నక్షత్ర
‘‘కథలో కొత్తదనం ఉండి నటిగా నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలు చేయాలన్నది ప్రస్తుతం నా ఆలోచన. నటిగా ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేసి విభిన్నత చాటుకోవాలనుంది’’ అన్నారు నటి నక్షత్ర. ‘రాజ్‌దూత్, పలాస’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అచ్చ తెలుగు హీరోయిన్ నక్షత్ర. ఆమె పుట్టిన రోజు నేడు.
ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ – ‘‘నన్ను హీరోయిన్‌గా చూడాలన్నది మా నాన్న కల. కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. గతంలో ‘లిటిల్ బుద్ధ’ అనే చిల్డ్రన్ ఫిల్మ్‌లో నటించాను. హీరోయిన్‌గా ‘పలాస 1978’ సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో పాత్ర కోసం సుమారు పది కిలోల బరువు పెరిగాను. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీ నన్ను బాగా రిసీవ్ చేసుకుంది. చాలా సపో ర్టివ్‌గా ఉంది. లాక్‌డౌన్‌లో ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ‘గీతా సుబ్రహ్మణ్యం, మెట్రో కథలు’ ప్రాజెక్ట్‌లు చేశాను. అలానే కొన్ని కొత్త కథలు విన్నాను.
అల్లు అరవింద్‌గారి గీతా ఆర్ట్స్‌లో ఓ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. అలాగే డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా కూడా అంగీకరించాను. ఆ సినిమా కోసం బరువు తగ్గుతున్నాను. లాక్‌డౌన్ ముందే ఓ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అందులో నెగటివ్ రోల్‌లో కనిపిస్తాను. ఈ బర్త్‌డేకి ఓ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎటు చూసినా ఆడవాళ్లపై అత్యాచారం అనే వార్తలే ఎక్కువగా వింటున్నాం. దానికి సంబంధించిన అవగాహన తీసుకురావాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. నటి కావాలని ఎంత కష్టపడ్డానో, ఈ ప్రోగ్రామ్‌కి కూడా అంతే కష్టపడతాను. ఓ బ్లాగ్ ఏర్పాటు చేసి ఓ కవిత ద్వారా దీనిని ప్రారంభిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment