ప్రత్యేకహోదా.. ఆంధ్రుల హక్కు | Awareness program of Special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదా.. ఆంధ్రుల హక్కు

Published Thu, Oct 1 2015 2:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Awareness program of Special status

వైవీయూ : ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అని కమలాపురం శాసనసభ్యుడు పీ. రవీంద్రనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు ఎస్‌బీ. అంజద్‌బాషా ఉద్ఘాటించారు. యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద బుధవారం వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడారు. ఉ స్మానియా విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యమైందని,  అదే స్ఫూర్తి తో విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమబాట పట్టాలన్నారు.  

ఆర్థికంగా చితికిపోయి న రా ష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే మేలు జరుగుతుందని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుం దని ప్రచారం చేసి పదవీలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రస్తుత చంద్రబాబు సర్కారు కుట్రలు పన్నుతోందన్నారు. నిరుద్యోగభృతి చెల్లిస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన వారు నేడు వారి భృతికే పరిమితమయ్యారని విమర్శించా రు.జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన ఉక్కుపరిశ్రమ విషయంలో సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.

ప్రత్యేకహోదాపై ప్రతిపక్షనేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉద్య మం చేస్తుంటే,సహకరించాల్సిన ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నా రు. ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న చంద్రబాబు కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేక రాష్ట్రప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శిం చారు. జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు సాగించాలని కోరారు.
 
సమైక్యాంధ్ర స్ఫూర్తితో ఉద్యమం: అంజద్‌బాషా
సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు చూపిన తెగువ, పోరాటం నేడు ప్రత్యేకహోదా విషయంలోనూ అవసరమని కడ ప శాసనసభ్యుడు ఎస్‌బీ. అంజద్‌బాషా అన్నారు.  ప్రత్యేక హో దాపై టీడీపీ నేత లు, మంత్రలు భయపడుతున్నారన్నా రు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు అడుగడుగునా, అడ్డం కులు సృష్టించడం ద్వారా చంద్రబాబు సర్కా రు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమని స్పష్టమైందన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎ స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు.
 
కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు విద్యార్థులకు అభివాదం చేసి ఉద్యమానికి మద్దతు పలకాలని ఉత్తేజపరిచారు.  వైఎస్‌ఆర్ సీపీ కడప నగర అ ధ్యక్షుడు నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, మైనారిటీ సెల్ నగర కార్యదర్శి ఎస్‌ఎండీ షఫీ, రైతు విభాగం అధ్యక్షుడు సంబ టూరు ప్రసాద్‌రెడ్డి, కార్పొరేటర్లు బండిబాబు, రామలక్ష్మణ్‌రెడ్డి, అధికార ప్రతి నిధి రాజేంద్ర, వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహమతుల్లా, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement