బాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి | Babu include the first convict | Sakshi
Sakshi News home page

బాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి

Published Sun, Jun 14 2015 2:20 AM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

బాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి - Sakshi

బాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి

ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి
 
 వీరపునాయునిపల్లె : ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉరుటూరు గ్రామంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ఆధారాలతో సహా చంద్రబాబు దొరికినా రేవంత్‌రెడ్డిని మాత్రమే అరె స్టు చేశారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో ఆ యనది ఒక పాత్ర మా త్రమేనన్నారు. దీనికి మూలకారకుడు చంద్రబాబేనని, ఆయనను దోషిగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

లేకపోతే తెలంగాణ ప్రభుత్వం, టీడీపీతో కుమ్మక్కు అయిందని భావించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలాగే ఉంటే టీడీపీ, తెలంగాణ ప్రభుత్వాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమం చేయాల్సి వస్తుందని, ఈ పరిస్థితి రాకముందే దోషులుగా ఉన్న 15 మందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదని, టీడీపీకి చెందినది మాత్రమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటరామిరెడ్డి, సర్పంచులు సాంబశివారెడ్డి, ఈశ్వర య్య, తలపనూరు మాజీ సర్పంచు లు ఉత్తమారెడ్డి, చెన్నకేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రజలను మోసం చేసింది చంద్రబాబే
 కడప ఎడ్యుకేషన్ : చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగా నే వాటిని విస్మరించి ప్రజలను మోసం చేశారని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కడప నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేక ర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగమిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగా నే అవన్నీ మరిచారన్నారు.

చంద్రబాబు రాయలసీమకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని  కేం ద్రాన్ని ఎదురించినందుకే జగన్‌పై అప్పట్లో అక్రమ కేసులు పెట్టారనే విషయం పిల్లవాడికీ కూడా తెలుసన్నారు. కానీ చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి, పట్టపగలు దొరికిపోయారని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement