అభివాదం చేస్తున్న నాయకులు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాఉద్యమాన్ని చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దళితబంధు పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే బీసీబంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు.
దీనికి 76 కులసంఘాలు మద్దతు తెలుపగా.. మాజీ ఎంపీలు హనుమంతరావు, అజీజ్‌పాషా, ఆనందభాస్కర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నిక ముందే బీసీబంధును ప్రకటించకపోతే బీసీలెవరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయరని చెప్పారు. హనుమంతరావు మాట్లాడుతూ హుజూరాబాద్‌లో దళితులు 42 వేల మంది మాత్రమే ఉన్నారని, బీసీలు లక్షా 20 వేల మంది ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment