
హైదరాబాద్: రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీ కులాలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి ఈ నెల 28న హైదరాబాద్‌లో 112 బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, సామాజిక ఉద్యమ నేతలు, అన్ని పార్టీల బీసీ రాజకీయ నేతలతో కలసి ‘బీసీల అలయ్–బలయ్’నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ కుందారం గణేశ్‌చారి, కోఆర్డినేటర్ కొండ దేవన్న, కుల్కచర్ల శ్రీనివాస్, ఈడిగ శ్రీనివాస్ పాల్గొన్నారు.