mla ravindranath reddy
-
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు దారుణం
కమలాపురం: టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం దారుణం అని, చిరంజీవి లాగే చంద్రబాబు కూడా త్వరలో టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయం అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ పీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఇందిరాగాంధి, సోనియా, రాహుల్‌లను విమర్శించిన వారేనన్నారు. అలాంటిది తిరిగి కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం దారుణం అని, ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుతున్న చంద్రబాబును చూసి ఊసరివెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ దక్కడం కష్టమేనని జోస్యం చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకున్నాడని, త్వరలో ఏపీలో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇక ప్రజలు బాబును నమ్మరని స్పష్టం చేశారు. ఏపీలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదని, ఇంత చిన్న రాష్ట్రంలోనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మ పోరాట సభకు సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 1400 బస్సులు ఏర్పాటు చేసినా 25వేల మంది దాటలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. బాబుతో పాటు ఆయన తోక పత్రికలకు హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమానిగా కనిపిస్తున్నాడని దుయ్యబట్టారు. అభిమాని అయితే పూల మాల వేస్తాడు.. వీరాభిమాని అయితే వేలు కోసుకుని వీర తిలకం దిద్దుతాడే గాని హత్యాయత్నం చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. అలిపిరి ఘటన జరగ్గానే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేశారని, అదీ వైఎస్ కుటుంబం హుందాతనం అని గుర్తు చేశారు. ఇక్కడ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వి హేలన చేస్తాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు సంబటూరు ప్రసాద్ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, ఎన్సీ పుల్లారెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, అల్లె రాజారెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, సుధా కొండారెడ్డి, నారదా గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ సీఎం అయితేనే అభివృద్ధి
చెన్నూరు : వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి చెన్నూరు బెస్తకాలనీలో పార్టీ మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కమలాపురం నియోజకవర్గంలో ఏడాదికి 100 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నవర త్నాలు పథకం ద్వారా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల, మహిళల, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి అభివృద్ధికి పాటు పడతామన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బోలా పద్మావతి, పార్టీ నాయకులు ఆర్వీ సుబ్బారెడ్డి, పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, ముదిరెడ్డి రవీంద్రనా«థ్‌రెడ్డి, ఉప సర్పంచు ఖరీం మత్స్యకారుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇది ప్రజా విజయం
కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా విజయమని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల కోరుతూ సర్వరాయసాగర్ నుంచి ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం ముగిసింది. వందలాది మంది రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గండికోటకు 4500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీంతో తొలుత కలెక్టర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు నీరు విడుదల చేశారన్నారు. అయితే కాంట్రాక్టర్ తనకు ఆరు కోట్ల రూపాయల మామూళ్లు ఇవ్వలేదనే దాంతో ఓ టీడీపీ నేత మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి నీటి విడుదలను ఆపించారని ఆరోపించారు. దీంతో తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని, ప్రజల్లో వచ్చిన అపూర్వ స్పందనకు భయపడ్డ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటి విడుదలకు అంగీకరించిందని తెలిపారు. వీఎన్ పల్లె మండలంలో 1200 అడుగుల్లో భూగర్బజలం ఉందన్నారు. చీనీ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పారు. రిజర్వాయర్‌లో నీరు నింపితే భూగర్బ జలాలు పెరిగి పంటలు రక్షించుకోవచ్చన్నారు. నీళ్లు వచ్చే వరకు ప్రభుత్వం మాటలు నమ్మాల్సిన పని లేదన్నారు. మాట తప్పితే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెతిస్తామని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే గాలేరు–నగరి పూర్తి చేసి కమలాపురం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరువుకు నిలయమైన జిల్లాను కోస్తా లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 250 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నీటిని వైఎస్ తీసుకొచ్చారన్నారు. గాలేరు–నగరికి రూ. 4800 కోట్లు కేటాయించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన మృతి చెందాక ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలేవి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాట పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత శాశ్వత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సర్వరాయసాగర్‌కు నీరివ్వాలన్న కోరిక అసాధ్యమైనదేమి కాదన్నారు. నీరిస్తే ప్రజలకు వైఎస్ గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప రైతులు పట్టడం లేదన్నారు. పోలవరం కాలువలను ఏనాడో పూర్తి చేసింది వైఎస్సారేనని అన్నారు. తాను, దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి కలిసి తెలుగుగంగను పూర్తి చేయాలని కోరగా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందని, ఎట్టకేలకు దిగొచ్చి సర్వరాయసాగర్‌కు నీరిస్తామని ప్రకటించిందన్నారు. గండికోటలో పుష్కలంగా నీరున్నప్పటికీ సర్వరాయసాగర్ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం రిజర్వాయర్లలో ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంపై ఖర్చు చేసిన డబ్బును పోలవరంపై చేసి ఉంటే రాయలసీమకు నీరొచ్చి ఉండేదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. 2004లో అధికారంలోకి రాగానే జలయజ్ఞం చేపట్టారన్నారు. పుష్కలంగా నిధులు కేటాయించి పనులను పరుగులెత్తించారన్నారు. ప్రస్తుతం గండికోటలో 8 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ ఫేజ్–1లో ఉన్న సర్వరాయసాగర్‌కు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన చేసిందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి లేదన్నారు. వైఎస్ హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు చేసిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీకి పేరొస్తుందనే పుత్తా నరసింహారెడ్డి నీటి విడుదలను ఆపు చేయించారన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. కలెక్టర్ ప్రకటించిన విధంగా నీరు విడుదల కాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీటి విడుదల ఆగదు తాము ప్రకటించిన విధంగా ఈనెల 25వ తేది నుంచి సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేస్తామని, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని తనకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులకు కలెక్టర్ బాబూరావునాయుడు స్పష్టం చేశారు. సర్వరాయసాగర్ గేట్లు, ఇతర చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉండడం, నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వాన్ని నివేదించామన్నారు. దీంతో నిపుణుల కమిటీని ప్రభుత్వం పంపిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు పరిశీలించి నీటి విడుదలకు ఆదేశించారన్నారు. కనుక నీటి విడుదల ఆగే ప్రశ్నే లేదన్నారు. ఇదే కాకుండా జిల్లాకు మరో 10 టీఎంసీల నీరు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు, సుధాకర్‌రెడ్డి, సునీల్‌కుమార్, వినోద్‌కుమార్, నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర
సాక్షి, కడప: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈ నెల 30 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్వరాయసాగర్ ప్రాజెక్టు నుంచి కడప కలెక్టరేట్ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అనంతరం 2 వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి సన్‌రైజ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్‌రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరెన్నో నిర్వహించుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సంధ్యా సర్కిల్లో...కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక సంధ్యా సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లూరు జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి, సన్‌రైజ్ హాస్పిటల్ ఎండీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి అరుణమ్మలు హాజరై కేక్ కట్ చేశారు. ఎన్ఆర్ఐల శుభాకాంక్షలు పుట్టిన రోజు సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డికి వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు వారు పూలమాలలు వేసి, పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బి. నిత్యానందరెడ్డి, బాబు, డిష్ జిలాన్, జీఎస్ బాబూరాయుడు, జరుగు రాజశేఖర్‌రెడ్డి, కరిముల్లా, పసుపులేటి మనోజ్ పాల్గొన్నారు. చౌడమ్మ వృద్ధాశ్రమంలో... కడప వైఎస్ఆర్ సర్కిల్ : కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు యం. చంద్రశేఖర్ రెడ్డి, 9వ డివిజన్ ఇన్చార్జ్ మల్లికార్జున, కిరణ్ సబ్‌జైల్ సమీపంలో చౌడమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. -
'చంద్రబాబు, లోకేశ్ లంచాలు, కమీషన్ల కోసమే'
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న రైతుదీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఏ వనరులను వదిలిపెట్టడం లేదని.. లంచాలు, కమీషన్లు వచ్చే పనులే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేస్తున్నరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రైతులందరూ ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారని, పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జిల్లాల్లో టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. 'రూ. లక్షన్నర పనికి రూ.5 వేలు కూడా ఖర్చు పెట్టడం లేదు. లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సీఎం అయ్యారు. అవినీతిలో ఏపీ ఫస్ట్ అని బీబీసీ కూడా చెప్పడమే అందుకు నిదర్శనం. ప్రజలను బాగుపరిచే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా దోచుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర నీటి ప్రయోజనాలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. రాష్ట్రానికి నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సీఎం చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రానికి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని' రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
'చంద్రబాబు, లోకేశ్ లంచాలు, కమీషన్ల కోసమే'
-
ఇది అసమర్థ ప్రభుత్వం
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థరెడ్డి అన్నారు. సెప్టెంబర్ 3న నిర్వహించే మహా ధర్నాపై చర్చించేందుకు బుధవారం ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక ప్రజలతో పనేముంది అనే రీతిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2012 రబీ సీజన్ బుడ్డశెనగ బీమా జిల్లాలో ఇంకా 13 వేల మందికి అందలేదని అన్నారు. సీఎం ఇప్పటివరకు 14 సార్లు జిల్లాలో పర్యటించినా అభివద్ధి ఏమాత్రం లేదన్నారు. జిల్లాపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపుతున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపడం లేదన్నారు. గండికోటకు నీరు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో చిత్తశుద్ది చూపడం లేదని అన్నారు. సెప్టెంబర్ 3న కడప కలెక్టరేట్ ఎదుట జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి హాజరువుతారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, మండల నాయకులు అలిదెన వాసు, విశ్వనాధరెడ్డి, రైతు విభాగం మండల అ«ధ్యక్షుడు బాస్కరరెడ్డి, çపార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీలేదు
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లపాలనలో రాష్ట్రానికి చేసిందేమీలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కారని ఆరోపించారు. శుక్రవారం కమలాపురంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ప్రజలకు వినియోగించకుండా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉత్పాదనకు వాడుకుంటున్నారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. -
'ఎస్సీలకు ఉచిత విద్యుత్ పరిమితిని పెంచండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని అధికారులు పేదప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో విద్యుత్ మీటర్లు పెట్టుకోవడానికి ఎస్సీలకు సబ్‌ప్లాన్ కింద డబ్బులు ఇస్తే బాగుంటుందని సూచించారు. ఎస్సీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పరిమితిని 50 యూనిట్ల నుంచి 250 యూనిట్లకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ట్రాన్స్ కోలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఎంత ఉన్నాయో తెలుపాలని టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఎఫిషియెన్సీకి ఎంత ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఆదా చేయకుండా విచ్చలవిడిగా వాడుతున్నారని, వ్యవసాయ రంగంలోనూ, ఇతర రంగాల్లోనూ వైర్ల నాణ్యత లేక విద్యుత్ ఎక్కువ ఖర్చవుతోందని ఆయన తెలిపారు. ఆడిట్ రిపోర్టులో ఏం అవకతవకలు వచ్చాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వీధిలైట్లను మార్చి ఎల్ఈడీ బల్బులను పెడతామని ప్రభుత్వం చెప్తున్నదని, అయితే అది మున్సిపాలిటీల్లో అది సాధ్యం కావడం లేదని చెప్పారు. ఈ విషయంలో ఎప్పటిలోపల ఎంఓయూ అమలు చేస్తారని ప్రశ్నించారు. -
'రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి'
కమలాపురం: వైఎస్సార్ జిల్లా లోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కమలాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ప్రత్యేకహోదా.. ఆంధ్రుల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అని కమలాపురం శాసనసభ్యుడు పీ. రవీంద్రనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు ఎస్బీ. అంజద్‌బాషా ఉద్ఘాటించారు. యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద బుధవారం వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడారు. ఉ స్మానియా విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యమైందని, అదే స్ఫూర్తి తో విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమబాట పట్టాలన్నారు. ఆర్థికంగా చితికిపోయి న రా ష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే మేలు జరుగుతుందని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుం దని ప్రచారం చేసి పదవీలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రస్తుత చంద్రబాబు సర్కారు కుట్రలు పన్నుతోందన్నారు. నిరుద్యోగభృతి చెల్లిస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన వారు నేడు వారి భృతికే పరిమితమయ్యారని విమర్శించా రు.జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన ఉక్కుపరిశ్రమ విషయంలో సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్షనేత వైఎస్జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉద్య మం చేస్తుంటే,సహకరించాల్సిన ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నా రు. ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న చంద్రబాబు కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేక రాష్ట్రప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శిం చారు. జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు సాగించాలని కోరారు. సమైక్యాంధ్ర స్ఫూర్తితో ఉద్యమం: అంజద్‌బాషా సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు చూపిన తెగువ, పోరాటం నేడు ప్రత్యేకహోదా విషయంలోనూ అవసరమని కడ ప శాసనసభ్యుడు ఎస్బీ. అంజద్‌బాషా అన్నారు. ప్రత్యేక హో దాపై టీడీపీ నేత లు, మంత్రలు భయపడుతున్నారన్నా రు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి దీక్షకు అడుగడుగునా, అడ్డం కులు సృష్టించడం ద్వారా చంద్రబాబు సర్కా రు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమని స్పష్టమైందన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎ స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు విద్యార్థులకు అభివాదం చేసి ఉద్యమానికి మద్దతు పలకాలని ఉత్తేజపరిచారు. వైఎస్ఆర్ సీపీ కడప నగర అ ధ్యక్షుడు నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, మైనారిటీ సెల్ నగర కార్యదర్శి ఎస్ఎండీ షఫీ, రైతు విభాగం అధ్యక్షుడు సంబ టూరు ప్రసాద్‌రెడ్డి, కార్పొరేటర్లు బండిబాబు, రామలక్ష్మణ్‌రెడ్డి, అధికార ప్రతి నిధి రాజేంద్ర, వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహమతుల్లా, విద్యార్థులు పాల్గొన్నారు. -
నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
కడప కార్పొరేషన్ : నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేసి, ఆ యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు. నారాయణ విద్యాసంస్థల ఛెర్మైన్, రాష్ట్ర మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే పరామర్శ అంతకుముందు మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల యాజమాన్యమే ఆ విద్యార్థులను హత్య చేసిందన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికే విద్యార్థులపై ప్రేమలేఖలంటూ విద్యార్థులపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పులి సునీల్‌కుమార్, చల్లా రాజశేఖర్, నాగిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి
ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి వీరపునాయునిపల్లె : ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉరుటూరు గ్రామంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ఆధారాలతో సహా చంద్రబాబు దొరికినా రేవంత్‌రెడ్డిని మాత్రమే అరె స్టు చేశారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో ఆ యనది ఒక పాత్ర మా త్రమేనన్నారు. దీనికి మూలకారకుడు చంద్రబాబేనని, ఆయనను దోషిగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం, టీడీపీతో కుమ్మక్కు అయిందని భావించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలాగే ఉంటే టీడీపీ, తెలంగాణ ప్రభుత్వాలపై వైఎస్సార్సీపీ ఉద్యమం చేయాల్సి వస్తుందని, ఈ పరిస్థితి రాకముందే దోషులుగా ఉన్న 15 మందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదని, టీడీపీకి చెందినది మాత్రమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరామిరెడ్డి, సర్పంచులు సాంబశివారెడ్డి, ఈశ్వర య్య, తలపనూరు మాజీ సర్పంచు లు ఉత్తమారెడ్డి, చెన్నకేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసింది చంద్రబాబే కడప ఎడ్యుకేషన్ : చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగా నే వాటిని విస్మరించి ప్రజలను మోసం చేశారని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కడప నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేక ర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగమిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగా నే అవన్నీ మరిచారన్నారు. చంద్రబాబు రాయలసీమకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని కేం ద్రాన్ని ఎదురించినందుకే జగన్‌పై అప్పట్లో అక్రమ కేసులు పెట్టారనే విషయం పిల్లవాడికీ కూడా తెలుసన్నారు. కానీ చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి, పట్టపగలు దొరికిపోయారని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే
♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది ♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? ♦ అధికార యంత్రాంగమంతా పచ్చ చొక్కాలమయమైంది ♦ చంద్రబాబును చొక్కా పట్టుకొని ఈడ్చికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ♦ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల ధ్వజం కడప కార్పొరేషన్ : ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నగ ర మేయర్ కె.సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి.ర వీంద్రనాథ్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో చం ద్రబాబు ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమగ్ర విచారణ జరిపితే ఆయన ఎంత అవినీతి పరుడో త్వరలోనే బయటపడుతుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి చంద్రబాబు జిల్లాపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమ లు పెట్టడానికి వచ్చే వారిని జిల్లాకు చెందిన నాయకుడు ఒకరు బెదిరిస్తున్నారని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికారం, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా అలా బెదిరించే వారిపై చర్యలు తీసుకోండి, అంతే తప్ప ఇలా ఒట్టి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హితవు పలికారు. ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం ఏడాది పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గానీ, సంక్షేమ పథకం గానీ ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తే గానీ గండికోటను నీళ్లు తేవడం సాధ్యం కాద ని, కానీ ముఖ్యమంత్రి జూలైలో 30 టీఎంసీల నీరు ఇస్తానని జిల్లా వాసులకు వాగ్దానం చేశారన్నారు. వచ్చే నెలలో శ్రీశైలం నుంచి నీటిని బిందెలతో, ట్యాంకర్లలో తెస్తారా.. అని ఆయ న ఎద్దేవా చేశారు. జిల్లా అధికార యంత్రాం గం ప్రజాస్వామ్యబద్దంగా వ్యహరించకుండా అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జిల్లాలోని ఖాజీపేట పంచాయతీలో పాల్గొన్న కార్యక్రమం పార్టీ కార్యక్రమమా, అధికారిక కార్యక్రమమా అధికారులు చెప్పాలని నిలదీశారు. అధికారిక కార్యక్రమమైతే గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరపడం ఆనవాయితీ అని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎం పీ ఇలా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవ లం పచ్చచొక్కాల వారితోనే కార్యక్రమం నిర్వహించడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తమ చేతిలో ఓడిపోయి, ప్రజ లు తిరస్కరించిన వారిని వేదికనెక్కించి మా ట్లాడించడమేనా ప్రజాస్వామ్యం అంటూ ఘా టుగా ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే ప్రజ లు ఎదురు తిరుగుతారని, అప్పు డు ఏ అధికారి కూడా పని చే యలేడని హెచ్చరించారు. చంద్రబాబుకు పిచ్చిపట్టింది:కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమోనని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఏమీ చేయకపోయినా చేసినట్లు చెప్పుకొంటున్నారని, ఇది కూడా ఒక రక మైన వ్యాధేనన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా రూపాయి ఖర్చు పెట్టకపోయినా కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం మా ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నేను మారిన మనిషిని అని పదేపదే చెబితే ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేశారని, ఈ ఏడాది పాలనతో ఆయన ఏమీ మారలేదని ప్రజలు గ్రహించారన్నారు. పోలీసులే లేకపోతే తప్పుడు వాగ్దానాలు చేసినందుకు జనం చొక్కాపట్టి ఈడ్చికొడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష
కడప: తాగు, సాగు నీటి కోసం వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని గత అయిదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆయనకు సూచించారు. పార్టీ నేతల దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
నలుగురికి తీవ్ర గాయాలు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చింతకొమ్మదిన్నె : మండలంలోని పాపాసాహెబ్‌పేట పంచాయతీ పరిధిలో గల బాలుపల్లె గ్రామంలో ఇంటి స్థల విషయమై వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో బాలుపల్లె గ్రామంలోని వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్ వర్దిరె డ్డి భారతి, ఆమె భర్త సురేంద్రారెడ్డి, టీడీపీ వర్గాయులైన చిన్న పుల్లారెడ్డి, వర్దిరెడ్డి రామతులసి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులు 108 సహాయంతో బాధితులను రిమ్స్‌కు తరలించారు. బాధితుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సర్పంచ్ ఇంటి పక్కనే ఉన్న రె ండు అడుగుల స్థలంలో టీడీపీ నాయకులు ఈ స్థలం తమదంటూ రాళ్లు నాటారని, అది తొలగించాలని సర్పంచ్ అత్త సావిత్రమ్మ కోరారు. అయితే టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారని, ఈ ఘర్షణలో బాధితురాలికి చెందిన నాలుగు తులాల బంగారు గొలుసును సైతం కాజేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం ఘర్షణ విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త అయిన వర్దిరెడ్డి సురేంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుంటుండగా ఇరు వర్గాలు కట్టెలతో దాడి చేసుకున్నారని తెలిసింది. పరామర్శించిన ఎమ్మెల్యే బాలుపల్లె గ్రామంలో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు వర్దిరెడ్డి సురేంద్రారెడ్డి, సర్పంచ్ భారతిలను క మలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి పరామర్శించి ఘర్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
25నుంచి ఎమ్మెల్యే రవీంద్ర ఆమరణ దీక్ష
వీరపునాయునిపల్లెలో 25 నుంచి దీక్ష కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం అర్బన్ : తాగు, సాగు నీటి సమస్యలను తీర్చాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు కమలాపురం నియోజకవర్గ శాసన సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజలతో కలసి వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో ఈ నెల 25 నుంచి ఆమరణ నిరహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. మార్చి 7 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని, ఈ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యమాలు, నిరసనలపై నమ్మకం ఉంటే గాలేరు-నగిరి సుజల స్రవంతికి నిదులను మంజూరు చేస్తుందనే ఆలోచనతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జీఎన్ఎస్ఎస్ పూర్తి కావడానికి 2700 కోట్లు వ్యయం అవుతుందని, అందులో భాగంగా కడప జిల్లాకు 1400 కోట్లు, మిగిలిన జిల్లాలకు 1300 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కనీసం కడప జిల్లాకు తాగు,సాగు నీటి అవసరాలకు కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి రాజుపాలెం సుబ్బారెడ్డి, నాయకులు సియస్ నారాయణరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యన్‌సి పుల్లారెడ్డి, సుధాకొండారెడ్డి, మారుజోళ్ళ శ్రీనివాసరెడ్డి, క్రిష్ణారెడ్డి, చిన్ని పాల్గొన్నారు.