gongidi sunitha
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెనుప్రమాదం తప్పింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో భేటీ తర్వాత లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడానికి సునీత సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీలింగ్ పైకప్పు పెచ్చులు ఊడి అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్‌పై పెచ్చులు పడటంతో టేబుల్ విరిగి గ్లాస్ ముక్కలు తగలడంతో ఆమె మోకాళ్లు, చేతి వేలికి గాయమైంది. సునీత పక్కనే ఉన్న ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇందిర, గొలనుకొండ సర్పంచ్ లక్ష్మి తలలకు గాయాలయ్యాయి. వారి ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
టీఆర్ఎస్ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దాం
సాక్షి, గుండాల : టీఆర్ఎస్ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దపడిశాల, గుండాల, సుద్దాల గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో బీబీ నగర్లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే మరింత అభివృద్ధికి దోహద పడతారన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యర్థిగా గుర్తించి తనను పార్లమెంట్‌కు పంపిస్తే మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బండ రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దశరథ, పశు గణనాభివృద్ధి జిల్లా చైర్మన్, మోతె పిచ్చిరెడ్డి, నాయకులు ఎం.ఎ.రహీం, పాండరి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘గొంగిడి’కి నిరసన సెగ
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు టీఆర్ఎస్లోని అసంతృప్త వర్గం నుంచి నిరసన ఎదురైంది. ఆదివారం ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో డప్పు వాయిద్యాలు నిర్వహిస్తున్న బొద్దు సురేశ్ ఎమ్మెల్యేకు అడ్డుగా ఉండటాన్ని గమనించి పక్కకు జరగమని ఓ వ్యక్తి అనడంతో గొడవ మొదలైంది. దీంతో అసంతృప్త వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కలుగజేసుకుని ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గొడవకు కారణమైన బొద్దు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకోవటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, టీఆర్ఎస్ అసంతృప్తవాదుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ అర్ధనగ్నంగా వారి వాహనం ఎదుట బైఠాయించి, పోలీసుల జులుం నశించాలి, సునీత గో బ్యాక్, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. -
'పీహెచ్‌సీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సునీత, డీఎం అండ్ హెచ్ఓ డి.కె.చారిలు ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. యాదగిరిపల్లె పీహెచ్‌సీని 16 పడకలతో 24 గంటల ఆస్పత్రిగా మారుస్తున్నామంటూ సౌకర్యాల మెరుగుకు కృషి చేసిన ఆస్పత్రి సిబ్బందిని ఆమె అభినందించారు. -
చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదిగిరగుట్టలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు గొంగడి సునీత చీరలు పంపిణీ చేశారు. -
పీహెచ్సీలో తనిఖీలు నిర్వహించిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న పలు అవకతవకలు వెలుగు చూశాయి. ఉదయం 11 గంటలు అవుతున్నా వైద్యులు ఎవరూ ఇంకా ఆసుపత్రిలో విధులకు హాజరు కాలేదు. పైగా కొందరు ఉద్యోగులు శనివారం విధులకు హాజరయినట్లు శుక్రవారమే అటెండెన్స్‌లో సంతకం చేసినట్లు సునీత గుర్తించారు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ఖాళీ మద్యం బాటిళ్లను కూడా ఆమె గుర్తించారు. దీనిపై ఆమె సిబ్బంది వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని సునీత వెల్లడించారు. -
అమెరికాలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
లాస్ ఏంజెలెస్: బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అభినందనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో సాగు, తాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాస్ ఏంజెలెస్ తెరాస కార్యకర్తలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తర అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్-యూఎస్ఏ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గీతాన్నిఆలపించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరులను స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ సిద్ధాంతకర్త, స్వర్గీయ జయశంకర్ గారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని రమేష్ గట్టు, హరిందర్ తాళ్లపల్లి నిర్వహించారు. పాలేరు ఉప ఎన్నిక నల్లేరుపై నడకని, తెరాస విజయం తథ్యమని కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, స్వచ్చ హైదరాబాద్, మహిళల రక్షణకు షీ టీమ్స్, ఇంకుడు గుంతలు లాంటి కార్యక్రమాల్ని చేపట్టారని గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాపారాన్ని, అవినీతిని అరికట్టడానికి చేపట్టిన చర్యలను పలువురు ఎన్నారైలు అభినందించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా కార్యకర్తలు హజరయ్యారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్-యూఎస్ఏ నాయకులు విజయ్ రెడ్డి తుపల్లి, యుగంధర్ రెడ్డి మోతే, సురేశ్ రెడ్డి, చంద్ర వలబోజు, రవి ధరనిపతి, విజయ్ కసనగొట్టు, ప్రవీణ్ ఎర్రమాడ, ప్రహ్లాద్ ఇనగంటి, కిరణ్ బొడ్ల తదితరులు పాల్గొన్నారు. -
డీకే అరుణ వర్సెస్ సునీత
అసెంబ్లీలో మహిళా సభ్యుల వాగ్వాదం లాబీల్లోకి మద్యం వ్యాపారిని తెచ్చారన్న డీకే అరుణ మైనింగ్ అక్రమాలపై ఏమంటారంటూ నిలదీసిన సునీత సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బుధ వారం అధికార, విపక్ష సభ్యులు గొంగిడి సునీత, డీకే అరుణ మధ్య తీవ్రస్థాయి వాగ్యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో బుధవారం సభ కొద్దిసేపు అట్టుడికింది. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రస్తావించిన అంశంపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ సభ్యురాలు సునీతకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే తమకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా స్పీకర్ అనుమతించకపోవడంతో వారంతా వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. ఓ మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీల్లోకి తీసుకొచ్చి మంత్రిని కలిపించారన్న అంశాన్ని జీరో అవర్‌లో డీకే అరుణ లేవనెత్తారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ సమయంలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు కల్పించుకుని, పత్రికల్లో వచ్చిన వార్తను పట్టుకొని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘నేనేమైనా వారికి వత్తాసు పలికానా.. పత్రిక కథనాన్ని పట్టుకుని నన్ను అంటారా’ అని అడిగారు. ఇదే సమయంలో తనకు అవకాశమివ్వాలని గొంగిడి సునీత లేవగా స్పీకర్ అనుమతించారు. ఆమె మాట్లాడుతూ ‘మద్యం వ్యాపారిని తీసుకొచ్చినట్లు నిరూపిస్తారా? ఆ రోజు వచ్చింది ప్రైవేటు పీఆర్వో మాత్రమే. ఆరోపణలు చేసేప్పుడు అరుణ అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. అరుణకు సంబంధించి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారని పత్రికలో వార్త వచ్చింది. అది నిజమే అనుకోవాలా’ అని ఎదురుదాడికి దిగారు. తాము పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చామని, అక్రమ మైనింగ్ చేసి రాలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను డీకే అరుణ కోరారు. అయితే మైక్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఆమె పోడియం ముందుకు దూసుకొచ్చారు. ఆమెకు మద్దతుగా మిగతా సభ్యులు సైతం పోడియంలోకి వచ్చి మైక్ కోసం పట్టుబట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటే రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆయన టీ విరామం ప్రకటించారు. సభ తిరిగి ఆరంభమయ్యాక సైతం కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. అరుణకు ఒక్క నిమిషం అవకాశ మివ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ జీరో అవర్‌లో మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీసేస్తామని స్పీకర్ చెప్పినందున కాంగ్రెస్ సభ్యులు సభకు సహకరించాలని కోరారు. అయినా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం జానా లేచి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
అసెంబ్లీలో అరుణ, సునీత పరస్పర వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలోకి మద్యం వ్యాపారీ ఎలా వచ్చాడని డీకే అరుణ ప్రశ్నించారు. మద్యం వ్యాపారి కోసం ఎక్సైజ్ మంత్రితో విప్ సునీత పైరవి చేయించారని ఆమె ఆరోపించారు. లాబీలో జరిగిన ఈ ఘటనపై స్పందించి... జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చించాలని డీకే అరుణ... స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో డీకే అరుణ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ సునీత ఆరోపించారు. ఈ సమయంలో ఇరువురి మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో స్పీకర్ శాసనసభకు ట్రీ బ్రేక్ అంటూ ప్రకటించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలోకి మద్యం వ్యాపారి వచ్చి... ప్రభుత్వ చీప్ వీప్ గొంగడి సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావును కలిసి... సదరు మద్యం వ్యాపారి ఏదురైన సమస్య తీర్చినట్లు సమాచారం.