చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే | Ysrcp leaders fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే

Published Mon, Jun 8 2015 2:13 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

చంద్రబాబుకు జయలలితకు పట్టిన  గతే - Sakshi

చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే

♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది
♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా?
♦ అధికార యంత్రాంగమంతా పచ్చ చొక్కాలమయమైంది
♦ చంద్రబాబును చొక్కా పట్టుకొని ఈడ్చికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
♦ వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధుల ధ్వజం

 
 కడప కార్పొరేషన్ : ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు.  వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నగ ర మేయర్ కె.సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి.ర వీంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో చం ద్రబాబు ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

సమగ్ర విచారణ జరిపితే ఆయన ఎంత అవినీతి పరుడో త్వరలోనే బయటపడుతుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీని అణగదొక్కడానికి చంద్రబాబు జిల్లాపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమ లు పెట్టడానికి వచ్చే వారిని జిల్లాకు చెందిన నాయకుడు ఒకరు బెదిరిస్తున్నారని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికారం, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా అలా బెదిరించే వారిపై చర్యలు తీసుకోండి, అంతే తప్ప ఇలా ఒట్టి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హితవు పలికారు.

 ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం
 ఏడాది పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గానీ, సంక్షేమ పథకం గానీ ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తే గానీ గండికోటను నీళ్లు తేవడం సాధ్యం కాద ని, కానీ ముఖ్యమంత్రి జూలైలో 30 టీఎంసీల నీరు ఇస్తానని జిల్లా వాసులకు వాగ్దానం చేశారన్నారు. వచ్చే నెలలో శ్రీశైలం నుంచి నీటిని బిందెలతో, ట్యాంకర్లలో తెస్తారా.. అని ఆయ న ఎద్దేవా చేశారు. జిల్లా అధికార యంత్రాం గం ప్రజాస్వామ్యబద్దంగా వ్యహరించకుండా అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జిల్లాలోని ఖాజీపేట పంచాయతీలో పాల్గొన్న కార్యక్రమం పార్టీ కార్యక్రమమా, అధికారిక కార్యక్రమమా అధికారులు చెప్పాలని నిలదీశారు. అధికారిక కార్యక్రమమైతే గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరపడం ఆనవాయితీ అని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎం పీ ఇలా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవ లం పచ్చచొక్కాల వారితోనే కార్యక్రమం నిర్వహించడం దారుణమన్నారు.

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తమ చేతిలో ఓడిపోయి, ప్రజ లు తిరస్కరించిన వారిని వేదికనెక్కించి మా ట్లాడించడమేనా ప్రజాస్వామ్యం అంటూ ఘా టుగా ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే ప్రజ లు ఎదురు తిరుగుతారని, అప్పు డు ఏ అధికారి కూడా పని చే యలేడని హెచ్చరించారు.

 చంద్రబాబుకు పిచ్చిపట్టింది:కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
 ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమోనని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఏమీ చేయకపోయినా చేసినట్లు చెప్పుకొంటున్నారని, ఇది కూడా ఒక రక మైన వ్యాధేనన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా రూపాయి ఖర్చు పెట్టకపోయినా కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం మా ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  నేను మారిన మనిషిని అని పదేపదే చెబితే ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేశారని, ఈ ఏడాది పాలనతో ఆయన ఏమీ మారలేదని ప్రజలు గ్రహించారన్నారు. పోలీసులే లేకపోతే తప్పుడు వాగ్దానాలు చేసినందుకు జనం చొక్కాపట్టి ఈడ్చికొడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement