
ఈ సమస్యలున్న వారికి కరోనా వైరస్ త్వరగా సోకే ప్రమాదముంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం కూడా. కోవిడ్‌కు సంబంధించిన కచ్చితమైన చికిత్స, అవసరమైన నియమ, నిబంధనలను పాటించకపోతే తీవ్ర సమస్యలు వస్తాయి. కరోనాలో ఉండే అన్ని రకాల కాంప్లికేషన్లు వచ్చి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.
కరోనా సోకిన షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు వెంటనే ఆస్పత్రిలో చేరాలా?
షుగర్, బీపీ ఉండి కరోనా సోకినంత మాత్రాన వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోగలిగినవారు సులువుగానే బయటపడతారు. అందరూ ఆసుపత్రులకు పరుగెత్తుకు వెళ్లొద్దు. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకే వేసుకోవాల్సిన మందులు, తదితరాలపై జాగ్రత్తలు తీసుకోవాలి.
హోం ఐసోలేషన్‌లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
హోం ఐసోలేషన్‌లో ఉన్నపుడు మల్టీ విటమిన్లను బాగా తీసుకోవాలి. కడుపు, ఛాతీపై బోర్లా పడుకుని బాగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి. డాక్టర్లు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. భయం, ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి.
-ప్రభుకుమార్ చల్లగాలి,
డయాబెటాలజిస్ట్, కోవిడ్ స్పెషలిస్ట్, వృందశ్రీ క్లినిక్
Comments
Please login to add a commentAdd a comment