Kazipet railway court
-
రైల్వే కేసులను కేంద్రం కొట్టివేయాలి
రైల్వే కోర్టుకు హాజరైన టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోర్టుకు గురువారం టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు హాజరయ్యారు. వేర్వేరు కేసుల్లో, వేర్వేరు సమయాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, పలువరు ఉద్యమకారులు రైల్వే కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి రైల్వే కేసులను పరిశీలించి వాయిదా వేస్తున్నట్లు తీర్పు చెప్పారని నేతలు అన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన రైల్వే కేసులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కొత్త రవి, ఉడుతల బాబురావు, విజయ్‌కుమార్, సంతోష్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, వంశీ పాల్గొన్నారు. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రి ఈటెల
కాజీపేట రూరల్ (వరంగల్) : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్-జమ్మికుంట మధ్య జరిగిన రైల్ రోకో కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం కాజీపేట రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. కాగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పించుకుంటున్నారని ఈటెల పేర్కొన్నారు. ఆడియో టేపులు బయటపెట్టక ముందు ఒకలా, బయటపెట్టిన తర్వాత మరోలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి వెంట ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.