సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘215 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఒక్కటీ పట్టించుకోలేదు. ఎంబీసీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్లలో రూపాయి ఖర్చు పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు, బీసీ డిక్లరేషన్ చేసి రూ.20 వేల కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు.
బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు: జాజుల
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు అంతంతే అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ‘బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తూతూమంత్రంగా కేటాయింపులు చేశారు. సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కానీ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు. ఇప్పటికైనా సీఎం స్పందించి బీసీలకు నిధులు రూ.5,920 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment