సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తమ పార్టీ ఎంపీలను కలుసుకోవడం చాలా గర్వంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ పదవులకు రాజీనామాచేసి.. ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఎంపీలు ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిస్వార్థంగా నిరాహార దీక్ష చేశారని, బలవంతంగా ఆస్పత్రులకు తరలించేవరకు ప్రాణాలకు తెగించి దీక్ష చేశారని వారి పోరాటాన్ని వైఎస్ జగన్ కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్ష స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని, కొందరి తరహాలో ప్రజలను మోసం చేసి.. మభ్యపెట్టే డ్రామాలు ఆడబోదని పరోక్షంగా చంద్రబాబు దీక్షను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
Proud to have met our 5 MPs who selflessly resigned from the LS for SCS & went on hunger strike, till forcibly hospitalized.Their actions are inspirational. YSRCP will continue its fight for #APSCS, unlike those interested only in hoodwinking, drama & token fasts.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 19 April 2018
Comments
Please login to add a commentAdd a comment