ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష | YSRCP MLA Ravindranath reddy continues indefinite hunger strike | Sakshi
Sakshi News home page

ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష

Published Thu, Mar 5 2015 8:33 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష - Sakshi

ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష

కడప: తాగు, సాగు నీటి కోసం వైఎస్‌ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని గత అయిదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.

 

ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆయనకు సూచించారు. పార్టీ నేతల దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement