సాక్షి, హైదరాబాద్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారని అమీర్‌పేట్‌లోని వెల్‌నెస్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న రోగులకు వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్‌తో పాటు బైపాస్ సర్జరీ చేసుకున్న వారు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా శారీరక వ్యాయమంతో పాటు ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో తాము తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 516 మందికి విజయవంతంగా బైపాస్ సర్జరీలు నిర్వహించినట్లు వారు తెలిపారు.
రోగులకు ఖచ్చితంగా తగు మందులు వాడతంతో పాటు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుండె సమస్య వచ్చిందనగానే కంగారు పడాల్సిన పని లేదని ఇప్పుడు అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెరిగాయని నేటి రోజుల్లో బైపాస్ సర్జరీ అంటే సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి సుమన్ గౌడ్, వివేక్‌రెడ్డి, సీటీవీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శతి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రంజిత, ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment