సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల జంగ్ సైరన్ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
14న కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment