'బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని తలనీలాలు సమర్పించాం' | bc association takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని తలనీలాలు సమర్పించాం'

Published Mon, Mar 30 2015 8:31 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

bc association takes on chandra babu naidu

తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీసీ సంఘం మండిపడింది. ఆయన ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు బి. ఉదయ్ కిరణ్, కార్యదర్శి పుల్లయ్యలు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వారు.. గత ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని  దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాళహస్తిలో ఒకరోజు దీక్ష చేశామన్నారు.

 

ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ తిరుమలలో తలనీలాలు కూడా సమర్పించినట్లు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బీసీలకు సంబంధించి తొమ్మిది ఫెడరేషన్ లకు నిధులు కేటాయించిన సంగతిని వారు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement