రైల్వే కోర్టుకు హాజరైన
టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోర్టుకు గురువారం టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు హాజరయ్యారు. వేర్వేరు కేసుల్లో, వేర్వేరు సమయాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, టీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, పలువరు ఉద్యమకారులు రైల్వే కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి రైల్వే కేసులను పరిశీలించి వాయిదా వేస్తున్నట్లు తీర్పు చెప్పారని నేతలు అన్నారు.
వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన రైల్వే కేసులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కొత్త రవి, ఉడుతల బాబురావు, విజయ్‌కుమార్, సంతోష్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వంశీ పాల్గొన్నారు.
రైల్వే కేసులను కేంద్రం కొట్టివేయాలి
Published Fri, Jan 6 2017 12:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement