ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లపాలనలో రాష్ట్రానికి చేసిందేమీలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లపాలనలో రాష్ట్రానికి చేసిందేమీలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కారని ఆరోపించారు.
శుక్రవారం కమలాపురంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ప్రజలకు వినియోగించకుండా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉత్పాదనకు వాడుకుంటున్నారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.