
చెన్నూరు : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి చెన్నూరు బెస్తకాలనీలో పార్టీ మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కమలాపురం నియోజకవర్గంలో ఏడాదికి 100 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నవర త్నాలు పథకం ద్వారా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల, మహిళల, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి అభివృద్ధికి పాటు పడతామన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బోలా పద్మావతి, పార్టీ నాయకులు ఆర్‌వీ సుబ్బారెడ్డి, పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, ముదిరెడ్డి రవీంద్రనా«థ్‌రెడ్డి, ఉప సర్పంచు ఖరీం మత్స్యకారుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment