అసెంబ్లీలో అరుణ, సునీత పరస్పర వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలోకి మద్యం వ్యాపారీ ఎలా వచ్చాడని డీకే అరుణ ప్రశ్నించారు. మద్యం వ్యాపారి కోసం ఎక్సైజ్ మంత్రితో విప్ సునీత పైరవి చేయించారని ఆమె ఆరోపించారు.
లాబీలో జరిగిన ఈ ఘటనపై స్పందించి... జీరో అవర్లో ఈ అంశంపై చర్చించాలని డీకే అరుణ... స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో డీకే అరుణ అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ సునీత ఆరోపించారు. ఈ సమయంలో ఇరువురి మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో స్పీకర్ శాసనసభకు ట్రీ బ్రేక్ అంటూ ప్రకటించారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీలోకి మద్యం వ్యాపారి వచ్చి... ప్రభుత్వ చీప్ వీప్ గొంగడి సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావును కలిసి... సదరు మద్యం వ్యాపారి ఏదురైన సమస్య తీర్చినట్లు సమాచారం.