సాక్షి, హైదరాబాద్: గుట్టుగా పెంచిన ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజుల వసూళ్లకు తెగబడటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment