సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో జరిగిన రైలు రోకో కేసు వ్యవహారంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది.
కాగా, 2011లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనపై రైలు రోకో కేసులో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్‌లో కోరారు. తాను రైలు రోకోలో పాల్గొనలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, కేసీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment