సమావేశంలో మాట్లాడుతున్న అన్నా రామచంద్రయ్య
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేసిన కుట్రపూరిత ప్రయత్నాన్ని కేంద్రం తిరస్కరించడం బాబు సర్కార్‌కు చెంపపెట్టేనని, ఇది బీసీల విజయమని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ అన్నా రామచంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల రాజకీయాలకు పాల్పడే ఇలాంటి పార్టీలకు కేంద్ర నిర్ణయం గుణపాఠమన్నారు. సంపన్న కులాలను బీసీల్లో చేర్చమని ఏ రాజ్యాంగంలో లేదని, పదవీ వ్యామోహంలో ఉన్న చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీలో ఆమోదముద్ర వేసుకుని కేంద్రానికి పంపడం దగాకోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
బీసీ సంఘ నేత బుసగాని లక్ష్మయ్య మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని కేంద్రం తిప్పికొట్టడం శుభపరిణామన్నారు. మంజునాథ కమిషన్ సిఫారసులను, సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు అక్కినపల్లి లక్ష్మ య్య, సాకం ప్రభాకర్, రమణా యాదవ్, వెంకటాద్రి యాదవ్, విజయలక్ష్మి, నారాయణ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment