల, భద్రేశ్వర్, సౌజన్య, మాధవి, శ్రీనివాస్, షుకూర్, తారకాచారి, వెంకటేష్‌చారి, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు?: జాజుల
గజ్వేల్ రూరల్: జనాభాలో 54.5 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను ఎందుకు కల్పించరని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య యాత్ర (బస్సుయాత్ర) బుధవారం సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకుంది. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వరకు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బీసీల బతుకులు మారుతాయనుకుంటే ఎక్కడ వేసి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు మొదటగా అమరుడైంది బీసీ బిడ్డనేనని గుర్తు చేశారు. బీసీల వాటా బీసీలకే దక్కాలని.. రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి కులానికి రూ. కోటి ఇవ్వడంతో పాటు భవనాలను నిర్మించి ఇవ్వాలని, కులానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అన్నారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
12న బీసీ సాధికారత సభ
హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల హక్కులు, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా సాధించేందుకు అన్ని కుల, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల బీసీ నేతలతో కలసి ఆగస్టు 12న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘బీసీ సాధికారత సభ’బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కన్వీనర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి శరద్‌యాదవ్ హాజరుకానున్నట్లు చెప్పారు. సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్, తెలంగాణ జన సమితి నాయకులు పి.ఎల్.విశ్వేశ్వర్రావు, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌తో కలసి మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మారడంలేదని, ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయనుకుంటే ఇంకా అధ్వానంగా తయారయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయా కులాల ఫెడరేషన్లకు ప్రభుత్వాలు నిధులు కేటాయించేవని, ఇప్పుడు అదీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్టుగా అదే స్ఫూర్తితో బీసీ ఉద్యమం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘మనమెంతో మన వాటా అంత’అనే నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభలో కర్ణాటక, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్‌తోపాటు బీసీ మేధావులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, సీపీఐ నాయకుడు బాలమల్లేష్, తెలంగాణ ఇంటి పార్టీ ప్రతినిధి దొమ్మాట వెంకటేశ్, వైద్య సత్యనారాయణ పాల్గొన్నారు. -
జాతీయ ఓబీసీ ఫెడరేషన్ ఆవిర్భావం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడు గు కిందకు తెస్తూ జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆదివారం ఢిల్లీలో జాతీయ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ నుంచి బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను కలిపి ఒకే ఫెడరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి జాతీయ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిజర్వేషన్లు దక్కేవరకు పోరాటం.. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణను శాస్త్రీయంగా చేపట్టాలని, బీసీ ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, సమగ్ర కుటుంబ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పలు తీర్మానాలు చేశారు. ఓబీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం కల్పించి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన భాగం ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకై వచ్చే నెలలో లక్ష మందితో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. -
కేంద్ర నిర్ణయం టీడీపీ సర్కార్‌కు చెంపపెట్టు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేసిన కుట్రపూరిత ప్రయత్నాన్ని కేంద్రం తిరస్కరించడం బాబు సర్కార్‌కు చెంపపెట్టేనని, ఇది బీసీల విజయమని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ అన్నా రామచంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల రాజకీయాలకు పాల్పడే ఇలాంటి పార్టీలకు కేంద్ర నిర్ణయం గుణపాఠమన్నారు. సంపన్న కులాలను బీసీల్లో చేర్చమని ఏ రాజ్యాంగంలో లేదని, పదవీ వ్యామోహంలో ఉన్న చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీలో ఆమోదముద్ర వేసుకుని కేంద్రానికి పంపడం దగాకోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. బీసీ సంఘ నేత బుసగాని లక్ష్మయ్య మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని కేంద్రం తిప్పికొట్టడం శుభపరిణామన్నారు. మంజునాథ కమిషన్ సిఫారసులను, సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు అక్కినపల్లి లక్ష్మ య్య, సాకం ప్రభాకర్, రమణా యాదవ్, వెంకటాద్రి యాదవ్, విజయలక్ష్మి, నారాయణ గౌడ్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధి కోసం తయారు చేస్తున్న బీసీ నివేదిక రూపకల్పన తుదిదశకు చేరుకుంది. సోమవారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో భేటి అయిన బీసీ కమిటీ సభ్యులు.. నివేదికలోని అంశాలపై మరోమారు చర్చించి పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సుమారు రెండొందల అంశాలతో రూపొందించిన ప్రాథమిక నివేదికలో రిజర్వేషన్లు, విద్య, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతానికి తుదిదశలో ఉన్న ప్రాథమిక నివేదికపై సభ్యులు మంగళవారం మరోమారు భేటీ కానున్నారు. అనంతరం పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావుతో పాటు బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘ఐఐటీ, ఐఐఎం’లోనూ రీయింబర్స్మెంట్ బీసీ నివేదికలో విద్యకే ప్రాధాన్యమిచ్చారు. పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే అంశంపై సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐఐటీ, ఐఐఎం, నీట్ విద్యార్థులకూ రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే అంశానికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 2017–18లో 119 గురుకులాలు ప్రారంభించినా జనాభాకు అనుగుణంగా గురుకులాలు ఏర్పాటు చేయాలనే వాదన వినిపించాయి. దీంతో 119 గురుకులాల ఏర్పాటుకు సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. మరో 61 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్ల సంఖ్య పెంచడం, కొత్త జిల్లాల్లోనూ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 50కి పెంచాలని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు.. బీసీ ఉన్నతాధికారులకు ప్రాధాన్యమున్న పోస్టులు ఇవ్వడం లేదనే విమర్శలకు చెక్ పెడుతూ కీలక విభాగాల్లో బీసీ అధికారులు ఉండాలనే డిమాండ్‌కు మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ ఇప్పించాలనే అంశం చర్చలో భాగంగా ప్రస్తావనకు వచ్చింది. ఏటా బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలనే అంశంపైనా చర్చించారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో ప్రాధాన్యంపైనా సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బీసీ కులాల రిజర్వేషన్లపై బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా మంగళవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై నివేదికను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. -
కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లా.?
జస్టిస్ ఈశ్వరయ్య భావాలు ఆమోద యోగ్యం కాదు ఏపీ బీసీ సంఘం నాయకుల ఖండన డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం) : కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు బీసీలకు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు, ఉత్తరాంద్ర బీసీ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు తెలిపారు. నగరంలోని ఓ హాటల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడుతూ కేవలం వృత్తి ప్రాతిపదికగానే వెనుకబాటుతనాన్ని గుర్తించాలనడం.. రాజ్యాంగంలో పొందుపరచిన సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని విస్మరించడమే అవుతుందన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల పేదరికంతో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇతర రంగాల్లో వేతన కూలీలుగా మారుతున్న వారికి మెరుగైన ఉపాధి కల్పించేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలే గానీ.. సాంఘిక వెనుకబాటుతనం నెపంతో అర్హత లేని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలనడం.. రిజర్వేషన్ల మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కులాన్ని, వృత్తిని వేరు చేస్తే ఎలా.? జస్టిస్ ఈశ్వరయ్య కులాన్ని, వృత్తిని విడదీసి.. కుల వృత్తులు ఏర్పడిన చారిత్రక నేపథ్యాన్ని నిరాకరిస్తున్నారన్నారు. కులంతో సంబంధంలేని ఇతర వృత్తులకి సాంఘిక న్యూనత లేదని, అలాంటప్పుడు నిరుద్యోగం, పేదరికం కారణంగా చేస్తున్న కూలీ పనులకి మధ్య ఉన్న సాంఘిక తేడాని ఈశ్వరయ్య వంటి న్యాయమూర్తి గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అర్హత లేని కులాలను బీసీల్లో చేర్చే అవకాశం లేకుండా కట్టుదిట్టంగా చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడంతో పాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంట్లో ఏకకాలంలో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొలగాని కిషోర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బుగత నరసింగరావు, గొర్లె శ్రీనివాసనాయుడు, వాసుపల్లి రాజశేఖర్, కోలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బాబూ.. జాబ్ ఎక్కడ?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పట్టించుకోరా? బీసీ సంఘం నేత శంకరయ్య శ్రీకాళహస్తి: ‘చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందన్నారు... ఆ హామీని మరచిపోయారా’ అంటూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య అన్నారు. పట్టణంలోని కైకాలవారి కల్యాణ మండపంలో జిల్లా బీసీ నేతల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ ద్వారా రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో మోసాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బ్యాంకులతో లింక్ పెట్టకుండా కార్పొరేట్ సొసైటీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అమలు చేసి కేంద్రానికి పంపడంతోనే తమ బాధ్యత అయిపోయినట్లు సీఎం భావిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి సీఎం ఢిల్లీకి 60సార్లు వెళ్లారని అయితే ఎప్పుడు బీసీల రిజర్వేషన్‌పై మాట్లాడలేదని ఆరోపించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదని దుయ్యపట్టారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ బీసీల పార్టీ అంటూ సీఎం ప్రతి సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటారని, అయితే ఆయన బీసీలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. ఇక బీసీ నేతలు గ్రామ స్థాయి నుంచి ఏ ప్రాంతంలో తమకు అన్యాయం జరిగితే అ ప్రాంతంలోని వారు పోరాడాలన్నారు. ఈ రెండేళ్లలోనైనా సీఎం బీసీల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. లేదంటే 2019 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సరైన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. బీసీ నేతలు రమేష్, రంగయ్య, సునీల్‌కుమార్, వెంకయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈటల నియామకాన్ని వ్యతిరేకించొద్దు
ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత ముఖ్యం: బీసీ సంఘాల నేతలు సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్, జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్‌ను నియమిస్తే తప్పేమిటని వివిధ బీసీ సంఘాలు ప్రశ్నించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యతను కోరుకునే వారు దీనిని వ్యతిరేకించవద్దని జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ (బీసీ సంక్షేమ సంఘం),ఎస్.దుర్గయ్య (బీసీ ఫెడరేషన్), శారదగౌడ్ (బీసీ మహిళా సంఘం) విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈటలను నియమించినా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పోరాడటంలో ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత సంఘాలు విశాలంగా ఆలోచించి మహనీయుల జీవితాలను వారి ఆదర్శాలు, ఆలోచనలను భవిష్యత్తరాలకు అందించే బాధ్యతను గుర్తించాలని, వివాదానికి ముగింపు పలకాలని కోరారు. -
'బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని తలనీలాలు సమర్పించాం'
తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీసీ సంఘం మండిపడింది. ఆయన ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు బి. ఉదయ్ కిరణ్, కార్యదర్శి పుల్లయ్యలు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వారు.. గత ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాళహస్తిలో ఒకరోజు దీక్ష చేశామన్నారు. ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ తిరుమలలో తలనీలాలు కూడా సమర్పించినట్లు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బీసీలకు సంబంధించి తొమ్మిది ఫెడరేషన్ లకు నిధులు కేటాయించిన సంగతిని వారు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. -
2లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి నిరుద్యోగ ప్రతినిధుల సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం వల్ల పాలన సామర్థ్యం దెబ్బతిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, 25 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.