Heart Patients
-
బైపాస్ సర్జరీ తర్వాత నాణ్యమైన జీవితాన్ని గడపాలి: డాక్టర్ తిరుపతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారని అమీర్‌పేట్‌లోని వెల్నెస్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న రోగులకు వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్తో పాటు బైపాస్ సర్జరీ చేసుకున్న వారు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా శారీరక వ్యాయమంతో పాటు ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో తాము తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 516 మందికి విజయవంతంగా బైపాస్ సర్జరీలు నిర్వహించినట్లు వారు తెలిపారు.రోగులకు ఖచ్చితంగా తగు మందులు వాడతంతో పాటు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుండె సమస్య వచ్చిందనగానే కంగారు పడాల్సిన పని లేదని ఇప్పుడు అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెరిగాయని నేటి రోజుల్లో బైపాస్ సర్జరీ అంటే సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి సుమన్ గౌడ్, వివేక్‌రెడ్డి, సీటీవీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శతి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రంజిత, ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
హార్ట్ పేషంట్ల కోసం ప్రత్యేక యాప్.. ఆవిష్కరించిన ఫార్మా దిగ్గజం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం లుపిన్‌లో భాగమైన లుపిన్ డిజిటల్ హెల్త్ (ఎల్డీహెచ్) తాజాగా హృద్రోగ చికిత్స పొందిన పేషంట్ల కోసం లైఫ్ పేరిట మొబైల్ యాప్ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. చికిత్స పొందిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, డాక్టర్లను మళ్లీ సంప్రదించాల్సిన సందర్భాలు మొదలైన వాటిని పర్యవేక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి, అవసరాన్ని బట్టి ఆరు పరికరాల నుంచి సేకరించే డేటా అంతా .. వాటికి అనుసంధానమైన లైఫ్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తమవుతుంది. కంపెనీ తరఫు నుంచి నియమితులైన హెల్త్ కోచ్‌లు తదితర సిబ్బంది పేషంటుకు కావల్సిన తోడ్పాటు అందిస్తారని బుధవారమిక్కడ విలేకరులకు ఎల్డీహెచ్ సీఈవో సిద్ధార్థ్ శ్రీనివాసన్ తెలిపారు. డాక్టరే స్వయంగా సిఫార్సు చేయాల్సిన ఈ ప్రోగ్రాం సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 500 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 400 మంది వరకు డాక్టర్లు తమ ప్లాట్‌ఫాంలో చేరారని, వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది వరకు ఉన్నారని ఎల్డీహెచ్ బిజినెస్ హెడ్ రాజేష్ ఖన్నా తెలిపారు. ఆగస్టు నాటికి 5,000 మందిని డాక్టర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో 350 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని, మరిన్ని కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం -
కరోనా: వీరు మరింత జాగ్రత్తగాఉండాలి!
ఈ సమస్యలున్న వారికి కరోనా వైరస్ త్వరగా సోకే ప్రమాదముంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం కూడా. కోవిడ్‌కు సంబంధించిన కచ్చితమైన చికిత్స, అవసరమైన నియమ, నిబంధనలను పాటించకపోతే తీవ్ర సమస్యలు వస్తాయి. కరోనాలో ఉండే అన్ని రకాల కాంప్లికేషన్లు వచ్చి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. కరోనా సోకిన షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు వెంటనే ఆస్పత్రిలో చేరాలా? షుగర్, బీపీ ఉండి కరోనా సోకినంత మాత్రాన వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోగలిగినవారు సులువుగానే బయటపడతారు. అందరూ ఆసుపత్రులకు పరుగెత్తుకు వెళ్లొద్దు. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకే వేసుకోవాల్సిన మందులు, తదితరాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? హోం ఐసోలేషన్‌లో ఉన్నపుడు మల్టీ విటమిన్లను బాగా తీసుకోవాలి. కడుపు, ఛాతీపై బోర్లా పడుకుని బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి. డాక్టర్లు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. భయం, ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. -ప్రభుకుమార్ చల్లగాలి, డయాబెటాలజిస్ట్, కోవిడ్ స్పెషలిస్ట్, వృందశ్రీ క్లినిక్ -
హార్ట్ పేషెంట్లకు కొత్త ఔషధం!
బీజింగ్: హృద్రోగ బాధితుల చికిత్సలో పాము విషం కూడా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం తేల్చింది. పాము విషంలోని ఓ ప్రొటీన్ రక్తం గడ్డకట్టే పరిస్థితిని నిరోధిస్తుందని పేర్కొంది. ఇందుకోసం వైద్యులు ఉపయోగించే ఆస్పిరిన్ కన్నా ఇదే సురక్షితమైన ప్రత్యామ్నాయమని తెలిపింది. హృద్రోగ బాధితులలో రక్తం గడ్డకట్టకుండా చేసేందుకు నిపుణులు ఆస్పిరిన్ వంటి మాత్రలపైన ఆధారపడతారు. ఆస్పిరిన్ వల్ల రక్తం గడ్డకట్టకపోవడంతో.. ప్రమాదాల్లో తగిలిన దెబ్బలలో విపరీతమైన రక్తస్రావం జరిగి బాధితుల ప్రాణం మీదికి వస్తోంది. ఈ పరిస్థితిని ట్రోపిడోలేమస్ వాగ్లెరిక్స్ అనే పాము విషంతో అధిగమించవచ్చని తైవాన్ శాస్త్రవేత్తలు వివరించారు. ఇందులో ఉండే త్రోవగ్లెరిక్స్ ప్రోటీన్ రక్త నాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా నిరోధించడంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా చేస్తుందని తమ పరిశోధనలో తేలినట్టు నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ ప్రోటీన్ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. దీన్ని మనుషులపై ఇంకా ప్రయోగించలేదని తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టెరియోస్కోరోసిస్, త్రోంబయాసిస్ అండ్ వాస్కులార్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. -
25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు
ముంబై: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వస్తున్న హృద్రోగులను నిలువు దోపీడి చేస్తున్నారు. హృద్రోగులకు అమర్చే స్టెంట్లను లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. పశ్చిమ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే ఒకో స్టెంట్ విలువ అక్షరాల 25 వేల రూపాయలు. కానీ రోగికి అమ్మే విలువ ఏకంగా 1.55 లక్షల వరకు ఉంటోంది. అంటే దిగుమతి రేటు కంటే దాదాపు 700 శాతం ఎక్కువ. ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఈ తంతు సాగుతోంది. స్టెంట్ల దిగమతి దారులు దాని ధరపై దాదాపు 120 శాతం లాభానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తాము కొనుగోలు చేసిన మొత్తం కంటే దాదాపు 120-125 శాతం అధిక ధరకు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారు. ఇక ఆస్పత్రి యాజమాన్యాలు కనీసం 25 శాతం అధిక ధరను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుమతిదారు నుంచి స్టెంట్ రోగికి వెళ్లే క్రమంలో క్రమేణా రేటు పెంచుతూ దోచుకుంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే హృద్రోగులు తమకు భారమైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి స్టెంట్లు కొనుగోలు చేస్తున్నారు. -
హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్!
హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి చిన్నారుల కుటుంబాలకు అమూల్యమైన సమాచారాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడే చిన్నారులకు బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ సహాయం చేస్తుందని త్రివిక్రమ్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆర్ధిక సహాయాన్ని పొందుటకు beinghumanemail@gmail.com ఈమెయిల్ ద్వారా వారిని సంప్రదించాలని త్రివిక్రమ్ సూచించారు. త్రివిక్రమ్ తీసుకున్న చొరవపట్ల పలువురు సోషల్ మీడియా ఫాలోవర్స్, ఇతర నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. If any kids who has a heart condition n can't afford to get it treated,send the details to beinghumanemail@gmail.com.They will help you — Trivikram (@4ever_PK) July 29, 2014