సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్‌కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో..
Comments
Please login to add a commentAdd a comment