సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముందస్తు చర్యలు లేకే డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య. పెరుగుతోంది. ఎంజిఎంలో రోజుకు 30 జ్వరం కేసులు నమోదు అవుతుండగా.. రెండు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో 20 పడకల ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుత రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని.. డెంగ్యూ ఇమేజింగ్ ఫీవర్, డెంగ్యూ షాట్ సిండ్రోమ్ వస్తే వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని సూపరిండెంట్ మురళి తెలిపారు.
భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment