
కోలుకుంటున్న ఈటల
సాక్షి, హైదరాబాద్: కారు బోల్తా ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎక్సెరే, ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు చేసిన వైద్యులు కాళ్లు, మెడ, చేతులు, వీపుపై చిన్నచిన్న గాట్లు తప్ప పెద్ద గాయాలేమీ లేవని నిర్ధారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటలను పరామర్శించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందులాల్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, బాలరాజ్, కనకారెడ్డి, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, చెన్నమనేని రమేష్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, సీతారాములు, రామచంద్రరావు, భాను ప్రసాద్, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మినారాయణలతో పాటు వివిధ జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈటలను పరామర్శించిన వారిలో ఉన్నారు.