చౌడేపల్లి (చిత్తూరు జిల్లా) : ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్లతోటల పెంపకంపై చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో శనివారం రైతుల అవగాహన శిబిరం జరిగింది. చౌడేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు 250 మంది చిన్న, సన్నకారు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 రకాల పండ్లతోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, రైతులకు ఒక ఎకరానికి 76వేల రూపాయల లబ్ధి చేకూరుతుందని జిల్లా చిన్ననీటి యాజమాన్య సంస్థ అదనపు సంచాలకులు నందకుమార్‌రెడ్డి చెప్పారు. పండ్లతోటలు పెంచే రైతులకు ప్రభుత్వం మూడేళ్లపాటు సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరికరాలు ఉచితంగా అందజేస్తుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను ఉచితంగానూ, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీతోనూ అందజేయనున్నట్లు ఎపీఎంఐసీ అధికారి స్వర్ణలత వివరించారు. ఈ సదస్సులో హార్టికల్చర్ అధికారి లక్ష్మీప్రసన్న, ఏసీవో శివకుమార్, మేట్స్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ
Published Sat, May 2 2015 5:05 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement