పీహెచ్సీలో తనిఖీలు నిర్వహించిన ప్రభుత్వ విప్ | Gongidi Sunitha checking in yadagirigutta phc | Sakshi
Sakshi News home page

పీహెచ్సీలో తనిఖీలు నిర్వహించిన ప్రభుత్వ విప్

Published Sat, Jun 4 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

Gongidi Sunitha checking in yadagirigutta phc

యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న పలు అవకతవకలు వెలుగు చూశాయి. ఉదయం 11 గంటలు అవుతున్నా వైద్యులు ఎవరూ ఇంకా ఆసుపత్రిలో విధులకు హాజరు కాలేదు.

పైగా కొందరు ఉద్యోగులు శనివారం విధులకు హాజరయినట్లు శుక్రవారమే అటెండెన్స్లో సంతకం చేసినట్లు సునీత గుర్తించారు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ఖాళీ మద్యం బాటిళ్లను కూడా ఆమె గుర్తించారు. దీనిపై ఆమె సిబ్బంది వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని సునీత వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement